
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్స్‌రాజ్ భరద్వాజ్(83) కన్నుమూశారు. కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్న హన్స్‌రాజ్ బుధవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. హన్స్‌రాజ్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్‌రాజ్ అంత్యక్రియం సోమవారం సాయంత్రం నిగంబోద్ ఘాట్‌లో నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు అర్జున్ భరద్వాజ్ తెలిపారు. కాగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన హన్స్‌రాజ్.. ఆ తర్వాత కర్ణాటక, కేరళ గవర్నర్‌గా సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment