ముంబై: కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రకాంత్ జాదవ్ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. చంద్రకాంత్ జాదవ్ మృతి పట్ల రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్ థోరాత్, పార్టీ వర్గీయులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కొల్హాపూర్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!)
కొల్హాపూర్‌లో గొప్ప పారిశ్రామికవేత్తగా పేరున్న చంద్రకాంత్ జాదవ్ ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తర కొల్హాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది ఆగస్టులో ఆయనకు కరోనా సోకింది. ఆ సమయంలో ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ అయింది. స్థానిక ఆస్పత్రిలో సర్జరీ కూడా చేశారు. కానీ, గతవారం మళ్లీ ఆయన అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఒక్కసారిగా ఒంట్లో రక్తం స్థాయి పడిపోవడంతో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment