bill passed
-
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ గండం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు షట్‌డౌన్ గండం తప్పింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రిలోగా బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనేట్‌కు పంపించారు. సెనేట్ సైతం ఆమోదించింది. దీంతో షట్‌డౌట్ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్‌కు పంపించారు.ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచి్చన ద్రవ్య వినిమయ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వ్యతిరేకించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి 14 వరకు ప్రభుత్వ అవసరాలకు, విపత్తుల్లో సహాయక చర్యలకు నిధులు సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేళ్లపాటు రద్దు చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. గతంలో ట్రంప్ ప్రభుత్వ పాలనలో అమెరికాలో 35 రోజులపాటు షట్‌డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్డౌన్గా చెబుతుంటారు. షట్‌డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. -
నైపుణ్య శిక్షణకు స్కిల్స్ వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: వృత్తి నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు రాక దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం లేక గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల కష్టాలపాలు అవుతున్నా రన్నారు. ఈ నేపథ్యంలో వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో వర్సిటీకి ఈ పేరు పెట్టామని చెప్పారు.లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే ఈ వర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు. నైపుణ్య యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సులుంటాయని, తొలి ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభిస్తున్నామని, 2 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. గురువారం శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తర్వాత జరిగిన చర్చలో సీఎంతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 57 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో..‘ముచ్చర్లలో 57 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి అక్కడ తరగతులు ప్రారంభిస్తాం. అప్పటివరకు సమయం వృథా కాకుండా ఈ ఏడాదే గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఆరు కోర్సులు ప్రారంభిస్తాం.స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇ–కామర్స్ అండ్ లాజిస్టిక్స్, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్.. ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ అండ్ కామిక్స్ కోర్సులు ప్రారంభిస్తాం. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఆయా పరిశ్రమల ప్రతినిధులే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తారు.ఈ మేరకు దేశంలోని ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మాస్యూ టికల్ వైపు, బ్యాంకింగ్ విషయంలో ఎస్బీఐ, కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్కు సంబంధించి రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీఎఫ్ఎక్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు..’ అని సీఎం వివరించారు. ఏడాదికి రూ.50 వేలు ఫీజు‘ఏడాదికి రూ.50 వేలు నామమాత్రపు ఫీజుతో శిక్షణ అందిస్తాం. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తాం. హాస్టల్ వసతి కల్పిస్తాం. భవిష్యత్తులో జిల్లాల్లోనూ వర్సిటీ పరిధిలో కాలేజీలు ఏర్పాటు చేస్తాం. యూనివర్సిటీలో 3 నెలల నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిపికెట్లు ఇస్తారు.అలాగే రెండు మూడేళ్ల డిప్లొమా కోర్సులు కూడా అందిస్తాం. డిగ్రీ పట్టాలు కూడా ఇస్తారు. తర్వాత వాళ్లు పీజీ, పీహెచ్డీ కూడా చేసుకోవచ్చు. యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యాపారవేత్తను చైర్మన్‌గా, చాన్స్‌లర్‌గా, ప్రసిద్ధిగాంచిన వారిని వైస్ చాన్స్లర్లుగా నియమించాలని భావిస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే సంతోషించేవాళ్లం. కానీ ఆయన సభకు రాలేదు.అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారు..’ అని రేవంత్ విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాందీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు దేశ పురోభివృద్ధికి చేసిన కృషిని ముఖ్యమంత్రి వివరించారు. నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదులు వేశారని, ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు ప్రస్తుతం మనవారే సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు సైతం డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారని, వారిని వాటి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్గీకరణపై నిర్ణయానికి ప్రత్యేకంగా అసెంబ్లీప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. వర్గీకరణ కోసం తరాలకు తరాలు నిరీక్షించాయని చెప్పారు. వారికీరోజు శుభదినమని పేర్కొన్నారు. దళిత బిడ్డలు ఓట్లేస్తేనే మా అక్కలు గెలిచారన్నారు. సెట్విన్, ఐటీఐలను మూసేస్తారా: ఒవైసీ‘స్కిల్స్ వర్సిటీ రావడం వల్ల ఇప్పటికే ఉన్న సెట్విన్, ఐటీఐ, యూత్ సర్వీసెస్ వంటి వాటికి ఇబ్బందులు రావా..? వాటిని మూసేస్తారా?’ అని మజ్లిస్ పక్ష నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. తాము స్కిల్స్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదని, కానీ ఇప్పటికే ఉన్న వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వర్సిటీ సెలెక్ట్ కమిటీలో మైనారిటీలకు కూడా అవకాశం ఉండాలన్నారు. కాగా సీఎం బదులిస్తూ.. ఐటీఐ, సెట్విన్ వంటి వాటిని మూసివేయబోమని చెప్పారు.జిల్లాలకు విస్తరించాలినైపుణ్య విశ్వవిద్యాలయ సేవలను జిల్లా కేంద్రాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నైపుణ్య శిక్షణ కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిదర్శనమని కాంగ్రెస్ సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వర్సిటీకి గవర్నర్ వైస్ చాన్స్‌లర్‌గా ఉండేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ కోరారు.నైపుణ్య అంతరాన్ని తగ్గించేందుకే: శ్రీధర్‌బాబు విద్య, ఉపాధి మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని భర్తీ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి, ఉపాధిలో అంతర్జాతీయంగా పోటీ పడేలా చేయడమే దీని ముఖ్యోద్దేశమన్నారు. దేశంలోని పలు యూనివర్సిటీల ఏర్పాటును అధ్యయనం చేసిన తర్వాతే బిల్లును రూపొందించినట్లు తెలిపారు. జర్మనీ, దక్షిణ కొరియా, చైనా, సింగపూర్ వంటి దేశాలు తమ విద్యా వ్యవస్థతో వృత్తి విద్యలను ఎలా అనుసంధానం చేశాయో పరిశీలించినట్టు చెప్పారు. చట్టబద్ధంగా రిజర్వేషన్లు: డిప్యూటీ సీఎం భట్టియూనివర్సిటీ బిల్లుపై చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులిస్తూ.. సభ్యులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. చట్టబద్ధంగా ఉన్న రిజర్వేషన్లన్నింటినీ అమలు చేస్తామన్నారు. గతంలో ప్రారంభించిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అమలు చేయటం లేదని, కానీ ఇందులో మాత్రం చట్టప్రకారం అన్నింటినీ అమలు చేస్తామని, గవర్నింగ్ బాడీలో కూడా అనుసరిస్తామని తెలిపారు. మేస్త్రీ లాంటి సాధారణ కోర్సులు కూడా వర్సిటీలో ఉంటాయన్నారు.వాయిదా తీర్మానాల తిరస్కరణసాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ భూ ముల కబ్జా, పురాతన దేవాలయాల నిరాదరణపై బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తిరస్కరించారు. అలాగే టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం, ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, 2017 ఆర్టీసీ వేతన సవరణకు సంబంధించిన బాండ్ల బకాయిల చెల్లింపులపై కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను కూడా తిరస్కరించినట్టు స్పీకర్ ప్రకటించారు. -
Berlin: గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్ కీలక నిర్ణయం
బెర్లిన్: ప్రతిపక్షపార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్ తాజాగా బిల్లు పాస్ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేయవచ్చు. ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్బాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్మార్కెట్లో కొని గంజాయిని సేవిస్తోంది’అని పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. ఇదీ చదవండి.. కిమ్‌కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా -
మరాఠాల రిజర్వేషన్‌కు ఓకే
ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సంబంధిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర రాష్ట్ర విద్య, సామాజిక వెనుకబాటు బిల్లు–2024ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే ప్రవేశపెట్టారు. రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు అమలయ్యే 10 శాతం రిజర్వేషన్‌ను పదేళ్ల తర్వాత సమీక్షిస్తారు. ‘‘రాష్ట్రంలో భిన్న కులాలు, వర్గాలకు ఇప్పటికే 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులోనే ఓబీసీలకు19 శాతం రిజర్వేషన్ కలిసి ఉంది. అంటే దేశంలో పరిమిత 50 శాతం మార్కును దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి’’ అని బిల్లులో పేర్కొన్నారు. ‘‘తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్‌లో 64 శాతం, బిహార్‌లో 69 శాతం, గుజరాత్లో 59 శాతం, పశ్చిమబెంగాల్లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓబీసీ కోటాలో కాకుండా రాష్ట్రంలో మరాఠాలకు విడిగా రిజర్వేషన్ ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత కుంబీ కులానికి చెందిన మరాఠాలకు, వారి రక్తసంబందీలకు మాత్రమే కుంబీ కుల ధ్రుజీవీకరణ పత్రమిస్తామని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. విడిగా కోటా వద్దు: జరాంగే మరాఠాలకు విడిగా కాకుండా ఓబీసీ రిజర్వేషన్లలోనే కోటా కావాలని ఉద్యమనేత మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. -
మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ముంబై: మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని సీఎం ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. ‘సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సర్వే జరిపించాం. మరాఠా రిజర్వేషన్ బిల్లు కోసమే నేడు(మంగళవారం) అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్ట ప్రకారం మరాఠా రిజర్వేషన్ కల్పిస్తాం’ అని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబూ అజ్మీ.. రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ముస్లింల కూడా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం గమనార్హం. చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? -
సీఈసీ, ఈసీల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) బిల్లు–2023ని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బిల్లును తెచ్చామని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ చెప్పారు. ‘‘1991 నాటి చట్టంలో సీఈసీ, ఈసీల నియామక నిబంధనలు లేవు. తాజా బిల్లులో వాటిని పొందుపరిచాం. సీఈసీ, ఈసీ నియామకాలను ఇప్పటిదాకా ప్రభుత్వమే చేపట్టేది. ఇకపై వాటిని ప్రత్యేక కమిటీ చూసుకుంటుంది. వారి వేతనాలు తదితరాలను బిల్లులో పొందుపరిచాం. సీఈసీ, ఈసీలకు చట్టపరమైన రక్షణలను కల్పించాం’అని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం బిల్లులోని అంశాలు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రధాని, ఆయన నామినేట్ చేసే సభ్యులు సీఈసీ, ఈసీలను నియమించడమంటే ఎన్నికల సంఘాన్ని నామమాత్రంగా మార్చడమేనని రణదీప్ సూర్జేవాలా (కాంగ్రెస్) అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీలో చేర్చకపోవడమేమిటని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రశ్నించారు. సీఈసీ, ఈసీల హోదాను కేబినెట్ సెక్రటరీ స్థాయికి కేంద్రం దిగజార్చిందని జవహర్ సర్కార్ (టీఎంసీ) మండిపడ్డారు. బీజేడీ, డీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
బిల్లు ఆమోదం.. కాంట్రాక్టు ఉద్యోగుల సంబరాలు..
-
జుట్టుపైనా వివక్ష! క్రౌన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం, వారికి ఆనందానికి అవధుల్లేవ్
‘అది జుట్టా, కలుపు మొక్కా?’ అని ఒకరు, ‘గొర్రె బొచ్చుకు, వారి జుట్టుకు ఏమన్నా తేడా ఉందా?’ అని మరొకరు ‘నల్ల జుట్టుంటే ఉద్యోగానికేం పనికొస్తారు?’ జుట్టుపై అమెరికన్ల వివక్షాపూరిత వ్యాఖ్యలివి! జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష గురించి విన్నాం. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం తలపై జుట్టు దగ్గర్నుంచి కాలి గోళ్ల దాకా అక్కడ అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయంగా మారింది... జుట్టు నల్లగా, పొడవుగా, రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉంటుందంటాం. కానీ నల్లజాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్‌తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు కంటగింపు వ్యవహారమే. స్కూళ్లు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట... ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చి కన్పిస్తుందక్కడ. ఆఫ్రో, బ్రయిడ్స్, డ్రెడ్‌లాక్స్, కార్న్‌రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష పెరిగిపోతుండటంతో టెక్సాస్‌లో ప్రతినిధుల సభ కల్పించుకోవాల్సి వచ్చింది. నల్లజుట్టుపై వివక్ష పనికిరాదంటూ క్రౌన్ యాక్ట్ బిల్లును ఆమోదించింది. జుట్టుపై వివక్ష తగదంటూ డెమొక్రాట్ సభ్యురాలు రెట్టా బోవర్స్ తొలుత గళమెత్తారు. ఎవరి జుట్టు ఎలా ఉంటే అలానే ఉండనివ్వాలి. మార్చుకొమ్మని శాసించే హక్కు ఎవరికీ ఉండదు’’అన్నారామె. బోవర్స్ తొలిసారి ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడు ఇదంత అవసరమా అని అంతా కొట్టిపారేసారు. కానీ ఇప్పుడది 143–5 ఓట్లతో నెగ్గడంతో ఆమె ఆనందం అవధులు దాటింది. బిల్లు ఎలా వచ్చిందంటే.. హ్యూస్టన్‌లో బార్బర్స్ హిల్ హైస్కూలులో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే విద్యార్థిపై చూపిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆర్నాల్డ్ ఏడో తరగతి నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు. అది ట్రినిడాడియన్ల సంస్కృతిలో భాగం. కానీ జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూలు అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా లాభం లేకపోయింది. ఇదంతా 2020లో జరిగింది. ఆర్నాల్డ్ కథ ఇంటర్నెట్లో వైరలైంది. అతనికి ప్రఖ్యాత టీవీ షో ది ఎలెన్ డిజెనరస్లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కు కూడా ఆహ్వానించాడు. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూలు నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది. ఈ వివక్ష ఇప్పటిది కాదు! అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచీ ఉంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చులా ఉంటుందని అప్పట్లోనే హేళన చేసేవారు. తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకునే నల్లజాతి మహిళలు ఉద్యోగాలకు పనికి రారన్న అభిప్రాయం అమెరికన్లలో పెరిగింది. జుట్టు ఎక్కువున్న వారికి వృత్తిపరమైన లక్షణాలేవీ ఉండవని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యముండదని అడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చారు. తెల్ల జుట్టు వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిచ్చేవారు. ఇంటర్వ్యూ ఉంటే హెయిర్‌స్టైల్ మారాల్సిందే! డోవ్, లింక్డిన్ సంస్థలు ఇటీవల జుట్టు వివక్షపై సంయుక్త అధ్యయనం చేశాయి. నల్లజాతి యువతుల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్వ్యూలకి వెళ్లినప్పడు హెయిర్ స్టైల్స్ మార్చుకుంటున్నట్టు తేలింది. నల్లటి కురులున్న 25–34 మధ్య వయసు వారిలో 20 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. టీవీ షోలు, సోషల్ మీడియాలోనూ నల్ల జుట్టుపై విషం కక్కడం పరిపాటిగా మారింది. ఒబామా భార్యకూ తప్పలేదు! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మహిళ మిషెల్‌కు కూడా జుట్టు వివక్ష తిప్పలు తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆమె తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారట. ఈ విషయం గతేడాది ఓ కార్యక్రమంలో ఆమే స్వయంగా చెప్పారు. ‘‘వైట్‌హౌస్‌లో ఉండగా ఒబామా పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్‌స్టైల్ మార్చుకున్నా. ఒక నల్లజాతి కుటుంబం శ్వేతసౌధంలో ఉండటాన్ని సగటు అమెరికన్లు అంతగా జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపైనా వివాదం రేగడం ఎందుకని భావించా’’అన్నారు. అమెరికా సమాజంలో జుట్టు వివక్ష ఎంతలా వేళ్లూనుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాలుగు బిల్లులకు ఆమోదం
సాక్షి, అమరావతి: నాలుగు బిల్లులకు శుక్రవారం శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లాల ప్రకారమే పాత జిల్లా పరిషత్‌లు కొనసాగేందుకు వీలుగా ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. ఆర్డీసీలో ఇకపై 16 మంది సభ్యులు ఉండేలా ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు, ఏపీ సివిల్ సర్వీసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్ బిల్లు) చట్ట సవరణ బిల్లుకు, సవరించిన మార్కెట్ సెస్ నుంచి కొంత మొత్తాన్ని కేంద్ర మార్కెట్ నిధికి జమ చేయడానికి ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ మార్కెట్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను గురువారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా, శుక్రవారం ఆమోదించాయి. మరో నాలుగు బిల్లులు.. ఒక తీర్మానం శాసనసభలో శుక్రవారం మరో నాలుగు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. ఇండియన్ స్టాంప్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, ఏపీ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ చట్ట సవరణ బిల్లును మంత్రి ధర్మాన సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు రైల్వే ప్రయాణికుల కమిటీలో శాసనసభ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని కోరుతూ సభ తీర్మానించింది. -
నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో తీసుకొచ్చిన నేరస్థుల గుర్తింపు చట్టం స్థానంలో అంతకంటే మించి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బిల్లు తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందింది. నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాదముద్రలు వంటివాటిని భద్రపర్చే అధికారాలను ఇది నేరదర్యాప్తు అధికారులకు దఖలు పర్చింది. ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్సరాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడుతుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. పైగా పార్లమెంటులో ఈ బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చి ఆమోదం పొందిన పద్ధతి మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసు కొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది. ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించ డానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. వలస పాలనా బిల్లు కంటే ప్రమాదకరం ఇప్పుడు 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించింది. మార్చి నెల చివరలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) బిల్లు ప్రకటిత లక్ష్యం ఏమిటంటే, గత శతాబ్ది కాలం పైగా రూపొం దుతూ వచ్చిన నూతన కొలతలు, గుర్తింపు పద్ధతులను లెక్కలోకి తీసుకోవడం ద్వారా చట్టాన్ని మరింతగా మెరుగుపర్చడమే. ఈ క్రమానికి తుదిరూపం ఇవ్వడానికి, ఈ బిల్లులో వేలి ముద్రలు, పాద ముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు, ఐరిస్, రెటీనా స్కాన్లు, శారీరక, జీవపరమైన నమూనాలు, వాటి విశ్లేషణలు, ప్రవర్తనాప రమైన లక్షణాలతోపాటు సంతకాలు, చేతి రాత లేదా ఇతర పరీక్షలను కూడా పొందుపరుస్తున్నారు. కొలతల జాబితాలో వీటన్నింటినీ చేరుస్తున్నారు. అయితే ఈ బిల్లు ఇంతటితో ఆగిపోలేదు. శరీరం నుంచి ఏ కొలతలు తీసుకోవచ్చు అనే శాస్త్రీయ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని మెరుగుపర్చడంతో సంబంధం లేని మరో మూడు లక్షణాలు కూడా ఈ చట్టంలో మనకు కనిపిస్తాయి. వ్యక్తుల గోప్యతను లెక్కచేయని బిల్లు మొదటిది, ముందస్తు నిర్బంధ చట్టాల కింద నిర్బంధంలోకి తీసు కున్న ప్రజలతో సహా ఏ ఇతర నేరాల కింద అరెస్టు చేసిన ప్రజలకైనా సరే... వర్తించే విధంగా ఇది చట్టాల పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటికైతే భారతదేశంలో అరెస్టు చేసే తమ అధికారాన్ని పోలీసులు దుర్విని యోగం చేయడం, ముందస్తు నిర్బంధ చట్టాలను మరింతంగా దుర్వి నియోగపర్చడం గురించి మనందరికీ బాగా తెలుసు. దురదృష్ట వశాత్తూ, ఈ బిల్లు ఏ తప్పూ చేయని, దోషులుగా నిర్ధారణ కాని వ్యక్తుల గోప్యతను ప్రభుత్వం చేతుల్లో పెడుతోంది. రెండు, ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్స రాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వాస్తవంగా చూస్తే ఆ వ్యక్తి చనిపోయేంతవరకు అతడి వివరాలు పోలీసుల వద్ద ఉంటా యన్నమాట. ఏదేమైనా ఒక నేరచర్యలో శిక్షకు గురైన వ్యక్తులందరి పట్ల వివక్షారహిత అన్వయం విషయంలో ఈ బిల్లు పరిధులు దాటు తోంది. పైగా వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడు తుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. మూడు, ఈ బిల్లు వ్యక్తిగత డేటాను ఎలాంటి లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీతోనైనా పంచుకునేందుకు, అందజేసేందుకు జాతీయ నేర రికార్డుల బ్యూరోకి అనుమతిస్తోంది. ‘ప్రయోజన పరిమితి’కి చెందిన సూత్రంతో సహా డేటా పరిరక్షణకు చెందిన ఉత్తమ విధానా లన్నింటికీ ఈ బిల్లు వ్యతిరేకంగా ఉంటోంది. ఉదాహరణకు, డేటా సేకరణ చట్టబద్ధంగా ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన డేటాను ఆ పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప మరే ఇతర ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించకూడదు. నేర దర్యాప్తు, నేర విచారణ అనేవి సాధారణంగా అనిశ్చితంగానే ఉంటాయి. అన్ని రకాల నేర విచారణకు వ్యక్తిగత డేటా అవసరం ఉండదు. కొన్ని కేసుల్లో మాత్రమే విభిన్న వ్యక్తిగత డేటాలను కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది. పౌరులపై హద్దులు మీరిన నిఘా కాబట్టి, మరోసారి ఈ బిల్లులోని ప్రధాన సమస్య ఏమిటంటే, ఎలాంటి ఆంతరం చూపని దాని స్వభావమే. ఒక నేరాన్ని దర్యాప్తు చేయడానికి వ్యక్తిగత డేటా సేకరణ అవసరమైన చోట నేర వర్గీకరణ లను జాగ్రత్తగా వేరుచేసి చూడవలసిన అవసరం తప్పనిసరి. అలా వేరుచేసి చూడకపోతే వ్యక్తిగత డేటా గోప్యతను వంచించినట్లే అవు తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నేరçస్థుల రూపాలను కొలిచే టెక్నిక్‌లు గత శతాబ్ద కాలంగా ఏర్పడుతూ వచ్చాయి కాబట్టి నేరస్థులకు సంబంధించిన ప్రకటన, హేతువులను సరిగ్గా నోట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బిల్లు విస్మరిస్తున్నది ఏమి టంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రభుత్వం తన పౌరులపై అత్యంత అధికంగా నిఘా పెట్టే అధికారాలను కలిగి ఉంది. కాబట్టే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని అత్యంత కఠి నంగా క్రమబద్ధీకరించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వం ఫొటోగ్రాఫులతో, వేలిముద్రలతోనే చక్కగా నిఘా పెట్టగలుగుతున్నప్పుడు, వాటికి ఇప్పుడు రెటీనా స్కాన్లు, బయోలాజికల్ శాంపిల్స్ (డీఎన్ఏ కూడా దీంట్లో భాగమే), చివరకు ప్రవర్తనాపరమైన లక్షణాలను తీసుకోవడం కూడా చేస్తున్న ప్పుడు ప్రభుత్వానికి ఉండే అధికారం ఇంకా విస్తరిస్తుంది. పైగా అలాంటి డేటా పరిరక్షణ చర్యలు కూడా చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో, మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. అదేమిటంటే, డేటా పరిరక్షణ గురించి భారత్ ప్రకటించి అయిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశం డేటా పరిరక్షణ చట్టాన్ని కలిగిలేదు. ఇది చట్టరూపం దాల్చి ఉంటే వ్యక్తిగత డేటా ఉపయోగంలోని పరిమితులను స్పష్టంగా నిర్దేశించి ఉండేది. అలాగే వ్యక్తిగత డేటాను దుర్వినియోగపర్చే విధానాలను నిరోధించడానికి తగిన పరిష్కార యంత్రాంగాలను కూడా ఏర్పర్చి ఉండేది. డేటా పరిరక్షణ చట్టం లేక పోవడం అనేది క్రమబద్ధీకరణ లేని న్యాయ పరిధిని మాత్రమే అందు బాటులో ఉంచుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే, క్రిమినల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ బిల్ వంటి చట్టాల ద్వారా ప్రభుత్వ నిఘా అధికారం ఎలాంటి తనిఖీలు లేకుండా విస్తరిస్తూనే ఉంటుంది. ఇంత తొందర దేనికి? చివరగా, పార్లమెంటులో బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చిన పద్ధతి ఆందోళన కలిగిస్తోంది. ఇది మన ప్రజాస్వామ్యంలో చట్టాల రూప కల్పన విషయంలో పెరుగుతున్న సాధారణ అంశమనే చెప్పాలి. ఈ బిల్లును ముందస్తుగా ప్రజల్లో చర్చకు పెట్టలేదు. ప్రజలు తమ అభి ప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకే ‘లక్ష్యాలు, కారణాల ప్రకటన’ విషయంలో బిల్లు సైలెంటుగా ఉండిపోయిందన్న వాస్తవంలోనే ఇది ప్రతిఫలించింది. వాస్తవానికి ప్రభుత్వ నిఘా అధి కార పరిధిని విస్తరించాల్సిన అవసరం గురించి ఇది పేర్కొనాల్సి ఉండింది. ప్రజా చర్చలో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తేవారు. అందుకే ఈ బిల్లును అసలు ప్రజా సంప్రదింపుల్లో భాగం చేశారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ అన్ని కారణాల వల్ల, ఈ కొత్త బిల్లు గురించి తీవ్రమైన ఆందో ళన కలుగుతోంది. మరింత ప్రజాస్వామికమైన, సమ్మిశ్రితమైన ప్రక్రియ ఈ భయాలన్నింటికీ పరిష్కారంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియకు ఎలాంటి ఆస్కారం లేకుండానే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడమే విచారకరం. -గౌతమ్ భాటియా వ్యాసకర్త ఢిల్లీకి చెందిన న్యాయవాది (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
చేపకు ఇక నాణ్యమైన ఫీడ్
సాక్షి, అమరావతి: చేపలు, రొయ్యల మేతలో ఇప్పటివరకు ఉన్న అనైతిక విధానాలకు ఫిష్ ఫీడ్ యాక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. తద్వారా ఆక్వా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయనుంది. ఈ మేరకు తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఫిష్ ఫీడ్ యాక్ట్-2020 బిల్లును ఆమోదించింది. త్వరలోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. చేపల మేత తయారీలో కొన్ని ముడి ప్రొటీన్ కలిగిన జీర్ణం కాని పదార్థాలు, యూసిడ్, కరగని బూడిద, యూరియా మొదలైన వాటిని ఉత్పత్తిదారులు కలపడం వల్ల ఆక్వా రైతులు నష్టపోతున్నారు. రొయ్యలు, చేపల పెంపకంలో 60 శాతం మేత కోసమే రైతులు ఖర్చు చేస్తున్నారు. నాణ్యత లేని మేత వల్ల ఆశించిన స్థాయిలో చేపలు, రొయ్యల పెరుగుదల ఉండటం లేదు. మరోవైపు వాటికి వ్యాధులు కూడా సంక్రమిస్తుండటంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన మేతను రైతులకు అందిస్తే చేపలు, రొయ్యల దిగుబడి అధికంగా ఉండటంతోపాటు మేత వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాలీనా మేత వ్యాపారం రూ.17 వేల కోట్ల వరకు ఉంటోంది. ఇంత టర్నోవర్ కలిగిన మేత తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే అటు రైతులకు.. ఇటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దేశంలోనే తొలిసారిగా.. ఇప్పటివరకు రాష్ట్రంతోపాటు దేశంలోనూ చేపల మేతలో నాణ్యతను నిర్ధారించే ప్రభుత్వ విభాగం అందుబాటులో లేదు. చేపల మేత తయారీ పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నివారించడానికి, చేపల మేతలో నాణ్యత నిర్ధారణ చర్యలను అమలు చేయడానికి.. రాష్ట్రంలో ఫిష్ ఫీడ్ యాక్ట్-2020ను తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్రంలో మొదటిసారిగా ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని తెస్తోంది. ఫిష్ ఫీడ్ యాక్ట్‌లో అంశాలు.. ఫిష్ ఫీడ్ యాక్ట్‌లో 28 విభాగాలు ఉన్నాయి. ♦మత్స్య శాఖ కమిషనర్, సంబంధిత అధికారులు చేపల మేత నాణ్యతను పరిశీలించడంతోపాటు తయారీలో అనైతిక విధానాలను నియంత్రించొచ్చు. ♦చేపల మేత వ్యాపారాలకు లైసెన్సులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారి లేదా కమిషనర్ ప్రతిపాదించిన ఏ అధికారి అయినా లైసెన్సింగ్ అథారిటీగా వ్యవహరిస్తారు. ♦ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి లేదా కంట్రోలింగ్ అధికారి నియమించిన అధికారులు చేపల మేత నాణ్యతను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ♦రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, చేపల మేత వ్యాపార కార్యకలాపాలు, నియంత్రణ తదితర అన్ని విషయాలపై కంట్రోలింగ్ అథారిటీకి సలహాలు ఇవ్వడానికి, చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఉంటుంది. ♦మేతలో నాణ్యత ప్రమాణాల పరిశీలనకు రిఫరల్ ఫీడ్ అనాలిసిస్ లేబొరేటరీ, జిల్లా స్థాయిలో ఫిష్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ♦రాష్ట్రంలో, ఇతర దేశాల్లో తయారు చేసిన చేపల మేతలో నాణ్యత ప్రమాణాలు ఒకేలా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విదేశీ మేతలో నాణ్యత లేకుంటే దిగుమతులు ఆపేస్తుంది. ♦ఫిష్‌ఫీడ్ ఇన్స్పెక్టర్, థర్డ్‌పార్టీ టెక్నికల్ ఏజెన్సీలు నిరంతరం చేపల మేతలో నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తారు. నాణ్యత లేకుంటే భారీ జరిమానాలు విధిస్తారు. ఫిష్ ఫీడ్ యాక్ట్ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలు.. ♦చేపలు, రొయ్యల మేత తయారీలో ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అన్ని రకాల మేతల వాణిజ్య కార్యకలాపాలు ఫిష్ ఫీడ్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ♦రైతులు వారి అవసరాలకనుగుణంగా మేతను ఎంచుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ♦నిషిద్ధ యాంటీబయోటిక్స్ లేని చేపల మేత వాడటం ద్వారా మంచి బ్రాండ్ ఇమేజ్‌తో నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను అందిస్తుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది మేతపై ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ విభాగం లేకపోవడం వల్ల అనేక కంపెనీలు నాణ్యత లేని మేతను తయారు చేసి రైతుల్ని నిలువు దోపిడీ చేశాయి. ఫీడ్ యాక్టు అమలులోకి వస్తే రైతులకు సాగు వ్యయం తగ్గుతుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు నాణ్యమైన చేపలు, రొయ్యలు ఎగుమతి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన రొయ్యలు, చేపలకు మంచి రేటు లభిస్తుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా ఆక్వా రంగంపై ఆధారపడిన ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. - కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ రైతులకు రక్షణ కవచం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఫీడ్ యాక్ట్ రైతుకు రక్షణ కవచం లాంటిది. కంపెనీలు మేత తయారీలో ఏ ముడి పదార్థాలు వాడుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీంతో నాణ్యమైన మేత అందుబాటులోకి వస్తుంది. ఎప్పటికప్పుడు మేతను పరిశీలించే అధికారం మత్స్యశాఖకు ఉండటం వల్ల అనైతిక విధానాలు పూర్తిగా తగ్గిపోతాయి. విదేశాలకు ఆక్వా ఎగుమతులు పెరుగుతాయి. - డాక్టర్ నగేశ్, ప్రెసిడెంట్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ - ఏపీ -
చల్లగా... సంస్కరణలు
హడావుడి లేదు. ఆర్భాటం అసలే లేదు. చడీచప్పుడూ లేకుండా దేశంలో నాలుగురోజుల వ్యవధిలో భారీ సంస్కరణలు పట్టాలెక్కాయి. మొన్నటికి మొన్న సాగు రంగ సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులకు మూజువాణి ఓటుతో పార్లమెంటు ఆమోదముద్ర పడింది. కార్మిక చట్టాలను సంస్కరించే మరో మూడు బిల్లులు సైతం పార్లమెంటులో బుధవారం మూడు గంటల చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఈ మూడు బిల్లులూ మూడు కోడ్లుగా వున్నాయి– కార్మికుల వృత్తిపరమైన భద్రత, వారి ఆరోగ్యం, పని పరిస్థితులపైనా... పారిశ్రామిక సంబంధాల పైనా... కార్మికుల సామాజిక భద్రతపైనా వీటిని రూపొందించారు. మిగిలినవాటి మాటెలావున్నా మొదటి రెండు బిల్లులపైనా కార్మిక సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఇవి రాష్ట్రాల పరిధిలోకి జొరబడి, వాటి హక్కుల్ని దెబ్బతీస్తున్నాయని కేరళవంటి రాష్ట్రాలు ఆరోపిస్తుంటే... ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) సైతం పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మికులకు వ్యతిరేకంగా వున్నదని ఆరోపిస్తోంది. నిరుడు మే నెలలో రెండోసారి ఘన విజయం సాధించాక జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సంపద సృష్టి, సంపద పునఃపంపిణీలను ప్రస్తావించారు. ఆ రెండింటినీ ప్రస్తావించారంటేనే తన రెండో దశ పాలనలో అందుకు తగ్గ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చాలామంది జోస్యం చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది. సాధారణంగా అయితే అమల్లో వున్న విధానాలను సమూలంగా మార్చే ఈ మాదిరి సంస్కర ణలు తీసుకురావడం అంత సులభం కాదు. పార్లమెంటులో వాగ్యుద్ధాలు, సభల వాయిదాలు, సమ్మె పిలుపులు, ఆందోళనలు రివాజు. కానీ కరోనా అనంతర పరిస్థితులు దాన్నంతటినీ మార్చేశాయి. అనేకానేక పరిమితుల మధ్య పార్లమెంటు సమావేశంకాగా... ఉద్యోగ భయం, జీతాల కోత వగైరాలతో భవిష్యత్తుపై బెంగతో కార్మికులు, బడుగు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో పాటు, కరోనా అంటేవున్న భయాందోళనల వల్ల సమీకరణ కూడా అసాధ్యం. వీటి అవసరం లేకుం డానే ఇంత ముఖ్యమైన సంస్కరణలపై లోతైన చర్చలు జరిగితే అవి మనం అనుసరిస్తూ వస్తున్న ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిబింబించేవి. సాగు రంగ సంస్కరణల బిల్లుల విషయంలో సభలో విపక్షాలు వున్నా చర్చలు సరిగా సాగలేదు. ఇప్పుడు కార్మిక రంగ సంస్కరణల బిల్లులకైతే దాదాపుగా విపక్షాలే సభలో లేవు. కార్మిక చట్టాల ప్రధానోద్దేశం కార్మికుల హక్కుల్ని పరిరక్షించడం, అదే సమయంలో యాజ మాన్యాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం. ఇప్పుడు అమల్లోవున్న చట్టాలు కార్మిక హక్కుల పరిరక్షణపై అతిగా శ్రద్ధ చూపుతున్నాయని పరిశ్రమల యజమానులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇవి కార్మికులకు ఉపయోగపడటం మాటెలావున్నా అధికారుల అవినీతికి దారితీస్తున్నాయి. చూసీ చూడనట్టు పోవడం కోసం భారీగా సొమ్ము చేతులు మారుతోంది. చాలా పరిశ్రమల్లో రిజిస్టర్లో వుండే కార్మికులకూ, వాస్తవంగా పనిచేసే కార్మికుల సంఖ్యకూ పొంతన వుండదు. అందువల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మరణించినా, శాశ్వతంగా వికలాంగులైనా వారిపై ఆధారపడే వారికి ఏ అండా లేకుండా పోతోంది. కనుక పారదర్శకమైన, అందరికీ ప్రయోజనకరమైన చట్టాలు వుంటే మంచిదే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలకు అందుకు దోహదపడతాయా? మన దేశంలో వాస్తవంగా కార్మిక చట్టాలెలా వున్నాయో చెప్పడానికి దేశం నలుమూలలా లాక్డౌన్ సమ యంలో స్వస్థలాలకు నిత్యం నడుచుకుంటూ పోయిన వేలాదిమంది వలసజీవులే సాక్ష్యం. సంవత్స రాల తరబడి వారు చేసే చిన్నా చితకా ఉద్యోగాలు, పనులు ఏ చట్టం కిందికీ రాకపోవడం వల్ల హఠా త్తుగా వారు రోడ్డున