
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ప్రైవేటు కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి విద్యార్థులకు శాపమైంది.
శాతవాహన యూనివర్శిటీ : ప్రైవేటు కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి విద్యార్థులకు శాపమైంది. పరీక్షల సమయానికి హాల్‌టికె ట్లు ఇస్తామనే యాజమాన్యం మాటలు నమ్మి విద్యార్థులు మోసపోయారు.
తమ కళాశాలకు ప్రత్యేక అనుమతి కోసం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉందని, దాని నుంచి ఇప్పటివరకు అనుమతి రాలేదని క్రిసెంట్ డీఈడీకళాశాల యాజమాన్యం చేతులె త్తేసింది. దీంతోతాము మోసపోయూమని వి ద్యార్థులు కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ప్రత్యేక అనుమతినిచ్చిపరీక్షల రాయడానికి అవకాశం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
పరీక్ష కోల్పోయిన50 మంది విద్యార్థులు...
క్రిసెంట్ డీఎడ్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 50మంది విద్యార్థులున్నారు. వీరందరికి కళాశాల యాజమాన్యం మేనేజ్‌మెంట్ కోటాలో లక్షలాది రూపాయలకు సీట్ల అమ్మే క్రమంలో కళాశాలకు అనుమతి ఉందని నమ్మబలికింది. డీఈవో అనుమతి మేరకు వివిధ పాఠశాలల్లో టీచింగ్ ప్రాక్టీస్ చేయడంతో అనుమతి ఉందని నమ్మారు.
పరీక్షల సమయం దగ్గర పడడం, హాల్‌టికెట్లు ఇవ్వడానికి జాప్యం చేయడంతో అసలు విషయం బయటపడింది. కళాశాలకు ఎస్‌ఈఆర్‌టీ నుంచి పర్మిషన్ లేదన్న విషయం తెలిసింది. దీంతో హాల్‌టికెట్స్ రాక బుధవారం ప్రారంభమైన డీఎడ్ ఫస్టియర్ వార్షిక పరీక్షలకు క్రిసెంట్ కళాశాలలో 50 మంది విద్యార్థులు అర్హతను కోల్పోయారు.
నిబంధనలు పాటించకనే..
క్రిసెంట్ డీఎడ్ కళాశాల నిర్వహిస్తున్న ఒక భవనంలోనే పాఠశాలస్థాయి నుంచి బీఈడీ, డీఎడ్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. డీఎడ్ కోర్సు నిర్వహణకు ఎస్‌ఈఆర్‌టీ నుంచి ఏటా అఫ్లియేషన్ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కళాశాలకు సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వ అనుమతి నిమిత్తం పంపించినా కొన్ని కారణాలతో అనుమతి రాలేదన్న అభిప్రాయాలున్నాయి.
దీనిని పర్యవేక్షణ తన పరిధిలో లేదని డీఈవో జిల్లా రెవెన్యూ అధికారుల ముందే స్పష్టం చే శారు. అరుుతే అధికారం లేనిదే టీచింగ్ ప్రాక్టీస్‌కు పంపే క్రమంలో డీఈవో అనే మాటను కళాశాల నిర్వాహకులు ఎందుకు చెప్పారని విద్యార్థులు ప్రశ్నించారు. ఎస్‌ఈఆర్‌టీ నామ్స్ మేరకు మా పరిధిలో పనిచేశామని జిల్లా విద్యాధికారి చెప్పారు.
రాస్తారోకో... ఆందోళనలు
కళాశాల నిర్లక్ష్యంతో అర్హత కోల్పోయిన 50 మంది విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన బాటను ఎంచుకున్నారు. ఉదయం క్రిసెంట్ కళాశాల ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించి హాల్‌టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు కన్నీరుపెట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు, విద్యాధికారికి విన తిపత్రం రాశారు.
ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన డీఈవోకు విషయూన్ని వివరించారు. సమస్య తన పరిధిలో లేదని జిల్లా విద్యాధికారి చెప్పారు. అప్పుడే కలెక్టర్ వాహనం అటు వైపు రావడంతో ఎంతోఆశతో విద్యార్థులు కలెక్టర్‌ను కలిశారు. దానిపై విచారణ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.