ఏలూరు, న్యూస్‌లైన్: వరుస ఉపద్రవాలతో అతలాకుతలమైన జిల్లాను లెహర్ తుపాను వణికిస్తోంది. జిల్లాపై బుధవారం మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, గురువారం తీరం దాటే సమయంలో తీవ్రరూపంలో విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.
నష్ట నివారణ చర్యలపై సమీక్ష : రానున్న రెండురోజుల్లో లెహర్ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమై నష్టనివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌తో కలసి ఏలూరులో జిల్లా అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రఘువీరా ఆదేశించారు. సహాయక చర్యలకు నిధుల కొరత లేదని చెప్పారు. పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించడానికి అవసరమైన బృందాలను నియమించాలని జేసీ టి.బాబూరావునాయుడును ఆదేశించారు.
ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీ కనుమూరి బాపిరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), రాష్ట్ర చిన్న నీటిపారుదల అభివృద్ధి మండలి చైర్మన్ ఘంటా మురళి, ఇరి గేషన్ ఎస్‌ఈ వైఎస్ సుధాకర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.
నరసాపురంలో కలెక్టర్ మకాం
తుపాను నేపథ్యంలో కలెక్టర్ సిద్ధార్థజైన్ నరసాపురంలో మకాం చేశారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం వర్షాలతో తుపాను ఆరంభమవుతుం దని, గురువారం నాటికి భారీ గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
లెహర్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రెవెన్యూ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ నిరవధికంగా పనిచేస్తాయి.
తీరంలో అలజడి
Published Wed, Nov 27 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement