Karnataka Congress Working President R Dhruvanarayana Passes Away - Sakshi
Sakshi News home page

విషాదం.. కాంగ్రెస్ సీనియర్‌ నేత కన్నుమూత

Published Sat, Mar 11 2023 9:22 AM | Last Updated on Sat, Mar 11 2023 11:08 AM

Karnataka Congress Working President Dhruvanarayana Passed Away - Sakshi

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌. ధృవ నారాయణ కన్నుమూశారు. ఈ మేరకు డీర్‌ఎంస్‌ వైద్యులు శనివారం ఉదయం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

వివరాల ప్రకారం.. ధృవ నారాయణకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన డ్రైవర్‌ శనివారం తెల్లవారుజామున 6:40 గంటలకు ఆయన్ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చికిత్స అందించినప్పటికీ నారాయణ ఆరోగ్యం విషమించి మృతిచెందినట్టు తెలిపారు. దీంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

గ‌తంలో ఆయ‌న రెండుసార్లు లోక్‌స‌భ ఎంపీగా చేశారు. క‌ర్నాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించారు. బెంగుళూరులోని అగ్రిక‌ల్చ‌ర్ వ‌ర్సిటీ నుంచి ఆయ‌న మాస్ట‌ర్స్ డిగ్రీ పొందారు. 1983లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్రిక‌ల్చ‌ర్ కాలేజీలో స్టూడెంట్ లీడ‌ర్‌గా చేశారు. క‌ర్నాట‌క యూత్ కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కూడా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement