మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరీఫ్ అకీల్ కన్నుమూశారు. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(నేడు) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరీఫ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు.
ఆరీఫ్ 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం హయాంలో రెండుసార్లు మంత్రి పదవిని కూడా చేపట్టారు. మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖలను పర్యవేక్షించారు.
ఆరీఫ్ అకిల్ కుమారుడు అతీఫ్ అకీల్ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ, 2023లో భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి, గెలుపొందారు. 72 ఏళ్ల ఆరీఫ్ కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా చికిత్స నిమిత్తం భోపాల్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment