అయ్యో.. ఆయుర్వేదం
► వంద పడకల ఆస్పత్రిలో 35 మందే సిబ్బంది
► ఏడాదిలో మందులు ఇచ్చేది రెండు నెలలే
► అవసరాలు తీర్చని అరకొర బడ్జెట్
► రోగులకు సేవలందించలేని ఆయుర్వేదాస్పత్రి
పోచమ్మమైదాన్ : ప్రాచీన కాలం నుంచి ఆదరణ పొందుతున్న ఆయుర్వేద వైద్యానికి పాలకుల నుంచి మాత్రం నిర్లక్ష్యమే ఎదురవుతోంది. కార్పొరేట్ ఆస్పత్రిని తలపించేలా రెండు ఎకరాల విస్తీర్ణంలో సొంత భవనంలో కొనసాగుతున్న వరంగలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలోని సమస్యలను పరిశీలిస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు. ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతుండడంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి.. ఆస్పత్రిని 58 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, ఉద్యోగుల భర్తీని ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నారుు. ఇక ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులు ఇచ్చేందుకు సరిపడా బడ్జెట్ కేటారుుంచడం లేదు. మందుల విషయంలో రోగులకు సమాధానం చెప్పలేక విసిగిపోరుున వైద్యులు మందుల లేనందున రోగులు సహకరించాలి అని కోరుతూ ఏకంగా బోర్డు పెట్టడం గమనార్హం.
61 పోస్టులు.. 26 ఖాళీ
ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో మొత్తం 61 పోస్టులు మంజూరు ఉండగా.. కేవలం 35 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏకంగా 26 పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్న వారిపై భారం పడడమే కాకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందడం లేదు. ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుతో పాటు బయోకెమిస్టు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, టైపిస్టు, రేడియూలజిస్టు, ఇద్దరు డ్రైవర్లు, రిజిస్టర్ రైటర్, ముగ్గురు దాయాలు, మాసాజిస్టు, నర్సింగ్ ఆర్డర్లీ, ఎక్స్‌రే టెక్నీషియన్, ఇద్దరు వంట మనుషులు, క్లీనర్, ఇద్దరు స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్ ఆయుర్వేద ఆస్పత్రిలో పోస్టులు భర్తీ చేసేలా జిల్లా ప్రజాప్రతినిధులు చూపాలని పలువురు కోరుతున్నారు.
అరకొర మందులు...
ఆయుర్వేద ఆస్పత్రికి మందుల కోసం ఏటా రూ.4లక్షల బడ్జెట్ కేటారుుస్తున్నారు. ఏదై నా ఓ పెద్దాస్పత్రిలో ఫినారుుల్ కోసం కేటారుుంచే బడ్జెట్‌కు ఇది సమానమని వైద్యులు చెబుతున్నారు. ఈ బడ్జెట్‌తో ఏడాదిలో రెం డు నెలల మాత్రమే మందులు సరఫరా చే యగలుగుతున్నారు. ఇక మిగిలిన పది నెల లు రోగులకు మందులు ఇవ్వలేక.. ఎందు కు ఇవ్వడం లేదని అడిగే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైద్యులు, సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థారుులో మందులు ఇవ్వాలంటే ఏడాదికి రూ.40లక్షలు అవసరమవుతారుు.
దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు కూడా. ఆ ప్రతిపాదనలు పరి శీలనలోనే ఉండడంతో ‘రోగులకు గమనిక .. మందుల సరఫరా కావడం లేనందున సహకరించగలరు...’ అని కోరుతూ ఓ నోటీ సు అంటించారు. ఇదేకాకుండా రేడియాలాజిస్ట్ అకాల మరణంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగులకు ఎక్స్‌రే తీయడ ం లేదు. ఫలితంగా రోగ నిర్ధారణ సాధ్యంకాక వైద్యులు పరిశీలించకపో గా... రోగులు ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లను ఆశ్రరుుంచాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలతో వంద పడకలు ఉన్న ఈ ఆస్పత్రికి ఏనాడూ 60 మందికి మించి రోగులు రావడం లేదు. అరుుతే, వచ్చిన రోగులకు కూడా సిబ్బంది, మందుల కొరత కారణంగా సరైన వైద్య సేవలందడం లేదు.
మందు గోలీలు ఇవ్వలేదు
ఆస్పత్రికి వస్తే వైద్యులు చూసినప్పటికీ ఒక్క గోళీ ఇవ్వలేదు. గోళీలు లేని ఆస్ప త్రి ఎందు కు? కాళ్లకు తిమ్మిర్లు వస్తున్నాయని చెబితే చిట్టీ రాసిచ్చారు. బయట దుకాణంలో అడిగితే మందులకు రూ.300 అవుతుందన్నారు. అవి కొనుక్కోలేకే కదా గవర్నమెంట్ దవాఖానాకు వచ్చింది. అందుకే ఇంటికి ఎల్తాన.
- నర్సయ్య, రోగి
ఎన్నోమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం...
ఆస్పత్రిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నారుు. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్నోమార్లు వివరించాను. ఆస్పత్రిని సందర్శించిన ప్రజాప్రతినిధులందరికీ వివరాలు అందించాను. ఖాళీలు భర్తీ చేస్తేనే తప్ప రోగులకు సరైన న్యాయం చేయలేం. ఇక మందుల పరిస్థితి కూడా అదే.
- సుద్దాల రాజమౌళి, ఆస్పత్రి సూపరింటెండెంట్