విషాదం.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ కన్నుమూత | Maharashtra Nanded Congress MP Vasant Chavan Passed Away At Age OF 69 | Sakshi
Sakshi News home page

HYD: విషాదం.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ కన్నుమూత

Published Mon, Aug 26 2024 9:05 AM | Last Updated on Mon, Aug 26 2024 10:40 AM

Maharashtra Nanded Congress MP Vasant Chavan Passed Away

ముంబై/హైదరాబాద్‌: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాందేడ్‌ ఎంపీ వసంత్‌ చవాన్‌(69) తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్‌ చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందారు.

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతిచెందినట్టు తెలుస్తోంది. చవాన్‌ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.

రాజకీయ చరిత్ర..
వసంతరావ్ చవాన్ మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు. 2009లో నైగావ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సెప్టెంబర్ 2014లో కాంగ్రెస్‌లో చేరాడు. పార్టీలో చేరడానికి ముందు మేలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమించబడ్డాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైగావ్ స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంతరావు నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి 59,442 ఓట్లతో గెలుపొందారు. బీజేపీకి చెందిన చిఖ్లికర్ ప్రతాపరావు గోవిందరావుపై ఆయన విజయం సాధించారు. ఇక, ఆయన మరణం మహారాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటు అంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement