ముంబై : జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారికి జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు విధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ లేఖ రాశాడు. 1960 జంతు సంరక్షణ చట్టంలోని శిక్షలు చాలా సరళంగా ఉన్నాయని, కేవలం రూ.50 అత్యధిక జరిమానా విధించడం అనేది కాలం చెల్లిన శిక్షలని అన్నాడు.
జంతు సంరక్షణ చట్టాలను పటిష్టం చేయాలని పెటాతో చేతులు కలిపిన క్రికెటర్లు కోహ్లి, ధావన్, రహానెల సరసన చాహల్ చేరాడు. ఈ క్రమంలోనే మోదీకి చాహల్ లేఖ రాశాడు. ఎవరైతే జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారో వారికి జైలు శిక్షను విధించడమే సబబు అని పేర్కొన్నాడు. ‘భారత్‌లో ఆవులు, కుక్కలతో మిగతా జంతువులను హింసించమనేది తరచు చూస్తున్నాం. జంతువుల్ని కొట్టడం, విష ప్రయోగాలు చేయడం. యాసిడ్‌తో ఎటాక్ చేయడం. లైంగిక హింసలకు పాల్పడటనేది నిత్యం కనిపిస్తూనే ఉంది. అది చాలా బాధాకరం. దీన్నిఅరికట్టాలంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను అమలు చేయడమే సరైన మార్గం’ అని చాహల్ లేఖలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment