manju
-
అందం అసూయపడుతుందని ఇలా మార్చేశారా?.. ఈమె ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది. -
జార్ఖండ్ కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన మహిళా నేత
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, అస్సాం సీఎం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్చార్జ్ హిమంత బిస్వా శర్మ సమక్షంలో కాంగ్రెస్ మహిళా నేత మంజు కుమారి బీజేపీలో చేరారు. మంజుతో పాటు ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సుకర్ రవిదాస్ కూడా వందలాది మంది కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు.బాబులాల్ మరాండీ, హిమంత బిస్వా శర్మ మంజు కుమారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ మంజు కుమారి చేరికతో గిరిధి జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఆమె జమువా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కేదార్ హజార్పై పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని మంజు మీడియాకు తెలిపారు. జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మంజు విమర్శించారు. #WATCH | Ranchi, Jharkhand: Congress leader Manju Kumari joins BJP in presence of BJP state president Babulal Marandi, Assam CM and Jharkhand assembly election co-incharge Himanta Biswa Sarma. (14.10) pic.twitter.com/dvkvWhbQnQ— ANI (@ANI) October 15, 2024ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు -
న్యూస్ మేకర్: గగనాన్ని జయించింది
‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ (పారాచూటింగ్) చేసిన లాన్స్‌నాయక్ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది. ఆర్మీలో మిలటరీ పోలీస్ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్ వింగ్ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్.హెచ్.ధ్రువ్’ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్ రెజిమెంట్ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్ వ్యక్తులు పారాచూటింగ్ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్ థామస్ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్ పోల్‌లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్ నేర్చుకుని జంప్ చేస్తున్నారు. మహిళల ముందంజ ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్ అభిలాష బరాక్ ఆర్మీ ఏవియేషన్‌లో మొదటి మహిళా ఆఫీసర్‌గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మాయ సుదన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా బాధ్యత పొందింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్‌గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది. గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్ హోస్టెస్‌గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే. ఆర్మీకి చెందిన లాన్స్‌నాయక్ మంజు స్కై డైవింగ్ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది. -
Manju: 85 ఏళ్ల బామ్మ! గుజరాత్లో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి.. బ్రిటన్‌లో రెస్టారెంట్!
ఇండియాలో పుట్టి, ఆఫ్రికాలో పెరిగి, ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. అయినా భారతీయ వంటకాలను అద్భుతంగా వండుతూ ఎంతోమంది కస్టమర్ల మనసులను దోచుకుంటోంది 85 ఏళ్ల బామ్మ. తొమ్మిది పదులకు చేరువలో ఉన్నప్పటికీ ఎంతో చలాకీగా దేశీయ వంటకాలను వండివార్చుతూ మంచి కుక్‌గా పేరు తెచ్చుకున్న ఈ పెద్దావిడే మంజు. రుచికరమైన ఈ వంటకాలను యూరోపియన్లు సైతం లొట్టలేసుకుని లాగించేస్తూ వావ్ అంటున్నారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1936లో మంజు పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా ఉగాండాలో స్థిరపడడంతో అమ్మతో కలిసి ఆ దేశం వెళ్లింది. మంజుకు పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణించాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఇంట్లో తనే పెద్ద కావడంతో..∙తోబుట్టు వుల భారం కూడా తనపై పడింది. దీంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ రోజూ వివిధ రకాల అల్పాహారాలు తయారు చేయడం నేర్చుకుని, పద్నాలుగేళ్ల వయసులో టిఫిన్లు తయారు చేసి విక్రయించేది. అమ్మతో కలిసి పనిచేస్తోన్న సమయంలో చనా దాల్ మంజుకు బాగా నచ్చింది. దీంతో గుజరాతీ సంప్రదాయ వంటకాలన్నింటినీ తల్లి దగ్గర నేర్చుకుని రుచికరంగా తయారు చేసేది. ఒకపక్క టిఫిన్లు విక్రయిస్తూనే, ట్యూషన్లు కూడా చెప్పేది. పెళ్లి తరువాత కూడా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన మంజుకి పెళ్లి తరువాత కూడా ఒడిదొడుకులు తప్పలేదు. 1964లో గుజరాత్ మూలాలున్న ఆఫ్రికన్ వ్యాపారవేత్తతో మంజుకు పెళ్లయ్యింది. వెంటవెంటనే ఇద్దరు కొడుకులు నైమేష్, జైమిన్లు పుట్టారు. వాళ్లకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఉగాండలో రాజకీయ పరిస్థితులు మారి అక్కడ నిబంధనలు మారడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారు. ఉదయం స్విచ్‌బోర్డుల తయారీ ఫ్యాక్టరీలో మంజు ఉద్యోగానికి వెళ్తే భర్త పిల్లల్ని చూసుకునేవాడు. రాత్రి అతను ఉద్యోగం చేస్తే మంజు పిల్లలను చూసుకునేది. అలా ఇద్దరూ ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ పెంచారు. ఏళ్లపాటు ఫ్యాక్టరీలో పనిచేసిన మంజు 65 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యింది. బాధ్యతలు తీరాయి కానీ... కుటుంబ బాధ్యతల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. చిన్నప్పటి నుంచి వంటలు చేసే అలవాటు ఉండడం వల్ల చిన్న రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉండేది మంజుకి. కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ తన దగ్గర రెస్టారెంట్ నడపడానికి కావలసినన్ని డబ్బులు ఉండేవి కావు. తన కల ఎప్పుడు నెరవేరుతుందా... అని ఎదురు చూస్తుండేది. అమ్మకోరికను ఎలాగైనా నెరవేర్చాలన్న సంకల్పంతో కొడుకులిద్దరూ తాము దాచుకున్న డబ్బులతో లండన్ నగరానికి దగ్గర్లో ఉన్న బ్రిటన్‌లో చిన్న రెస్టారెంట్‌ను ప్రాంభించారు. దీంతో మంజు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న కల 80 ఏళ్ల వయసులో నిజమైనట్లనిపించింది. పూర్తిగా గుజరాతీ శాకాహార భోజనం, నాణ్యమైన నూనె, ఇతర దినుసులతోనే వండడం, నాలుగు రకాల పదార్థాలతో షేరింగ్ థాలీని అందుబాటులో ఉంచడంతో రెస్టారెంట్ కొద్దికాలంలోనే యూరోపియన్లను అమితంగా ఆకర్షించింది. దీంతో చుట్టుపక్కల అనేక ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ మంజు రెస్టారెంట్‌కే కస్టమర్లు ఎగబడేవారు. దీనికి తోడు ఉదయాన్నే ఐదున్నర గంటలకు నిద్ర లేచి రాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్లో వంటకాలను తన స్వహస్తాలతో తయారు చేయడం బాగా కలిసి వచ్చింది. కొడుకులతో పాటు కోడళ్లు దీపాలీ, కిట్టీలు కిచెన్‌లో మంజుకి సాయం చేస్తుండడంతో తక్కువమంది సిబ్బందితో రెస్టారెంట్ చక్కగా నడిపిస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా.. మంజు ఇండియా వచ్చింది కేవలం మూడుసార్లే అయినప్పటికీ..తన తల్లిదగ్గర నేర్చుకున్న అనుభవంతో పానీపూరి, బేల్‌పూరి, పనీర్ మసాలా, కనడ పాలక్, కధీ, ఆలుకీ సబ్జి, దాల్ ధోక్లి, ఉందాయు, తెప్లా, ఖందవి వంటి రుచికరమైన వంటకాలను రెస్టారెంట్లో అందిస్తోంది. దేశీయ రుచులతోపాటు... భారతీయ సంప్రదాయ పండగలను వేడుకగా నిర్వహించడం, పండుగకు తగ్గట్టుగా రెస్టారెంట్‌ను అలంకరించడం, ప్రత్యేకమైన మెనూ, సంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి అక్కడి వాళ్లను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. గుజరాత్ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా రెస్టారెంట్లో పాత్రలు, పోస్టర్లు, సిబ్బంది డ్రెíస్సింగ్ ఉంటుంది. మంజు కస్టమర్లలో ఇంగ్లిష్, ఇండియన్, విఐపీలు ఉన్నారు. ఆమె చేసిన నిమ్మకాయ పచ్చడికి గాను ‘గ్రేట్ టేస్ట్’ అవార్డును కూడా అందుకుంది. సంకల్పం గట్టిదైతే ఏళ్లుగడిచినా అనుకున్నది తప్పక నెరవేరుతుందనడానికి మంజు జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ! -
మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! తగ్గేదెలే!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. మంజు లెక్క చేయలేదు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కదా. ఆడపిల్ల ఎదిగితే ఆపాలని మూఢ విశ్వాసాల పేరుతో చూసే కుట్ర ఇది. జార్ఖండ్ రాష్ట్రం. గుమ్లా జిల్లా. సిసాయి మండలం. డహుటోలి గ్రామం. 22 ఏళ్ల మంజూ ఉరవ్ తన పొలం మీద వచ్చిన ఆదాయంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దాంతో తన పొలం దున్నుకోవాలనుకుంది. ఆడపిల్ల పొలం ఎందుకు దున్నాలనుకుంటోంది? మంజు డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అయితే ఉద్యోగం వెతుక్కునేలోపు కరోనా వచ్చి పడింది. ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంజూకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఐదెకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పెరిగింది. ఈ కరోనా ఎప్పుడు పోతుందోనని వ్యవసాయం మొదలెట్టింది. చదువుకున్న అమ్మాయి, పైగా వ్యవసాయం అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉంది. ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, టొమాటో వేసింది. రెండేళ్లు చేసిన సేద్యం ఆమెకు లాభం తెచ్చింది. జబ్బల్లో సత్తువ ఉంటే ఎవరు అడ్డుకుంటారు. ఇంకో పదెకరాల పొలం ఇటీవల కౌలుకు తీసుకుంది. అంటే ఇప్పుడు తన కింద 15 ఎకరాలు ఉన్నాయన్న మాట. అన్ని ఎకరాల పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఉంటే మేలు కదా. కొత్త ట్రాక్టరుకు డబ్బు లేదు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. తన పొలం తనే దున్నుకోగలదు అనుకుంది. అయితే ఈమె పాటికి ఈమె ఇలా డెవలప్ అయిపోతే ఎలా అనుకున్నారో నిజంగానే ఈమె ప్రతాపానికి భయపడ్డారోగాని పొలం దున్నుకోవడం మొదలెట్టిన మంజూను గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టి పిలిపించారు. మంజూ వెళ్లింది. ‘దుక్కి దున్నే పని మగవాడిది. ఆ సంగతి నీకు తెలియదు. మగవాళ్లు కాకుండా ఆడవాళ్లు నాగలి పట్టినా, ట్రాక్టర్‌తో దున్నినా ఊరికి అరిష్టం. కరువొచ్చి పడుతుంది. లేని పోని మహమ్మారులు చుట్టు ముడతాయి. కనుక వెంటనే నువ్వు దున్నడం ఆపేయాలి. తప్పు కట్టి ఇక ఈ పని చేయనని హామీ ఇవ్వాలి. కాదూ కూడదని మళ్లీ దున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తాం’ అన్నారు. మంజు జంకలేదు ‘ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డు పుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ట్రాక్టర్ ఎక్కి పని చేసుకోవడానికి వెళ్లిపోయింది. మీడియాకు ఈ సంగతి తెలిసి వార్తయ్యింది. లోకల్ పోలీసులు ఇరు వర్గాలను కూచోబెట్టి ‘ఇది మూఢ విశ్వాసం. ఆ అమ్మాయిని దండించేందుకు పంచాయితీకి హక్కు లేదు. అలా ఆపడానికి లేదు’ అని ఊరి పెద్దలకు చెప్పారు. ఊరు వింటేగా? ఎందుకు? ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడి సక్సెస్ఫుల్ రైతుగా ఎదిగితే కుర్రకారు దానిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి అవమానంగా భావిస్తారు. పేదవాళ్లు పేదగా ఉండాలిగాని ఇలా ఎదిగితే ఉన్నోళ్లు కన్నెర్ర చేస్తారు. ఆడవాళ్లు నాలుగ్గోడల్లో ఉండకుండా ఇలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే మగవాళ్లు ఆగ్రహిస్తారు. వీటన్నింటి ఫలితమే ‘అరిష్టం’ అనే మూఢవిశ్వాసం. ఆడవాళ్లు ముందుకు సాగేకొద్ది ఎక్కడో ఒక చోట అడ్డు పడే పురుష ప్రపంచం ఉంటుంది. వారిని ఓడించి ముందుకు సాగే మంజు వంటి యువతులూ ఉంటారు. ఉండాలి కూడా. ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. – మంజూ ఉరవ్ -
రోహిణి సింధూరికి ఈసీ క్లీన్చిట్
సాక్షి, బెంగళూరు : హాసన్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరికి రాష్ట్ర ఎన్నికల అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. హాసన్‌కు చెందిన మంత్రి ఏ.మంజు, రోహిణిపై పలు ఆరోపణలు సంధించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మైసూరు ప్రాంతీయ కమిషనర్ విచారణ చేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిక అందించారు. నివేదిక అనంతరం రోహిణి సింధూరికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ తెలిపారు. కాగా హాసన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హాసన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏ.మంజు....ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రోహిణి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మంత్రి తన లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ఈసీ సింధూరికి క్లీన్ చిట్ ఇచ్చింది. -
పోరు సింధూరం
కలెక్టర్‌గా ఆమె నిబద్ధతతో పనులు చేస్తుంటే బదిలీలు చేస్తున్నారు పాలకులు. ప్రజలే ఆమె కోసం పోరాడారు. అదే ఈ పోరు సింధూరం కథ. ఉదయించేటప్పుడు... అస్తమించేటప్పుడు కనిపించే రంగు సింధూరం.సమాజంలో ఉన్న చీకటి...సాయం వేళ సింధూరాన్ని మింగేస్తుంది.కానీ... సింధూరం తన శక్తిని తాను మళ్లీ పూరించుకుని వేకువలో పోరు సింధూరంగా ఉదయిస్తుంది.రోహిణి సింధూరి ఐఎఎస్ ప్రతిభపై...దుర్మార్గపు చీకట్లు ఎన్ని ముసిరినా...పౌర సేవల వెలుగునే చూపుతోందామె.రోహిణి సింధూరి తెలుగమ్మాయి, ఖమ్మం జిల్లాలో పుట్టింది.హైదరాబాద్‌లో పెరిగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంది. కర్ణాటకలో పోస్టింగ్ అందుకుంది. కరవు రైతులకు పరిహారం ఇప్పించింది, కొబ్బరి నీటితో కొర్పొరేట్ వ్యాపారం చేయడమెలాగో రైతులకు నేర్పించింది. గోమఠేశ్వరుని సాక్షిగా మస్తకాభిషేకాన్ని పరిపూర్ణం చేసింది. చట్టానికి చుట్టాలుండరని, సామాన్యుల సేవ కోసమే చట్టమైనా, ప్రజా ప్రతినిధి అయినా అని నమ్ముతోంది. నమ్మింది నమ్మినట్లే్ల ఆచరణలో పెడుతోంది. తుముకూరు, మండ్య, హసన్ జిల్లాల్లో ఆమె నిర్వర్తించిన విధులే ఆమె ఎంత కచ్చితమో చెప్తాయి. ఆమెలోని ఆ కచ్చితమే మంత్రి అధికార దుర్వినియోగానికి తాళం పెట్టించింది. తొలి పరీక్ష! సింధూరికి ఇంజనీరింగ్ పూర్తయ్యేటప్పుడు వచ్చింది సివిల్స్ ఆలోచన. అదే పెద్ద మలుపు ఆమె జీవితంలో. పెళ్లి చేయాలన్న అమ్మానాన్నలను రెండేళ్లు గడువు అడిగింది. సివిల్స్ పరీక్షలకు నెల ముందు యాక్సిడెంట్ రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో బెడ్ మీద నుంచే ప్రిపరేషన్. ఐఎఎస్ కావాలనుకున్నప్పటి నుంచి మొదలైన ఎదురీత, బాధ్యతలు చేపట్టాక కూడా తప్పడం లేదు. ఒక పనిని సమర్థంగా పూర్తి చేస్తుంటే నాయకుల నుంచి అడ్డంకులు. జీవితమంటే అడ్డంకులను అధిగమించడమే అంటోంది... ఉలి దెబ్బలను ఓర్చుకున్న ఈ శిల్పం. ఎన్నికలొచ్చాయి! ప్రస్తుతం కర్నాటకలో అసెంబ్లీకి ఎన్నికల సమయం. మంత్రి ఎ. మంజు అధికార దుర్వినియోగం మీద మీడియా కన్ను పడింది. కర్ణాటక ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ బంగ్లాలోని ఆఫీస్‌లో ఫైళ్లు క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. వీడియో క్లిప్‌లతో సహా టీవీల్లో వార్త వచ్చింది. వెంటనే సింధూరి ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లి ఆఫీస్‌కి తాళం వేసింది. మంత్రి వెనుకటి తేదీలు వేసి (ఎన్నికల కోడ్ అమలు కావడానికి ముందు తేదీలు) వెయ్యి మందికి వ్యవసాయ భూములిస్తూ సంతకాలు చేశారనేది మీడియా, ప్రతిపక్షాల వాదన. అసలైన నిరుపేదలకు భూములివ్వకుండా తమకు ఓట్లు వేసే వాళ్లెవరు, వేయని వాళ్లెవరో చెప్పే పార్టీ నివేదికలు ఆలస్యం కావడంతో మంత్రి ఈ పనికి పాల్పడ్డారనేది మరో ఆరోపణ. ఎలక్షన్ ఆఫీసర్ విచారణలో వెయ్యి మందికి భూములివ్వడం ద్వారా ఐదువేల మంది ఓటర్లను ప్రభావితం చేసినట్లు నిర్ధారణ అయింది. విచారణ తీవ్రమయ్యే కొద్దీ మంత్రి మాట మెల్లగా మృదుత్వాన్ని సంతరించుకుంటోంది. ‘జిల్లా కలెక్టర్ తన కూతురితో సమానమని, ఆమె మీద తనకు ఎటువంటి కోపమూ లేదు’ అంటున్నారిప్పుడు. పని చేయాలంటే తట్టుకుని నిలవాలి ‘మనకెందుకొచ్చిన రిస్క్ అనుకుంటే ఏ పనినీ కచ్చితంగా చేయలేం. కొత్తగా వచ్చిన అధికారి అక్కడి సమస్యలు, పరిస్థితులు, సంస్కృతిని అర్థం చేసుకుని, ఉద్యోగుల్లో ఒక టీమ్‌ను తయారు చేసుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. ఈ టైమ్‌కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక పని చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. నిజాయితీగా పరిపాలన చేయాలంటే ఇన్ని అడ్డంకులు ఉంటాయి’ అంటారు సింధూరి. ఏడాదిలో లక్ష టాయిలెట్లు మండ్య జిల్లాలో ఏడాదిలో లక్ష టాయిలెట్లు కట్టించి జాతీయస్థాయి రికార్డు సృష్టించారామె. టాయిలెట్లు కట్టడానికి ముందు వాటిని వాడేటట్లు గ్రామస్థుల మైండ్‌సెట్‌ను మార్చాల్సి వచ్చింది. చెరకు పొలాల్లో పాము కాట్లు, కుక్క కాట్ల వంటి అనేక ప్రమాదాలు, మహిళల మీద అఘాయిత్యాలు బయటకు వెళ్లినప్పుడే జరిగేవి. పోకిరీ పిల్లలు కాపు కాచి ఆడవాళ్లను ఏడిపించేవారు. ఇలా ఉన్నా సరే టాయిలెట్ వాడటానికి సుముఖంగా లేరు. ప్రతి గ్రామంలో ఏడెనిమిది మందితో (పిల్లలు కూడా) ఒక టీమ్ వేసి, వాళ్లకు విజిల్స్ ఇచ్చారామె. ఆ టీమ్ ఉదయాన్నే ఊరంతా తిరుగుతూ ఎవరైనా ఆరు బయట ఆ పని చేస్తుంటే విజిల్ ఊదేవాళ్లు. బయట ఆ పని చేయడం షేమ్ అనిపించి, టాయిలెట్ అవసరమే అని దారికొచ్చారంతా. ‘ఒక పని చేయడానికి అధికారం ఉండాలి. కానీ అధికారంతోనే అన్ని పనులనూ చేసేయవచ్చు అనుకుంటే పొరపాటే’నంటారామె. ఆ పని అవసరాన్ని జనానికి చెప్పాలి, సమాధానపడే వరకు నచ్చచెప్పాలి. మొండిగా ఉంటే అధికారం అనే ఆయుధం ఉందనే భావన కలిగించాలి తప్ప, అధికారాన్ని ఆయుధంగా వాడటం దేనికీ సమాధానం కాదంటారు సింధూరి.