‘కంబళ’ బిల్లు ఆమోదం
బెంగళూరు: సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ తెచ్చిన బిల్లును కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసే విషయంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి.
జల్లికట్టు కోసం ఉద్యమించిన తమిళనాడు ప్రజల బాటలో కన్నడిగులు కూడా కంబళ కోసం ఆందోళన చేయడం తెలిసిందే. కంబళలో జంతుహింస లేదని, ప్రజల కోరిక మేరకు దీన్ని అనుమతిస్తున్నామని మంత్రి మంజు చెప్పారు. ఆర్డినెన్స్ బాట పట్టకుండా ఆటకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.