కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్ సింగ్(93) శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నట్వర్‌సింగ్ గత కొన్ని వారాలుగా మేదాంతలో చికిత్సపొందుతున్నారు.
నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జన్మించారు. సింగ్ కుటుంబ సభ్యులు ఒకరు శనివారం అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ నట్వర్‌సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ, మేదాంతలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఢిల్లీలో జరుగుతాయని, ఈ కార్యక్రమాలకు అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరవుతారన్నారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ నట్వర్ సింగ్ 2004-05లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. పాకిస్తాన్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు. 1966 నుండి 1971 వరకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంతో పనిచేశారు. నట్వర్‌సింగ్‌కు 1984లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయన పలు పుస్తకాలు రచించారు.
Comments
Please login to add a commentAdd a comment