Animal Abuse Prevention Act
-
పోలీసులకు సోనమ్ కపూర్ బంధువు ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బంధువు ప్రియా సింగ్ మూగ జీవాలను హింసించిన ఇద్దరూ జంతువుల కేర్ టేకర్స్‌పై ముంబైలోని మలబార్ హిల్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాయపడిన కుక్కలపై సదరు కేర్ టేకర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలను చూసి ఆమె, తన భర్త భయపడ్డామని పోలీసులకు తెలిపారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేర్ టేకర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ప్రియా సింగ్ నెల రోజులుగా వికలాంగ జంతువులను సంరక్షించేందుకు సొంతంగా షెల్టర్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసుకునేందుకు ఆమె ప్రకాష్ శామ్యూల్ బింగ్, రాంప్రాతాప్ పాస్వాన్ అనే ఇద్దరూ కేర్ టేకర్స్‌ను నియమించారు. ప్రస్తుతం వారి దగ్గర 4 కుక్కలు, 12 పిల్లులు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రియా సింగ్ సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా కేర్ టేకర్స్ జంతువులను కొడుతూ ఆనందిస్తున్న దృశ్యాలు వెలుగు చుశాయి. దీనిపై మలబార్ హిల్స్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సదరు కేర్ టేకర్స్ రెండు వికలాంగ కుక్కలను కర్రతో కొడుతూ ఆనందం పొందుతూ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నెల 16 తేదీ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ రోజు ఈ కుక్క కొడుతాను అంటూ గాయపడిన కుక్కను చూపిస్తూ.. ఆపై మరోక కుక్క వైపు వెళ్లి ఇప్పుడు ఈ కుక్కను కొడతాను అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు రికార్డయినట్టు తెలిపారు. అంతేగాక ప్రకాష్ అనే కేర్ టేకర్ గాయపడిన కుక్కలలో ఒకదాని మొహంపై టవల్ పెట్టి కర్రతో దానిని తీవ్రంగా బాధించాడని ఆయన తెలిపారు. వీరిఇద్దరిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఐపీసీ 34, 428లతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
వారికి జైలు శిక్ష విధించండి: మోదీకి చాహల్ లేఖ
ముంబై : జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారికి జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు విధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ లేఖ రాశాడు. 1960 జంతు సంరక్షణ చట్టంలోని శిక్షలు చాలా సరళంగా ఉన్నాయని, కేవలం రూ.50 అత్యధిక జరిమానా విధించడం అనేది కాలం చెల్లిన శిక్షలని అన్నాడు. జంతు సంరక్షణ చట్టాలను పటిష్టం చేయాలని పెటాతో చేతులు కలిపిన క్రికెటర్లు కోహ్లి, ధావన్, రహానెల సరసన చాహల్ చేరాడు. ఈ క్రమంలోనే మోదీకి చాహల్ లేఖ రాశాడు. ఎవరైతే జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారో వారికి జైలు శిక్షను విధించడమే సబబు అని పేర్కొన్నాడు. ‘భారత్‌లో ఆవులు, కుక్కలతో మిగతా జంతువులను హింసించమనేది తరచు చూస్తున్నాం. జంతువుల్ని కొట్టడం, విష ప్రయోగాలు చేయడం. యాసిడ్‌తో ఎటాక్ చేయడం. లైంగిక హింసలకు పాల్పడటనేది నిత్యం కనిపిస్తూనే ఉంది. అది చాలా బాధాకరం. దీన్నిఅరికట్టాలంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను అమలు చేయడమే సరైన మార్గం’ అని చాహల్ లేఖలో పేర్కొన్నాడు. -
‘కంబళ’ బిల్లు ఆమోదం
బెంగళూరు: సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ తెచ్చిన బిల్లును కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసే విషయంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. జల్లికట్టు కోసం ఉద్యమించిన తమిళనాడు ప్రజల బాటలో కన్నడిగులు కూడా కంబళ కోసం ఆందోళన చేయడం తెలిసిందే. కంబళలో జంతుహింస లేదని, ప్రజల కోరిక మేరకు దీన్ని అనుమతిస్తున్నామని మంత్రి మంజు చెప్పారు. ఆర్డినెన్స్ బాట పట్టకుండా ఆటకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
జల్లికట్టు పోటీలకు 24 నిబంధనలు
కేకేనగర్: జల్లికట్టు పోటీ జరపడానికి అనుకూలంగా తమిళనాడు జంతు హింస నిరోధక చట్టంలో సవరణలు చేసి రాష్ట్ర గవర్నర్ అంగీకారంతో కూడిన అత్యవసర చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1960లో తీసుకు వచ్చిన చట్టం 59లో సబ్‌సెక్షన్ –2లో సవరణ చేయడానికి ప్రభుత్వ ఆదేశం మేరకు పశు సంవర్థక శాఖ ప్రభుత్వ కార్యదర్శి కగన్ దీప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జల్లికట్టు పోటీ జరిగే సమయంలో అనుసరించాల్సిన నిబంధనల ప్రకటనను విడుదల చేశారు. ప్రైవేటు సంస్థల కమిటీల తరఫున జల్లికట్టు జరిపేందుకు ముందు కలెక్టర్‌కు రాతపూర్వకంగా సమాచారం తెలియజేయాలి. జల్లికట్టు పోటీల్లో పాల్గోనే వ్యక్తులు, ఎద్దుల వివరాలను ముందస్తుగా కలెక్టర్ వద్ద నమోదు చేసి నిర్ధారించుకోవాలి. జల్లికట్టు జరిపే స్థలాన్ని కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలనలు జరిపి అనుమతి ఇవ్వాలి. ► జల్లికట్టు పోటీలో పాల్గొనడానికి తీసుకు వచ్చిన ఎద్దులకు మత్తుమందు ఇచ్చారా, చిత్రవధ చేశారా అనే విషయాలపై వెటర్నరీ వైద్యులు పరీక్షలు జరపాలి ► పోటీలలో పాల్గోనే ఎద్దులు ఆరోగ్యంగా ఉన్నాయని వైద్యుల సమాచారం మేరకు కలెక్టర్ అనుమతి ఇవ్వాలి ► ఎద్దులు ఉన్న స్థలాన్ని సీసీ కెమెరా ద్వారా పరిశీలించాలి. జల్లికట్టు జరిగే పోటీ దృశ్యాలను సీసీ టీవీ కెమెరాల్లో నమోదు చేయాలి ► ఎద్దులకు నీరసంగా, ఉద్వేగంగా ఉన్న పక్షంలో పోటీకి వాటిని అనుమతించరాదు ► ఎద్దులకు సారాయి వంటి మత్తుపదార్థాలను ఇచ్చారా అని పరిశీలించి జల్లికట్టు జరిగే పోటీకి అనుమతించరాదు ► పోటీ జరిగే ప్రాంతానికి వచ్చే ముందు ఎద్దు ముక్కుకు ఉన్న తాడు తీసివేయాలి ► మైదానం 50 చదరపు మీటర్లు ఉండాలి. అందులోనే పోటీ దారులు ఎద్దులను పట్టుకోవాలి ► పోటీ జరిగే మైదానంలో ఎద్దు వచ్చినప్పుడు దానికి అడ్డుగా నిలబడకూడదు ► మైదానం లోపల ఎద్దు వచ్చే 10 మీటర్లు, 30 నిమిషాలు, మూడు సార్లు అది దూకినప్పడు దాన్ని పట్టుకోవాలి. ఎద్దును అదుపు చేసే సమయంలో దాని తోకను కొమ్ములను పట్టుకోరాదు. ఎద్దు పరిగెత్తకుండా ఉండే విధంగా దాన్ని అడ్డుకోరాదు ► ఎద్దుకు గాని, పోటీ దారునికిగాని దెబ్బలు తగలకుండా ఉండేందుకు మైదానంలో 15 మీటర్లు వరకు కొబ్బరి పీచును పరచాలి ► మైదానం లోపలికి వచ్చే ఎద్దు 15 మీటర్లు దాటి వెళ్లిన తరువాత పోటీదారులు ఎద్దును వంద మీటర్లు వరకు ఎలాంటి అడ్డంకులు ఉంచరాదు. ► జల్లికట్టు పోటీకి యజమానులే ఎద్దులను తీసుకురావాలి ► పోటీ ముగిసిన ఎద్దుకు 20 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఆ తరువాత ఎద్దు యజమానులు ఎద్దును తీసుకువెళ్లాలి. ► పోటీ మైదానంలో ఇరువైపులా అడ్డును ఏర్పాటు చేసి 8 అడుగుల ఎత్తుకు అనగా ఎద్దులు దాటని విధంగా ప్రేక్షకులకు కుర్చీలను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని కలెక్టర్ నిర్ధారణ చేయాలి. ► మైదానంలో ప్రేక్షకులు ఎంతమంది కూర్చోవచ్చు అనే దాని గురించి ప్రజాపనుల శాఖ అధికారుల వద్ద నుంచి సర్టిఫికెట్ పొందాలి వంటి 24 నిబంధనలు అందులో ఉన్నాయి.