‘సమాజానికి సాధ్యమైనంత ఎక్కువ సేవ చేయగలిగింది ఐఎఎస్ అధికారి మాత్రమే. ఐఎఎస్‌కు ప్రిపేరయ్యేటప్పుడు అదే అనుకు న్నాను, దానినే ఆచరిస్తున్నాను. సమాజానికి, సామాన్యులకు చేతనైనంత ఎక్కువ సేవ చేయడమే నా లక్ష్యం’ అంటారామె. ‘ఎంత సాహసోపేతమైన అధికారికి అయినా కుటుంబం అండగా ఉంటేనే నూటికి నూరుశాతం సర్వీస్ ఇవ్వగలుగుతారు. మా అత్తగారు హసన్‌కే వచ్చి నా పిల్లలను చూసుకుంటుండటంతోనే కలెక్టర్‌గా నా బాధ్యతలకు పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతున్నాను, తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉంటానో నా పిల్లలకు తల్లిగా మారిన అత్తగారికీ అంతలా రుణపడి ఉంటాను’ అంటున్నారు కలెక్టర్ రోహిణి సింధూరి. మా పేర్లూ ఆయన సినిమా పేర్లలాగే! పెయింటింగ్‌కి టైమ్ లేదిప్పుడు. రోజూ యోగా, మెడిటేషన్ చేస్తాను. స్ట్రెస్ అనిపిస్తే విశ్వనాథ్ గారి సినిమా పాటలు వింటాను. ఆయన సినిమాల్లాగానే మా ఇంట్లో పేర్లు కూడా ‘ఎస్’తోనే మొదలవుతాయి. మా వారు సుధీర్ రెడ్డి, బాబు సిద్ధార్థ్, పాప సిరిణ్య. రెండవసారి గర్భంతో ఉన్నప్పుడు ఈ సారి పుట్టేది పాపే అనిపించేది. పుట్టబోయే పాపకు పేరు పెట్టమని విశ్వనాథ్ గారిని అడిగాను. ‘పుట్టనివ్వు పెడతాను’ అన్నారాయన నవ్వుతూ. సిరివెన్నెల మీద ఇష్టంతో పాపకు సిరిణ్య అని పెట్టాను. – రోహిణి సింధూరి, కలెక్టర్, హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం కల్పామృతం కొబ్బరి రైతులు రోడ్డు పక్కన కాయలమ్ముకునేవాళ్లు. కాయలు మిగిలిపోతే మరుసటి రోజుకు నీరు తగ్గిపోతుంది, కాయ ధర పలకదు. రైతుకి వచ్చే రూపాయి కూడా ఎండకు ఎండిపోతుంది. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డులతో మాట్లాడి కల్పామృత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారామె. కొబ్బరినీటిలో నిమ్మరసం, తేనె కలిపిన డ్రింక్ ఒకటి. మొత్తం ఐదు రకాల కొబ్బరినీటి ఉత్పత్తులు రెడీ అయ్యాయి. పాల ఉత్పత్తిదారుల కోసం అముల్ కంపెనీ ఉన్నట్లు... కొబ్బరి రైతుల కోసం కల్పామృత పాజిటివ్ కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు ఆరువందల మంది రైతులు కల్పామృతతో అనుసంధానమయ్యారు. కన్నడ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకం శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరునికి పన్నెండేళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేకం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించింది. సింధూరి హసన్‌కు వచ్చే నాటికి మస్తకాభిషేకానికి ఆరు నెలలే ఉంది. పనులు మొదలుకాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పనులు జరగవు. వేగంగా, సిస్టమాటిక్‌గా ఆదేశాలిస్తోందామె. జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంజుకి కష్టంగా తోచింది. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. శానిటేషన్, ట్రాన్స్పోర్ట్, వైద్య సహాయం, మంచినీరు, ఇతర అరేంజ్మెంట్స్ అన్నీ సక్రమంగా జరగాలని వర్క్ టెండర్లు వేసిన వాళ్లకు కండిషన్ పెట్టారామె. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాని విధంగా ఏర్పాట్లు జరగడానికి ఆమె రూపొందించిన ప్రోగ్రామ్‌కి ముఖ్యమంత్రి నుంచి ఆమోదం వచ్చింది. దాంతో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. మంత్రిగారికి గాయమైంది! మస్తకాభిషేకానికి 40 లక్షల మంది వచ్చారు. ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు. కానీ మంత్రి గారి మనసు వేడుకకు ముందే బాగా గాయపడింది. జిల్లాలో ఇదే కలెక్టర్ కొనసాగితే తనకు కష్టం అని పదే పదే హెచ్చరించసాగిందాయన మనసు. మస్తకాభిషేకం ఇక రోజుల్లోకి వచ్చేసినప్పుడు తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించారు. అప్పుడు వచ్చింది ప్రజాగ్రహం ఒక వెల్లువలాగ. అప్పటికే ఆమె రెండో సర్వే చేయించి కరవు రైతులకు కేంద్రం నుంచి 60 కోట్లు విడుదల చేయించింది. రైతులకు బీమా డబ్బు అందుతోంది. ఈ కలెక్టర్ మారిపోతే తమ గోడు పట్టించుకునే నాథుడెవరూ ఉండరనే ఆందోళన వారిలో. ఇక ప్రభుత్వానికి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. – వాకా మంజులారెడ్డి -
మంత్రి మంజుపై కలెక్టరు రోహిణి ఆగ్రహం
బనశంకరి: హాసన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏ.మంజు, జిల్లా కలెక్టరు రోహిణి సింధూరి మధ్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని రోహిణి బుధవారం ఆరోపణలు చేశారు. ఇటీవల మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మంత్రి లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాహుబలి మహామస్తకాభిషేకాలు జరిగిన జనవరి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఆరంభమయ్యాయి. -
థ్రిల్లర్ మేళా
సూర్యతేజ, ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, అలీ, మంజు, సోనీ చరిష్టా ముఖ్య తారలుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో సంతోష్ కొంక నిర్మించ నున్న ‘మేళా’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలీ మాట్లాడుతూ– ‘‘సాయి ధన్సిక మంచి నటే కాదు, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో మంచి రోల్లో కనిపించనుంది. శ్రీపురం కిరణ్ 30 ఏళ్లుగా తెలుసు. నెమ్మదిగా ఎదుగుతూ దర్శకుడి స్థాయికి చేరుకున్నారు’’ అన్నారు. శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లో నేను చూసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘మేళా’ కథ తయారు చేశా. ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి కథను తెరకెక్కించాలంటే నిర్మాతకి ప్యాషన్ ఉండాలి. అలాంటి నిర్మాత సంతోష్‌గారు’’ అన్నారు. ‘‘రెండు నెలలు క్రితం కిరణ్‌గారు కథ చెప్పినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు సాయిధన్సిక. నిర్మాత సంతోష్, సూర్యతేజ, మాగ్నస్ మీడియా మహిధర్, మంజు, సోని చరిష్టా, కెమెరామెన్ మురళీమెహ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు తదితరులు పాల్గొన్నారు. -
‘కంబళ’ బిల్లు ఆమోదం
బెంగళూరు: సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ తెచ్చిన బిల్లును కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసే విషయంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. జల్లికట్టు కోసం ఉద్యమించిన తమిళనాడు ప్రజల బాటలో కన్నడిగులు కూడా కంబళ కోసం ఆందోళన చేయడం తెలిసిందే. కంబళలో జంతుహింస లేదని, ప్రజల కోరిక మేరకు దీన్ని అనుమతిస్తున్నామని మంత్రి మంజు చెప్పారు. ఆర్డినెన్స్ బాట పట్టకుండా ఆటకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
లాస్యకు కాబోయే వరుడు ఇతడే..
-
లాస్యకు కాబోయే వరుడు ఇతడే..
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను వెల్లడించింది. తన ఎంగేజ్మెంట్కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది లాస్య. ఒకరి చేతి పై మరొకరి ముద్దు పేరుతో పచ్చబొట్టు వేసి ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. చిన్ని, మంజూ అని రాసున్న ఆ రెండు చేతుల పక్కనే రెండు ఎంగేజ్ మెంట్ రింగులు కూడా ఉన్నాయి. దీన్నే లాస్య తన వాల్ పోస్ట్‌గా కూడా పెట్టింది. ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పెట్టిన కొద్ది సేపటికే పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ ఎవరితో అయింది..ఈ మంజూ ఎవరు అంటూ.. అభిమానులు భారీగా కామెంట్లు చేశారు. దీనికి స్పందిచిన లాస్య విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించి ఫోటోను సరిగ్గా ఐదు గంటలకు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తానని లాస్య పేర్కొంది. తాను చెప్పినట్టుగానే సరిగ్గా సోమవారం సాయంత్రం ఐదుగంటలకు ఎంగేజ్ మెంట్ ఫోటోలను విడుదల చేసింది. అయితే ఆదివారం రోజే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిందని పేర్కొంది. మంజూనాథ్ మరాఠీ అబ్బాయని తెలిపింది. -
ఫొటో స్టూడియోలో చోరీ
ముదిగుబ్బ : ముదిగుబ్బలోని సిండికేట్ బ్యాంక్ ఎదుట గల మంజు అనే వ్యక్తికి చెందిన ఫొటో స్టూడియోలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. స్టూడియో తలుపులు పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి రూ.60 వేలు విలువ చేసే పెద్ద కెమెరా సహా మరో చిన్న కెమెరా, హార్డ్ డిస్క్, రూ.3,500 నగదు ఎత్తుకెళ్లారు. వాటి విలువ మొత్తం రూ.80 వేలు ఉంటుంది. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
భావన కెరీర్‌తో ఆడుకుంటున్నాడా?
ఒంటరి, హీరో, మహాత్మ.. ఇలా తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలే అయినా భావన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళ బ్యూటీ తన మాతృభాషతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మలయాళంలో ఓ హీరో కారణంగా ఆమె కెరీర్ ఇరుకుల్లో పడిందని సమాచారం. ఆ హీరో పేరు దిలీప్. ఇతగాడు భావనకు అవకాశాలు రానీయకుండా చేస్తున్నాడని వినికిడి. దిలీప్, ఆయన భార్య, నటి మంజూ వారియర్ విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మంజూ వారియర్‌ను భావన సపోర్ట్ చేసిందట. దానివల్ల భావనపై దిలీప్ ఆగ్రహం చెందాడని, తనకు అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నాడని మలయాళ పరిశ్రమలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ భావన కనుక నటీనటుల సంఘానికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దిలీప్ తగిన చర్య తీసుకోవాలనుకుంటున్నారట. మరి.. నిజంగానే భావనకు అవకాశాలు రాకుండా దిలీప్ గేమ్ ప్లే చేస్తున్నారా? అదే నిజమైతే భావన నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
నృత్య మార్గదర్శిక
భారత సంప్రదాయ కళలపై సృష్టి బదోరి రాసిన పుస్తకం... ‘నృత్య మార్గదర్శిక’. నాట్యరంగ ప్రముఖులు వీఎస్ రామమూర్తి, మంజులా రామస్వామి శిష్యురాలైన సృష్టి భరతనాట్య కళాకారిణి. శ్రీరామ నాటక నికేతన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు పుస్తకావిష్కరణ ఉంటుంది. కళ, విద్యారంగ ప్రముఖులు హాజరువుతారు. -
గృహిణిపై జిమ్ ఇన్స్ట్రక్టర్ చాకుతో దాడి
అనంతరం ఆత్మహత్యకు యత్నం బెంగళూరు: గృహిణిపై జిమ్ ఇన్స్ట్రక్టర్ చాకుతో దాడి చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన రామమూర్తినగరలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంజులా అనే గృహిణి త న కుమారుడిని పాఠశాల నుండి పిలుచుకురావడానికి వెళుతున్నారు. ఓఎంబీఆర్లేఔట్ లోని ఛాయా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి వద్ద జిమ్ ఇన్స్ట్రక్టర్ స్టీపెన్ మంజుళాను వెంబ డించాడు. అతని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయగా ఆమెను వెంబడించి చాకుతో పొట్టపై దాడిచేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అనంతరం అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన చూసిన స్థానికులు గాయాలతో ఉన్న ఇద్దరిని ఛాయా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న రామమూర్తినగర పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఆమెపై వ్యామోహం తోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.