ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బంధువు ప్రియా సింగ్ మూగ జీవాలను హింసించిన ఇద్దరూ జంతువుల కేర్ టేకర్స్‌పై ముంబైలోని మలబార్ హిల్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాయపడిన కుక్కలపై సదరు కేర్ టేకర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలను చూసి ఆమె, తన భర్త భయపడ్డామని పోలీసులకు తెలిపారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేర్ టేకర్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ప్రియా సింగ్ నెల రోజులుగా వికలాంగ జంతువులను సంరక్షించేందుకు సొంతంగా షెల్టర్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసుకునేందుకు ఆమె ప్రకాష్ శామ్యూల్ బింగ్, రాంప్రాతాప్ పాస్వాన్ అనే ఇద్దరూ కేర్ టేకర్స్‌ను నియమించారు. ప్రస్తుతం వారి దగ్గర 4 కుక్కలు, 12 పిల్లులు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రియా సింగ్ సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా కేర్ టేకర్స్ జంతువులను కొడుతూ ఆనందిస్తున్న దృశ్యాలు వెలుగు చుశాయి.
దీనిపై మలబార్ హిల్స్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సదరు కేర్ టేకర్స్ రెండు వికలాంగ కుక్కలను కర్రతో కొడుతూ ఆనందం పొందుతూ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నెల 16 తేదీ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ రోజు ఈ కుక్క కొడుతాను అంటూ గాయపడిన కుక్కను చూపిస్తూ.. ఆపై మరోక కుక్క వైపు వెళ్లి ఇప్పుడు ఈ కుక్కను కొడతాను అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు రికార్డయినట్టు తెలిపారు. అంతేగాక ప్రకాష్ అనే కేర్ టేకర్ గాయపడిన కుక్కలలో ఒకదాని మొహంపై టవల్ పెట్టి కర్రతో దానిని తీవ్రంగా బాధించాడని ఆయన తెలిపారు. వీరిఇద్దరిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఐపీసీ 34, 428లతో పాటు సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment