- అమృత నర్సింగ్ హోంకు వినియోగదారుల ఫోరం ఆదేశం
రూ. 16 లక్షల పరిహారం చెల్లించాలి
Published Wed, Sep 28 2016 12:23 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
వరంగల్ లీగల్ : వైద్యం కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాలికకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, బాలిక కుడి చెయ్యి మనికట్టు వరకు తొలగించడానికి కారణమైన అమృత పిల్లల నర్సింగ్‌హోం డాక్టర్ రమేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్‌స కం పెనీ వారు రూ.16 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్‌చార్జి ప్రెసిడెంట్ పటేల్ ప్రవీణ్‌కుమార్, మెంబర్ ఎస్‌బీ భార్గవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన దోమల రమేష్‌బాబు తన కూతురు సౌమ్య(4) జలుబు, జ్వరంతో బాధపడుతుండగా 2003 జనవరి 31న హన్మకొండ కిషన్‌పురలోగల అమృత పిల్లల నర్సింగ్‌హోంకు తీసుకవెళ్లారు. వైద్యు డు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో అడ్మిట్ చేశా రు. ఇంజక్షన్‌ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి బాలిక కుడిచేతికి ఐవి క్యాన్‌పెట్టారు. మరుసటి రోజు పాప చెయ్యి వాపు రావడంతో నొప్పిగా ఉందని డాక్టర్‌కు తెలిపారు. అది మామూలేనని, కంగారు పడాల్సింది లేదని చెప్పారు. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జి చేశా రు. ఆ సమయంలో చేతికి ఉన్న ఐవి క్యాన్ తీసివేయలేదు. ఇంకా కొన్ని ఇంజక్షన్లు ఉన్నాయని, అందుకోసం ఐవి క్యాన్ ఉంచాలని చెప్పారు.
ఇంటికి వెళ్లిన తెల్లవారి పాప చెయ్యి వాపు వచ్చి చర్మం రంగు మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్ లేడు. అలా రెండు రోజులు తిరిగిన తర్వాత ఫిబ్రవరి 8న కలిసిన డాక్టర్ ఐవి క్యాన్‌తొలగించి, పిల్లల వైద్యుడైన డాక్టర్ గోపాల్‌ను సంప్రదించాలని సూచించా రు. బాలిక చెయ్యి ఇన్‌ఫెక్షన్‌అయిందని. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని డాక్టర్ గోపాల్ చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఐదు రోజుల తర్వాత ఉస్మానియా వైద్యశాలకు, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలిం చారు. ఇన్‌ఫెక్షన్ అయినందున చెయ్యి తొలగించాలని నిమ్స్ వైద్యులు చెప్పగా, తిరిగి ఎంజీఎంకు తీసుకొచ్చారు. చివరకు 2003 మార్చి 10న సౌమ్య కుడి చెయ్యి మడమ వరకు తొలగించారు.
అమృత నర్సింగ్‌హోం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సౌమ్య జీవితం నాశమైందని, నష్టపరిహారం గా రూ.16 లక్షలు, వైద్యం కోసం అయిన రూ.51,800 మొత్తం డబ్బులు డాక్టర్ రమేష్ చెల్లించాలని కోరు తూ దోమల రమేష్‌బాబు 2003 ఏప్రిల్‌లో జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన విని యోగదారుల ఫోరం ఇన్‌చార్జి ప్రెసిడెంట్ ప్ర వీణ్‌కుమార్, మెంబర్ భార్గవి బాధితురాలికి నష్టపరిహారంగా రూ.16 లక్షలు నెల రోజులలోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Advertisement