అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అర్ష్‌దీప్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు 61 టీ20 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 97 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో చాహల్ రికార్డును సింగ్ బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు అర్ష్‌దీప్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే విధ్వంసర ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో బెన్ డకెట్‌ను ఔట్ చేశాడు. ఈ పంజాబీ పేసర్ గత కొంత కాలంగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అర్ష్‌దీప్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అర్ష్‌దీప్ బంతిని పంచుకోనున్నాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు వీరే..
97 వికెట్లు - అర్ష్‌దీప్ సింగ్ (61 మ్యాచ్‌లు)
96 వికెట్లు - యుజ్వేంద్ర చాహల్ (80 మ్యాచ్‌లు)
90 వికెట్లు - భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్‌లు)
89 వికెట్లు - జస్ప్రీత్ బుమ్రా (70 మ్యాచ్‌లు)
89 వికెట్లు - హార్దిక్ పాండ్యా(110 మ్యాచ్‌లు)
తుది జట్లు
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం: బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment