Hansraj Bhardwaj
-
కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్ కన్నుమూత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్స్‌రాజ్ భరద్వాజ్(83) కన్నుమూశారు. కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్న హన్స్‌రాజ్ బుధవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో చేరారు. అయితే ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. హన్స్‌రాజ్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్‌రాజ్ అంత్యక్రియం సోమవారం సాయంత్రం నిగంబోద్ ఘాట్‌లో నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు అర్జున్ భరద్వాజ్ తెలిపారు. కాగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన హన్స్‌రాజ్.. ఆ తర్వాత కర్ణాటక, కేరళ గవర్నర్‌గా సేవలందించారు. -
రగిలిన ఫైర్
బహిరంగంగా గవర్నర్, సీఎం పరస్పర విమర్శలు కరువు నివారణ పనుల్లో అలసత్వం : గవర్నర్ కోడ్ వల్లే ఆలస్యమని సీఎం చెబుతున్నారు కరువు పనులకు కోడ్ అడ్డుకాదు న్యాయశాఖ మంత్రిగా పనిచేశా.. కోడ్ గురించి నాకు తెలియదా? నెలన్నరగా పరిష్కారం కాని సమస్యలు ఇకనైనా మంత్రులు, అధికారులు స్పందించాలి సాక్షి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుతం పనితీరుపై ఇన్నాళ్లూ నాలుగు గోడల మధ్య అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ మొదటి సారిగా బహిరంగంగా సీఎం, మంత్రులను విమర్శించారు. వాటిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఘాటుగానే స్పందించారు. పరోక్షంగా గవర్నర్‌పై ఎదురుదాడికి దిగారు. బసవ జయంతి సందర్భంగా బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ వద్ద ఉన్న బసవణ్ణ విగ్రహానికి గవర్నర్ పూలమాల వేసి శుక్రవారం నివాళుర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు నివారణ పనులు సక్రమంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రిని రాజ్‌భవన్‌కు పిలిపించుకుని మాట్లాడానని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ పనులు చేపట్టడానికి వీలుకాలేదని సీఎం చెప్పుకొచ్చారని తెలిపారు. అయితే కరువు నివారణ పనులు చేపట్టడానికి కోడ్ అడ్డుకాదని, 15 ఏళ్ల పాటు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన తనకు ఈ విషయం స్పష్టంగా తెలుసునని అన్నారు. రాష్ర్టంలో ప్రజాసమస్యలు దాదాపు నెలన్నరగా పరిష్కారం కావడం లేదని, ఇకనైనా మంత్రులు, అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఘాటుగా విమర్శించారు. సీఎం ఎదురుదాడి.. గవర్నర్ విమర్శలపై సీఎం సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. కరువు నివారణ పనులు చేపట్టడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక ప్రభుత్వం బాగా పనిచేస్తోందని తెలిపారు. బెంగళూరులో మీడియాతో ఆయన శుక్రవారం మాట్లాడారు. బసవణ్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ విభాగాలకు చెందిన మంత్రులు, అధికారులు ప్రజా సమస్య పరిష్కారం కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఈ విషయమై తమకు ఎవరి సర్టిఫికెట్టు అవసరం లేదని పరోక్షంగా గవర్నర్‌ను దెప్పిపొడిచారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు. మీడియా కూడా వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలని, గవర్నర్‌తో తాను భేటీ అయినప్పుడు తమ మధ్య నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయం ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు. -
గ్రామీణులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలి
గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ సాక్షి,బెంగళూరు: నాణ్యమైన విద్య, వైద్యాన్ని సమాజంలోని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా గుర్తించాలని గవర్నర్ హన్స్‌రాజ్‌భరద్వాజ్ పేర్కొన్నారు. విశ్వ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాయలంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అద్దాల మేడలతో కూడిన భవంతులు నిర్మించిన మాత్రాన ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం దక్కదని, గ్రామీణులకు కూడా సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందజేయాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవ, నవజాతి శిశుమరణాలు పల్లెల్లోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని అర్థికంగా వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించే వినూత్న పథకాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విధానాలు ప్రాచూర్యం పొందుతున్నాయన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద క్లీనిక్‌లను ప్రారంభించడం వల్ల కొంత ఉపయోగముంటుందన్నారు. ఆయుర్వేద వైద్య విద్యార్థులకు ఉపాధి చూపించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ కే.ఎస్ శ్రీ ప్రకాశ్, కర్ణాటక హోమియోపతి వైద్యుల సంఘం అధ్యక్షుడు బీ.టీ రుద్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణులకు అందని నాణ్యమైన వైద్యం
వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సదస్సులో గవర్నర్ భరద్వాజ్ సాక్షి, బెంగళూరు : దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంవత్సరాలు గడచినా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ వైద్య విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రారంభమైన వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సదస్సు కార్యక్రమంలో వుఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా మంది వైద్యులు సంపాదనే ధేయంగా పనిచేస్తున్నారన్నారు. దీంతో నగర, పట్టణప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులను స్థాపించడం, లేకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు తప్పితే గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఉత్తమ వైద్య సేవలు అందజేయాల్సిన బాధ్యత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయమన్నారు. ప్రజల జీవన శైలి మారుతున్న తరుణంలో నూతన వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయన్నారు. ఈ విషయమై విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు ఎక్కువ దృష్టి సారించి వ్యాధులకు చికిత్స విధానాలు కనుగొనాల్సి ఉందన్నారు. అంతేకాకుండా పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎక్కువగా విశ్వవిద్యాలయాలపై ఉంటుందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉమాశ్రీకి పీహెచ్డీ పట్టా అందించడం కోసం మైసూరు ఓపెన్ యూనివర్శిటీ కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకువ చ్చిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే వర్శిటీ రోజువారి విధుల్లో చాన్స్‌లర్ హోదాలో ఉన్న తాను తలదూర్చనని చెప్పుకొచ్చారు. బెంగళూరు యూనివర్శిటీ వైస్‌చాన్స్‌లర్ తిమ్మేగౌడ సమర్థుడని, సొమ్ములకు పట్టాలు విక్రయించే సంఘటనలు పునరావృతం కాకుండా ఆయన చర్యలు తీసుకుంటారని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు గవర్నర్ భరద్వాజ్ సమాధానం ఇచ్చారు. -
రాజ్‌భవన్ ప్రైవేట్ ఆస్తి కాదు
సాక్షి, బెంగళూరు : ‘రాజ్‌భవన్ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తేమీ కాదు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోయినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మేం చూస్తూ ఊరుకోము. గవర్నర్‌కు ఫిర్యాదు చేసి తీరతాం’ అని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. బీజేపీ నేతలకు తన వద్దకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదంటూ గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. తుమకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుగాడితప్పిన సందర్భాల్లో గవర్నర్‌కు కాక మరెవరికి ఫిర్యాదు చేస్తామంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ భరద్వాజ్ ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినందువల్ల ఆ పార్టీ అగ్ర నేతల మెప్పు పొందేందుకు తమను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం కాగానే ఆ నిర్ణయాన్ని, పథకాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించేస్తోందని అన్నారు. అందుకే ప్రభుత్వ విధానాలపై సమీక్ష జరపాల్సిందిగా కోరుతూ గవర్నర్‌ను కలవనున్నామని తెలిపారు. అయితే ఎప్పుడు గవర్నర్‌ను కలుస్తారంటూ విలేకరులు ప్రశ్నించగా... పార్టీ సీనియర్ నేతలందరితో చర్చించి తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. -
తప్పు చేస్తే ఏ ప్రభుత్వమైనా చర్యలు తప్పవు
