నా మాట విననందుకే యడ్యూరప్పకు నేడీ దుస్థితి: హన్స్ రాజ్ భరద్వాజ్ | Yaddurappa didn't care of my words, says Hansraj Bhardwaj | Sakshi
Sakshi News home page

నా మాట విననందుకే యడ్యూరప్పకు నేడీ దుస్థితి: హన్స్ రాజ్ భరద్వాజ్

Published Wed, Sep 18 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

Yaddurappa didn't care of my words, says Hansraj Bhardwaj

సాక్షి, బెంగళూరు: తన మాటలను యడ్యూరప్ప నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు ఆయన తన పదవి కోల్పోయి.. ఈ స్థితికి చేరుకున్నారని కర్ణాటక గవర్నర్ హన్స్ రాజ్ భరద్వాజ్ అన్నారు. బెంగళూరు రిపోర్టర్స్ గిల్డ్, బెంగళూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. గవర్నర్ మీట్ ది ప్రెస్ నిర్వహించడం ప్రెస్‌క్లబ్ చరిత్రలో ఇదే ప్రథమం.

 

‘అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించవద్దని నేను కర్ణాటక గవర్నర్‌గా ఇక్కడకు వచ్చిన వెంటనే యెడ్డీకి సూచించా. అయితే ఆయన నా మాటను నిర్లక్ష్యం చేశారు. మంత్రివర్గంతో కలిసి నాపై విమర్శల దాడికి దిగారు. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడం.. ఆ తర్వాత సీబీఐ విచారణ ప్రారంభం కావడం.. యెడ్డీ పదవి కోల్పోవడం.. తెల్సిందే. అప్పుడే నా మాట విని ఉంటే యడ్యూరప్ప పదవిని కోల్పోయే వారు కాదు’ అని గవర్నర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement