బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను చనిపోయే వరకు సిద్ధరామయ్య కోసం ఒక రాయిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘సిద్ధరామయ్యకు నా చివరి శ్వాస వరకూ రాయిలా అండగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా నిబద్ధతతో పనిచేస్తాను. కాంగ్రెస్ శక్తి అంటే దేశ శక్తి. దేశ చరిత్రలో కాంగ్రెస్ త్యాగలే ఎక్కువ. ఈ పార్టీ అధికారంలో ఉందంటే అన్ని వర్గాలకూ అధికారం దక్కినట్లే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ప్రజల కష్టాలకు స్పందిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి కౌంటరిచ్చారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘25 ఏళ్ల తర్వాత హాసన లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలచుకున్న కాంగ్రెస్ 2028లోనూ ఇక్కడి అన్ని స్థానాలను గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడని దేవేగౌడ.. తన మనవడి కోసం చెన్నపట్టణకు వచ్చి కన్నీరు పెట్టారు. నందిని పాలను అమూల్ బ్రాండ్‌లో విలీనం చేయాలని ఎన్‌డీఏ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్‌ను మేము ఢిల్లీలో ఆవిష్కరించామని గుర్తుచేశారు. కర్ణాటక ప్రజలు కాంగగ్రెస్ వైపు నిలబడ్డారు. 2028 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment