vasanth
-
విషాదం.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కన్నుమూత
ముంబై/హైదరాబాద్: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్(69) తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతిచెందినట్టు తెలుస్తోంది. చవాన్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.రాజకీయ చరిత్ర..వసంతరావ్ చవాన్ మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు. 2009లో నైగావ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సెప్టెంబర్ 2014లో కాంగ్రెస్‌లో చేరాడు. పార్టీలో చేరడానికి ముందు మేలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమించబడ్డాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైగావ్ స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంతరావు నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి 59,442 ఓట్లతో గెలుపొందారు. బీజేపీకి చెందిన చిఖ్లికర్ ప్రతాపరావు గోవిందరావుపై ఆయన విజయం సాధించారు. ఇక, ఆయన మరణం మహారాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటు అంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. -
రచయితగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్!
అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్‌లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్‌గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్‌లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. -
గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ వసంత్ హల్చల్
-
‘బిచ్చగాడు’లా హిట్ అవ్వాలి
‘‘మా సంస్థ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సినిమాలకంటే వైవిధ్యంగా ‘కర్త కర్మ క్రియ’ ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది’’ అని సమర్పకులు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. వసంత్ సమీర్, సెహర్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాగు గవర కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్‌గా ఈ సినిమాను బాధ్యతగా తీశారు. మా బ్యానర్లో సూపర్ హిట్ అయిన ‘బిచ్చగాడు’ సినిమా తరహాలో ‘కర్త కర్మ క్రియ’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేశాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెర కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగు గవర. ‘‘ఓ మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని వసంత్ సమీర్, సెహర్ అన్నారు. -
నీకై ఎదురు చూస్తుంటాలే!
అంజలి, ఆండ్రియా, వసంత్ ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొంది, తమిళ్లో విజయవంతమైన చిత్రం ‘తారామణి’. జె.ఎస్.కె ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చేతులు చాచి.. యుగములు వేచి, నీకై ఎదురు చూస్తుంటాలే..’ అనే పాటను సంగీతదర్శకురాలు, గాయని ఎం.ఎం. శ్రీలేఖ విడుదల చేశారు. శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ రామ్ చాలా బాగా తీశారు. వెంకటేశ్‌గారు స్ట్రైట్ మూవీస్ తీసి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘లేడీ ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుందనే శ్రీలేఖగారితో ఈ పాటను రిలీజ్ చేయించాం. తమిళ్లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు డి. వెంకటేశ్. -
తారామణి చూశా... చాలా బాగుంది – మారుతి
నెలకు ఎనభై వేలు సంపాదించే సాఫ్ట్వేర్ అమ్మాయి పనీపాటా లేని అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ప్రేయసిని ఆ ప్రేమికుడు అడిగే ప్రశ్నలు, సందేహాలు విచిత్రంగా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి, ఈ నిరుద్యోగి కుర్రాడి లవ్‌స్టోరీలో మలుపులు ఏంటి? ఆ కుర్రాడికి ఉద్యోగం దొరుకుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘తారామణి’. తెలుగమ్మాయి అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధానపాత్రల్లో రామ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి. వెంకటేశ్ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానుభావుడు’ రీ రికార్డింగ్ సమయంలో ‘తారామణి’ చూశా. మంచి సినిమా. చాలా బాగుంది. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్‌ను బేస్ చేసుకుని స్ట్రాంగ్ కంటెంట్‌తో రామ్ ఈ సినిమా అద్భుతంగా రూపొందించాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ప్రతి కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయడానికి ఎవడో ఒకడు వస్తుంటాడు. అలాంటి వ్యక్తి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సినిమా అవగాహన కల్పిస్తుంది. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి. వెంకటేశ్. నిర్మాతలు బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మప్రియ రీ ఎంట్రీ
నటి పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్‌కు రెడీ అయ్యింది. ఇంతకు ముందు మృగం, పొక్కిషం, సత్తం పోడాదే తదితర తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ భామ ఆ మధ్య పై చదువుల కోసం అంటూ అమెరికా వెళ్లి నటనకు దూరమైంది. పనిలో పనిగా అక్కడ తనతోపాటు చదువుతున్న యువకుడిని ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకుని వచ్చింది. అంతకుముందు సత్తం పోడాదే చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శకుడు వసంత్ పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్ ఛాన్స్ కల్పించారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శివరంజని యుం ఇన్నుం సిల పెంగుళు చిత్రంలో పద్మప్రియ నాయికగా నటిస్తున్నారు. ఆమెకు జంటగా నటుడు కరుణాకరన్ నటిస్తుండగా మరో రెండు కథా నాయికల పాత్రలో పార్వతి మీనన్, రామన్‌నంబీశన్‌లను ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందట. ఇది మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత కథా చిత్రం అని తెలిసింది. త్వరలోనే చిత్రం పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు. -
టిడిపి నేత వసంత్ పోలీసులకు లొంగుబాటు
-
కొత్త పుస్తకాలు
హోసూరు వంటలు మీకు ‘రామక్కగారి సుమ’ తెలుసా? ఇరవై ఏళ్లుంటాయంతే! తమిళనాడులోని హోసూరులో ఉంటుంది. ‘తల్లి నుడి కోసం, తల్లినుడిలో మాటకోసం, పాటకోసం’ తపన పడే తెలుగు తావు అది. అలాంటి నేలమీది ‘మాలగేర్లో’ పుట్టిన సుమ వాళ్లమ్మ పేరునే ఇంటిపేరుగా పెట్టుకుంది. వాళ్లమ్మ చేసే వంటల్నే కథలుగా మలిచింది. ఒబ్బట్లు, శాస్తాలు, చల్లిపిండి, సబ్బచ్చి బోండాలు, కజ్జాయలు, పులగూరాకు, వెదురుకొమ్ము చారు, పొట్లినంజర మసాలు, పెసలబేడల పాయసం, మొలక ఉలవల చారు... ‘ఉలవల చారు గములు మా ఇల్లు దాటి ఊరుదాటి దిన్నలో మేకలు మేపుతా ఉండే మా అమ్మ దగ్గరకు పోయి నా మింద దూర్లు చెప్పినట్లుంది. ఉడికిన చారును దించుకొని, నీళ్లను ఇంకొక గిన్నెలోకి వంచుకొంటా ఉండగా మా అమ్మాఅబ్బలు వచ్చేసినారు.’ మీకూ నోరూరుతోందా! వంటల్ని రుచి చూపించే సాకుతో వాళ్ల బతుకుల్నీ రుచి చూపించారీ రచయిత్రి. హోసూరు కథలు హోసూరు ప్రాంతీయుడు అగరం వసంత్ గతంలో ‘తెల్లకొక్కర్ల తెప్పం’ కథాసంకలనం తెచ్చారు. ఇప్పుడు ‘వెండిమొయిళ్లు బండబతుకులు’ కథలతో మళ్లీ పలకరిస్తున్నారు. పాముకడుపోడు, పాక్కాయల తోపు, జనిగిలోడు, జొన్నకడ్లగుడి లాంటి 54 పొట్టికథలున్నాయిందులో. లత్తనాయాలు, పుంగుమాటలు, ఇటెంకిటెంకలాంటి ఎన్నో జాతైన మాటలతోపాటు, సింతలేని సితరంగి సంతకొక బడ్డని కన్నెంట లాంటి చమత్కారపు సామెతలూ నాలుక్కి తగులుతాయి. ‘ఇది మా తావు తెలుగు కాదు కదా’ అనుకునేదే లేదు. అక్కున చేర్చుకోవాల్సిన తెలుగు! ‘మన బతుకేమో, మన మాటేమో’ అన్నట్టుగా రాస్తూపోవాలనే (స.వెం.) రమేశప్ప స్ఫూర్తితో కలం పట్టిన ఇతర హోసూరు కథకుల సంకలనం ‘మోతుకుపూల వాన’. నంద్యాల నారాయణరెడ్డి, ఎన్.సురేఖ, కృష్ణకళావతి, అమరనారా బసవరాజు, అశ్వత్థరెడ్డి, మునిరాజు లాంటివాళ్లు రాసిన 19 కథలున్నాయిందులో. ‘మరచిన తెలుగుమాటలు దొరుకుచోటు’ హోసూరు అనిపిస్తుంది ఇవి చదివితే. దీనికి సాక్ష్యంగా అన్నట్టు వచ్చిన పుస్తకం ‘పొరుగు తెలుగు బతుకులు’. హోసూరు నుంచి వచ్చిన సాహిత్యం మీది (రేడియో) వ్యాసాల సంకలనం ఇది. తొలిపలుకి(టెలిఫోన్), అలపలుకి (సెల్‌ఫోన్), మిన్నులువు (రేడియో), కోగురేకు (బ్లేడ్), ఉల్లాకు (కరపత్రం), మలయిక (ఎక్స్కర్షన్) లాంటి ఎన్నో కడుపునింపే మాటలున్న కథల్ని మనసునిండేలా విశ్లేషించారు విజయలక్ష్మి. -
తీరంలో అలజడి
ఏలూరు, న్యూస్‌లైన్: వరుస ఉపద్రవాలతో అతలాకుతలమైన జిల్లాను లెహర్ తుపాను వణికిస్తోంది. జిల్లాపై బుధవారం మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, గురువారం తీరం దాటే సమయంలో తీవ్రరూపంలో విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. నష్ట నివారణ చర్యలపై సమీక్ష : రానున్న రెండురోజుల్లో లెహర్ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమై నష్టనివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌తో కలసి ఏలూరులో జిల్లా అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రఘువీరా ఆదేశించారు. సహాయక చర్యలకు నిధుల కొరత లేదని చెప్పారు. పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించడానికి అవసరమైన బృందాలను నియమించాలని జేసీ టి.బాబూరావునాయుడును ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీ కనుమూరి బాపిరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), రాష్ట్ర చిన్న నీటిపారుదల అభివృద్ధి మండలి చైర్మన్ ఘంటా మురళి, ఇరి గేషన్ ఎస్ఈ వైఎస్ సుధాకర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పాల్గొన్నారు. నరసాపురంలో కలెక్టర్ మకాం తుపాను నేపథ్యంలో కలెక్టర్ సిద్ధార్థజైన్ నరసాపురంలో మకాం చేశారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం వర్షాలతో తుపాను ఆరంభమవుతుం దని, గురువారం నాటికి భారీ గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు లెహర్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రెవెన్యూ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ నిరవధికంగా పనిచేస్తాయి.