నాతో చర్చించడానికి బీజేపీ నాయకులకు ధైర్యం లేదు గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ తుమకూరు, న్యూస్‌లైన్ : తప్పు చేసిన ఏ ప్రభుత్వమైనా చర్యలు తప్పవని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ అన్నారు. ఆదివారం తుమకూరు వర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మంత్రిమండలిలో చేర్చుకున్న విషయంతో సహా మిగిలిన ఏ విషయాల పైనైనా బీజేపీతో సహా మిగిలిన నాయకులెవరైనా తనతో స్వేచ్ఛగా మాట్లాడవ చ్చన్నారు. వారికి తాను సరైన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే బీజేపీ నాయకులకు తనతో మాట్లాడే ధైర్యం లేదన్నారు. తుమకూరు వర్శిటీ లోగో విషయమై కొంతమంది విద్యార్థులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్నవిషయాలను విడిచిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వీ దేశ్‌పాండే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేసిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి స్థానం ఇవ్వాలనుకోవడంలో తప్పులేదన్నారు. ఈ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని భావించడం సరికాదన్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో ఉన్నత శ్రేణి మార్కులు సాధించిన విద్యార్థులకు 38 స్వర్ణ పతకాలను అందజేశారు. ఇక ఇదే సందర్భంలో సామాజిక సేవ కార్యకర్తలు నరసమ్మ, శంకర్, గోవింద గౌడ్, నయిస్తాలకు గవర్నర్ భరద్వాజ్ గౌరవ డాక్టరేట్లను అందజేశారు. కార్యక్రమంలో తుమకూరు వర్శిటీ వైస్ చాన్స్‌లర్ రాజాసాహెబ్, రిజిస్టార్లు సిద్ధలింగయ్య, జయరామ్ పాల్గొన్నారు. అక్రమాలపై దర్యాప్తునకు డిమాండ్ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ భరద్వాజ్‌ను కొందరు విదృ్యర్థి సంఘాల నాయకులు చుట్టుముట్టారు. గతంలో యూనివర్శిటీ ఇచ్చిన పీహెచ్డీ పౄ్టల ప్రదానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ అక్రమాలపై తక్షణమే విచారణకు ఆదేశించాలని వారు గవర్నర్‌ను కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని గవర్నర్ విద్యార్థులతో అన్నారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులు పంపించి వేశారు. -
లాడ్ బర్తరఫ్ వ్యవహారం సీఎం పరిధిలో ఉంది
సాక్షి, బెంగళూరు : అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ను మంత్రిమండలి నుంచి తొలగించడమా లేదా కొన సాగించడమా అన్న విషయం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ స్పష్టం చేశారు. బెంగళూరు శివారులోని జక్కూరు వైమానిక స్థావరంలో సోమవారం జరిగిన ఎన్సీసీ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సంతోష్‌లాడ్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడుతున్నానన్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి తనకు అందిన ఆధారాలన్నీ సీఎంకు అందజేసానన్నారు. ఈ విషయంలో తన పరిధి మేరకు నడుచుకుంటున్నానన్నారు. ఇక సంతోష్‌లాడ్‌ను మంత్రి స్థానంలో కొనసాగించడమా లేదా అన్నది సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమగనుల తవ్వకాలతో పాటు అవినీతి అక్రమాలు తగ్గాయని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా గనుల తవ్వకాలకు పాల్పడిన వారి విషయమై ఒత్తిళ్లకు లొంగకుండా సీబీఐ చేస్తున్న దర్యాప్తు శ్లాఘనీయమన్నారు. 2014 వరకూ తాను గవర్నర్‌గా కర్ణాటకలోనే కొనసాగుతానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు భరద్వాజ్ సమాధానమిచ్చారు. అంతకు మందు జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... యువత రాజకీయాల్లోకి రావడం కంటే త్రివిధ దళాల్లోకి చేరడం ఉత్తమమన్నారు. అమెరికా, యూరప్‌కు దీటుగా సైనిక సంపత్తిను పెంచుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు ఉత్తమ మానవ వనరులు కూడా అవసరమన్నారు. అందువల్ల యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరడానికి ముందుకు రావాలన్నారు. -
నా మాట విననందుకే యడ్యూరప్పకు నేడీ దుస్థితి: హన్స్ రాజ్ భరద్వాజ్
సాక్షి, బెంగళూరు: తన మాటలను యడ్యూరప్ప నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు ఆయన తన పదవి కోల్పోయి.. ఈ స్థితికి చేరుకున్నారని కర్ణాటక గవర్నర్ హన్స్ రాజ్ భరద్వాజ్ అన్నారు. బెంగళూరు రిపోర్టర్స్ గిల్డ్, బెంగళూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. గవర్నర్ మీట్ ది ప్రెస్ నిర్వహించడం ప్రెస్‌క్లబ్ చరిత్రలో ఇదే ప్రథమం. ‘అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించవద్దని నేను కర్ణాటక గవర్నర్‌గా ఇక్కడకు వచ్చిన వెంటనే యెడ్డీకి సూచించా. అయితే ఆయన నా మాటను నిర్లక్ష్యం చేశారు. మంత్రివర్గంతో కలిసి నాపై విమర్శల దాడికి దిగారు. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడం.. ఆ తర్వాత సీబీఐ విచారణ ప్రారంభం కావడం.. యెడ్డీ పదవి కోల్పోవడం.. తెల్సిందే. అప్పుడే నా మాట విని ఉంటే యడ్యూరప్ప పదవిని కోల్పోయే వారు కాదు’ అని గవర్నర్ వివరించారు.