మైనార్టీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారు.. | tdp government neglect the minorities | Sakshi
Sakshi News home page

మైనార్టీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారు..

Published Wed, Apr 5 2017 6:01 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

tdp government neglect the minorities

మైనార్టీల ద్రోహిలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ హంజాహుస్సేన్‌ ఆరోపించారు.

నెల్లూరు: మైనార్టీల ద్రోహిలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ హంజాహుస్సేన్‌ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలను అవమానించే విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. మైనార్టీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన బాబు ప్రస్తుతం మోసం చేయడం తగదని హితవు పలికారు.

చంద్రబాబు అక్రమ ఆస్తులకు బినావీులుగా ఉన్న వారికి మంత్రి పదవులిచ్చారని ఆరోపించారు. గతంలో బీజేపీపై నిందలు వేసి ఇప్పుడు ఆ పార్టీతో చంద్రబాబు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీలో ఉన్న మైనార్టీలు పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మైనార్టీలందరూ ఏకమై చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. నాయకులు ఇంతియాజ్, అబూబాకర్, ఫయాజ్‌ అహ్మద్, రఫీ, హాజీ, మగ్దూమ్‌ మొమద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement