న్యూఢిల్లీ: సిక్కులకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. భారతదేశంలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీలోని సిక్కు నేతలు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈ నేపద్యంలో కాంగ్రెస్ తాజాగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వకు చెందిన వీడియోను షేర్ చేసింది. దానిలో తర్విందర్.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎదురైన విధి రాహుల్‌కు కూడా ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీని కోరింది.. అలాగే.. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘రాహుల్ గాంధీ.. ఆగండి.. లేకపోతే భవిష్యత్తులో మీ నాన్నమ్మకు పట్టిన గతే మీకూ పడుతుందని’ అన్నారని, ఈ బీజేపీ నేత బహిరంగంగా చంపేస్తానని బెదిరించారని, మీ పార్టీలోని ద్వేషం కారణంగానే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయని’ ప్రధాని మోదీకి కాంగ్రెస్ విన్నవించింది.
కాగా అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్‌లోని సిక్కులు.. తమకు తలపాగా, కంకణం ధరించడానికి అనుమతి ఉంటుందో ఉండదోననే ఆందోళనలో ఉన్నారు. ఇది ఒక సిక్కులకే కాదు, అన్ని మతాల ప్రజలకు సంబంధించినది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2022 జూలైలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
दिल्ली BJP का नेता और पूर्व विधायक, तरविंदर सिंह मारवाह ने आज प्रदर्शन के दौरान कहा:
“राहुल गांधी बाज आ जा, नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ”
BJP का ये नेता खुलेआम देश के नेता प्रतिपक्ष की हत्या की धमकी दे रहा है.@narendramodi जी, अपने… pic.twitter.com/tGisA5dfNu— Congress (@INCIndia) September 11, 2024
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రచారానికి వాల్మీకి స్కామ్ డబ్బు
Comments
Please login to add a commentAdd a comment