రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, అస్సాం సీఎం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్‌చార్జ్ హిమంత బిస్వా శర్మ సమక్షంలో కాంగ్రెస్ మహిళా నేత మంజు కుమారి బీజేపీలో చేరారు. మంజుతో పాటు ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సుకర్ రవిదాస్ కూడా వందలాది మంది కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు.
బాబులాల్ మరాండీ, హిమంత బిస్వా శర్మ మంజు కుమారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ మంజు కుమారి చేరికతో గిరిధి జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఆమె జమువా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కేదార్ హజార్‌పై పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని మంజు మీడియాకు తెలిపారు. జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మంజు విమర్శించారు.
#WATCH | Ranchi, Jharkhand: Congress leader Manju Kumari joins BJP in presence of BJP state president Babulal Marandi, Assam CM and Jharkhand assembly election co-incharge Himanta Biswa Sarma. (14.10) pic.twitter.com/dvkvWhbQnQ
— ANI (@ANI) October 15, 2024
ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు
Comments
Please login to add a commentAdd a comment