పడ్డారు. సాయం చేయడం మాట అటుంచి, అత్యధికశాతం యజమానులు వారికి ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఎగ్గొట్టి వెళ్లగొట్టారు. కార్మిక చట్టాలు పటిష్టంగావుంటే అది అసాధ్యమ య్యేది. చిత్రమేమంటే లాక్డౌన్ సమయంలో యూపీ, ఎంపీ రాష్ట్రాలు కార్మికుల పనిగంటలు పెంచుతూ ఆర్డినెన్సులు తీసుకొచ్చాయి. పెద్దయెత్తున నిరసనలు రావడంతో అవి నిలిచిపోయాయి. ఇప్పుడు ఆమోదం పొందిన మూడు బిల్లులూ 350 పేజీల్లో, 411 క్లాజులతో, 13 షెడ్యూళ్లతో వున్నాయి. ఇంత విస్తృతమైన బిల్లులపై మూడు గంటల వ్యవధిలో చర్చ పూర్తయిందంటే వింతగానే వుంటుంది. నియామకాల్లో, తొలగింపులో ఎక్కువ నిబంధనలు యాజమాన్యాలకే అనుకూలంగా వున్నాయని... వివాద పరిష్కార విధానాలు సైతం కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా వున్నాయని బీఎంఎస్ ఆరోపిస్తోంది. పైగా తాము, ఇతర కార్మిక సంఘాలు లోగడ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని, పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల్ని కూడా సరిగా పట్టించు కోలేదని చెబుతోంది. ఇంతక్రితం వందలోపు కార్మికులున్న పరిశ్రమల్లో ప్రభుత్వాల ముందస్తు అను మతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్మెంట్లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు. ఇప్పుడది 300మంది కార్మికులుండే పరిశ్రమలకు వర్తింపజేస్తూ మార్చారు. అలాగే జాతీయ స్థాయి పారిశ్రామిక ద్విసభ్య ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితోపాటు కార్మిక సంబంధ అంశాల్లో పరిజ్ఞానం, అనుభవం వున్న ఒకరికి చోటు చోటు కల్పించాలని ముసాయిదాలో వుంటే ప్రస్తుత బిల్లులో దాన్ని ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదావున్న వ్యక్తికి కట్టబెట్టారు. గుర్తింపు కార్మిక సంఘాల విషయంలోనూ, సమ్మె నోటీసు విషయంలోనూ తాజా నిబంధనలు కఠినంగా వున్నాయి. మారిన ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు సంస్కరణలు తీసుకురావడం ఎంత అవసరమో, అవి మెజారిటీ ఆమోదం పొందేలా, ఏకాభి ప్రాయ సాధన దిశగా వుండటమూ అంతే అవసరం. అప్పుడే వాటి ఉద్దేశిత లక్ష్యాలు నెరవేరతాయి. అటు సాగు రంగ సంస్కరణల్లోనూ, ఇటు కార్మిక రంగ సంస్కరణల్లోనూ ఆ భావన లేకపోవడం విచారకరం. -
సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ కాంగ్రెస్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలను పట్టించుకోకుండా పోడియంను చుట్టుముట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై దాడి చేసినంత పని చేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఉద్దేశించిన తీర్మానంపై ఓటింగ్ జరపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో, ఆగ్రహంతో ఆయన ముఖంపైకి నిబంధనల పుస్తకాన్ని విసిరారు. మరికొన్ని అధికారిక పత్రాలను చించి, విసిరారు. ఆయన ముందున్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు విఫలయత్నం చేశా రు. ఈ గందరగోళం మధ్య సభ కొద్దిసేపు వాయి దా పడింది. ఆ తరువాత ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. సభా సంఘానికి పంపించాలంటూ.. ఈ బిల్లుల ఆమోదం కోసం ముందుగా పేర్కొన్న సమయం కన్నా ఎక్కువ సేపు సభ జరిగింది. ఈ సమయంలో, బిల్లులను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లను, తీర్మానాలను ప్రతిపక్ష సభ్యులు సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చపై వ్యవసాయ మంత్రి సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం ఏకగ్రీవంగా జరగాలన్నారు. ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. విపక్షం తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతుండటంతో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చకు తానివ్వాల్సిన జవాబును కుదించుకుని, క్లుప్తంగా ముగించారు. క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు ఈ రెండు బిల్లులను సభా సంఘాలకు పంపాలన్న విపక్షం తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది. అయితే, దీనిపై డివిజన్ ఓటింగ్ జరగాలని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే డివిజన్ ఓటింగ్ సాధ్యమవుతుందని పేర్కొంటూ, వారి డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తోసిపుచ్చారు. దాంతో, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. అక్కడే ఉన్న మార్షల్స్ అది డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌కు తగలకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన వైపు దూసుకువచ్చిన మరో పుస్తకం కూడా తగలకుండా చూశారు. మరోవైపు, సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను డిప్యూటీ చైర్మన్ పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమైన తరువాత.. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఈ బిల్లులను మూజువాణి ఓటింగ్‌కు పెట్టారు. తొలి బిల్లు ఆమోదం పొంది, విపక్ష తీర్మానాలు వీగిపోయిన సమయంలో ఇద్దరు విపక్ష సభ్యులు రాజ్యసభ ఆఫీసర్స్ టేబుల్స్‌పై ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రెండో బిల్లు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. విపక్ష తీర్మానాలు వీగిపోయాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది. బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబట్టారు. రైతులకు మరణ శాసనం వంటి ఈ బిల్లులను తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నం ఇదని ఆరోపించింది. ప్రతిపక్షం తీరు సిగ్గుచేటు: రాజ్‌నాథ్ రాజ్యసభలో రైతు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేట ని, పార్లమెంట్ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రైతు బిల్లులను సభ ఆమోదించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యుల ఇలాంటి ప్రవర్తను, ఘటనలను ఊహించలేమన్నారు. సభాధ్యక్షుని నిర్ణయంతో ఏకీభవించని నేతలు ఆయనపై దాడికి ప్రయత్నించడం, హింసాత్మక చర్యలకు పూనుకో వడాన్ని అనుమతించబోమన్నారు. ఎంఎస్పీపై అనుమానాలొద్దు: ప్రభుత్వం విపక్షాలు ఆందోళన చెందుతున్నట్లుగా.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని తొలగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఎంఎస్పీ విధానం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా తాము కోరుకున్న ధరకు అమ్ముకునే వీలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులకు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని వివరించారు. బిల్లులో తాము పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రతిపాదించిందని గుర్తు చేశారు. వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా, తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్య(ప్రోత్సాహ, సులభతరం)’ బిల్లు ద్వారా లభిస్తుందన్నారు. రైతులపై సెస్, చార్జీలు ఉండబోవన్నారు. అలాగే, రైతులు వ్యవసాయాధారిత సంస్థలు, కంపెనీలు, ఎగుమతిదారులతో తమ ఉత్పత్తులను ముందే కుదుర్చుకున్న ధరకు అమ్మేందుకు ఒప్పందంకుదుర్చుకునే వీలు ‘రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లు కల్పిస్తుందని మంత్రి తోమర్ వివరించారు. ఉపసభాపతిపై అవిశ్వాసం! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై 12 విపక్ష పార్టీలు ఆదివారం అవిశ్వాస నోటీసును ఇచ్చాయి. వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో ఆయన పక్షపాత ధోరణిలో, అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించాయి. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానాలపై డివిజన్ ఓటింగ్ జరగాలన్న డిమాండ్‌ను ఆయన పట్టించుకోలేదని విమర్శించాయి. అవిశ్వాస నోటీసు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, ఆప్ ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రభుత్వం పక్షాన నిలిచి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు. జేడీయూ నేత హరివంశ్ గతవారమే రాజ్యసభ ఉపసభాపతిగా రెండో సారి ఎన్నికయ్యారు. రాజ్యసభలో మెజారిటీ లేనందునే ప్రభుత్వం డివిజన్ ఓటింగ్‌కు అంగీకరించలేదని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమన్నారు. ఆ ఎంపీలపై ప్రివిలేజ్ మోషన్ రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో అనుచితంగా ప్రవర్తించిన పలువురు విపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ సహా ముగ్గురు, లేక నలుగురు ప్రతిపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిల్లుల ఆమోదం సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ విపక్షపార్టీలు ఆయనపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆ తరువాత, వెంటనే కొందరు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి, సభలో జరిగిన ఘటనలపై చర్చించారు. విపక్ష సభ్యుల ప్రవర్తనను ఆయనకు వివరించారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం రైతులకి మరణశాసనం లిఖించింది. భూమిలో బంగారు పంటలు పండించే రైతన్నల కంట్లో నుంచి రక్తం ప్రవహిస్తోంది. రైతులకి మరణశాసనంగా మారే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వారి బంగారు భవిష్యత్‌కు ఈ బిల్లులు బాటలు వేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో ఈ బిల్లుల్ని తీసుకువచ్చారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు కొనసాగుతాయి – జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం. కానీ అత్యధికుల అణచివేత కాదు. బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపించాలి – సుఖ్బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం, కార్పొ రేట్లకు అనుకూలం. రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాల పరిధిలో వ్యాపార లావాదేవీలను నియంత్రిస్తాయి. చరిత్ర ఎవరినీ క్షమించదు. – ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2028 సంవత్సరం వచ్చినా రైతుల ఆదాయం పెరగదు. ఈ బిల్లుల ఆమోదం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. బిల్లుల్ని వెంటనే సెలక్ట్ కమిటీకి పంపాలి – డెరెక్ ఓబ్రీన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వ్యవసాయ బిల్లులతో రైతు ఆత్మహత్యలు ఇంక జరగవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? వీటిపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలి – సంజయ్ రౌత్, శివసేన ఎంపీ స్వల్పకాలంలోనూ, దీర్ఘకాలంలోనూ ఈ బిల్లులు రైతులకు ఎలా మేలు చేస్తాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించి చెప్పాలి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో ఈ బిల్లుల్ని అత్యవసరంగా ఆమోదించాల్సిన అవసరం ఏముంది ? – హెచ్డీ దేవెగౌడ, జేడీ (ఎస్) ఎంపీ వ్యవసాయ బిల్లులపై చర్చించకుండా హడావుడిగా ఆమోదించడమేంటి? రైతు బిడ్డలెవరూ ఇలాంటి బిల్లుల్ని రూపొందించరు. తిరిగి స్వగ్రామాలకు వెళితే అక్కడ యువత పార్లమెంటులో కూర్చొని రైతన్నలకు మరణశాసనం లిఖిస్తారా అని ప్రశ్నిస్తారు. – రామ్‌గోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద రైతులకు స్వీట్లు తినిపిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ -
కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు శాసనసభ స్పీకర్ పోచారం ప్రకటించారు. సభలో మూజువాణి ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. దీంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ కూడా జరుగనుంది. కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగనుంది. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టమని అన్నారు. (దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్) -
ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం
-
చైనాకు అమెరికా భారీ షాక్..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది. రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, క్రిస్ వాన్ హాలెన్ ప్రతిపాదించిన బిల్లును యూఎస్ సెనేట్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్ ఫండ్లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలకు చెక్ చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే..విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ పర్యవేక్షక బోర్డు ఆడిట్ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్ వాన్ హోలెన్ అన్నారు. చదవండి : అమెరికా కీలక ముందడుగు డ్రాగన్ కంపెనీలకు గడ్డుకాలం చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్ స్టాక్ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ హల్క్స్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆడిటర్స్పైనా బిల్లు ప్రభావం చూపనుంది.ఇక అమెరికా-చైనా ట్రేడ్‌వార్ ఉద్రిక్తతల నుంచి కరోనా మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. -
బిల్లులకు వ్యతిరేకం కాదంటూనే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ కమిషన్ బిల్లులపై శాసన మండలిలో మంగళవారం వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులను స్వాగతిస్తున్నామంటూనే.. విపక్ష సభ్యులు సవరణలు ప్రతిపాదించి ఓటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో ఇంగ్లిష్ మీడియం బిల్లులో తెలుగు మీడియం ఆప్షన్ పెట్టాలని, ఎస్సీ కమిషన్ బిల్లులో వర్గీకరణ అంశాన్ని పెట్టాలన్న సవరణలతో బిల్లును మండలిలో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982కు సవరణ తెస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు మంత్రి ఆదిమూలపు సురేష్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలో పాల్గొన్న పి. అశోక్‌కుమార్(టీడీపీ), మాధవ్ (బీజేపీ), విఠపు బాలసుబ్రహ్మణ్యం(పీడీఎఫ్) ఇంగ్లిష్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థులకు తెలుగు మాధ్యమం కూడా ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని సవరణను ప్రతిపాదించారు. దీనిపై మంత్రి సురేష్ మాట్లాడుతూ.. పేదలు ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు సన్నాయి నొక్కులు నొక్కుతూ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. టీడీపీకి అనుకూలమైన నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకించని ప్రతిపక్షాలు.. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం పెడితే అడ్డుకోవడం సరికాదన్నారు. తెలుగును తాము నిర్లక్ష్యం చేయడంలేదని, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామని వివరించారు. దార్శనికుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు బంగారు భవిత ఇవ్వబోతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సవరణకు పట్టుబట్టడంతో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. విపక్ష సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో వారు ప్రతిపాదించినట్లు తెలుగు మాధ్యమం ఉండాలనే సవరణతో బిల్లును ఆమోదించారు. ఎస్సీ కమిషన్ బిల్లుకు వర్గీకరణ మెలికపెట్టిన టీడీపీ ఎస్టీ కమిషన్ బిల్లుకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆమోదం తెలిపిన టీడీపీ సభ్యులు, ఎస్సీ కమిషన్ బిల్లులో మాత్రం వర్గీకరణ అంశాన్ని మెలికపెట్టారు. తమ ప్రతిపాదనను బిల్లులో చేర్చాలని టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్, పలువురు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ సుప్రీం కోర్టు రద్దు చేసిందని, అటువంటి అంశాన్ని ఎస్సీ కమిషన్ బిల్లుకు ముడిపెట్టి అసలు లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సరికాదని ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, మంత్రి పినిపే విశ్వరూప్, సభ్యులు జంగా కృష్ణమూర్తి, చల్లా రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. అయినా విపక్షం ఓటింగ్‌కు పట్టుబట్టడంతో వర్గీకరణ అంశాన్ని చేర్చి సవరణతో బిల్లును ఆమోదించారు. అసెంబ్లీ ఆమోదించిన 16 బిల్లుల్లో సవరణలు ప్రతిపాదించిన రెండు బిల్లులు మినహా మిగిలిన 14 బిల్లులను మండలి ఆమోదించింది. ఒక పార్టీకి రెండు వైఖరులా? ఒక పార్టీకి ఎక్కడైనా ఒకే విధానం ఉండటం చూశానని, కానీ టీడీపీకి శాసనసభలో ఒక మాట, శాసన మండలిలో మరొక మాట చెబుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఎస్సీ కమిషన్, ఇంగ్లిష్ మీడియం బిల్లులపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆమోదిస్తే.. ఆ పార్టీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ కమిషన్ బిల్లుతో పేదలకు మేలు చేసే కార్యక్రమానికి, విద్యా చట్టం సవరణ బిల్లుతో పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులను బొత్స కోరారు. -
బిల్లు ఆమోదం
-
13కీలక బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం
-
ఇంగ్లీష్ మీడియం చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మక ఘట్టం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇక నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ కాదని, రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ అని ఆయన స్పష్టం చేశారు. ఇందు కోసం తీసుకొచ్చిన ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ బిల్లు–2019తో, ఇక నుంచి ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియమ్‌ను ఒక హక్కుగా తీసుకు వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడారు. రైట్ టు ఎడ్యుకేషన్‌ను రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్‌గా మార్చబోతున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్న ఆయన, ఈ బిల్లుతో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇక మీద ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా మారబోతుందన్నారు. ‘రాష్ట్రంలో అక్షరాలా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత ఏడాది 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, ఆ మరుసటి సంవత్సరం 10వ తరగతిని ఇంగ్లిష్ మీడియంగా మారుస్తున్నాం. ఆ విధంగా నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో రాసే విధంగా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు అని తెలియజేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ బిల్లు–2019ను సభ ఆమోదించింది. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. -
భద్రత దిశగా..
-
దిశ యాక్ట్‌తో పోలీసుల బాధ్యత పెరిగింది
-
ఇక మరణ శాసనమే
-
దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
-
మాకు నిజమైన స్వాంతంత్ర్యం వచ్చింది
-
ఇలాంటి చట్టం వచ్చుంటే మా కూతురు బతికేది
-
దిశ చట్టం ఆమోదం..మహిళల సంబరాలు
-
లోక్‌సభ 116% ఫలప్రదం
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయసభల పనితీరును వెల్లడించారు. లోక్‌సభ సమావేశాలు 116 శాతం(కేటాయించిన సమయం కంటే ఎక్కువ చర్చ), రాజ్యసభ సమావేశాలు 99 శాతం ఫలప్రదమయ్యాయని శుక్రవారం చెప్పారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులను ప్రవేశపెట్టామన్నారు. అందులో లోక్‌సభ 14 బిల్లులను, రాజ్యసభ 15 బిల్లులను ఆమోదించిందన్నారు. సభా కార్యకలాపాలు తెలుగులో... సభా కార్యకలాపాలను ఒక రోజు పాటు తన మాతృభాష తెలుగులో నిర్వహించాలనుకుంటున్నానని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘సభ్యులు తమ మాతృభాషల్లో మాట్లాడితే ప్రజలను ఈ దిశగా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. నా మాతృభాష తెలుగులో ఒకరోజు సభా కార్యకలాపాలు నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. గత సమావేశాలతో పాటు తాజాగా 250వ సెషన్ కూడా వంద శాతం ఫలప్రదమైందని పేర్కొన్నారు. ‘రోజుకు సగటున 9.5 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు వచ్చాయి. 49 ఏళ్లలో ఇదే అత్యుత్తమం’ అని పేర్కొన్నారు. ‘199 జీరో అవర్ అభ్యర్థనలు, 115 ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. ఇదీ రికార్డే’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022కి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పటికి కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. -
ఉన్నది ఒకటే ఇల్లు
ఒక ఇంట్లోని వాళ్లంతా ఒకింటివాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఒక దేశంలోని వాళ్లంతా ఒక దేశంవాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఇంట్లో గానీ, దేశంలో గానీ ‘వాళ్లు’ అనే మాట వచ్చిందంటే అది వేరు చేసినట్లు కాదు. వేరు చేసుకున్నట్లు. తలాక్ రద్దుపై అటుగానీ, ఇటుగానీ నోరు మెదపకుండా మౌనంవహించడమంటే ఇంటి నుంచి, లేదా దేశం నుంచి ఎవర్ని వారు వేరు చేసుకోవడమే. అయితే తలాక్ రద్దును వ్యతిరేకిస్తూ ‘‘అదే ‘మనింటి’ విషయంలోనైతే ఇలా చేస్తామా?’’ అని వినిపిస్తున్నవాదనల కంటే నోరు మెదపని మౌనమే నయమేమో అనిపిస్తుంది.-మాధవ్ శింగరాజు జర్నలిజంలోని బ్యూటీ ఏంటంటే, సాయంత్రం ఇంటికి క్యారీబ్యాగులో ఓ కిలో బియ్యం మోసుకుని వెళ్లేందుకు డ్యూటీ చేసినట్లుగా ఉండదు. గుప్పెడు అక్షరాల్ని చల్లి లోకంలోని బంజరుభూముల్ని పండించడానికి ఆఫీస్‌కి వచ్చినట్లుగా ఉంటుంది. ‘‘మంచిదే కానీ, ప్రత్యేక అంశాలపై నీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని నీ రాతల్లో వ్యక్తం చేయకుండా ఉండడం వల్ల కెరీర్లో నీకు నూకలు చెల్లకుండా ఉంటాయి’’ అని సీనియర్ జర్నలిస్టు ఒకరు హితవు చెప్పినప్పుడు కూడా ‘అతడు’ బంజరు భూముల్ని పండించడం గురించే ఆలోచించాడు తప్ప, క్యారీబ్యాగులో బియ్యం మోసుకుపోతే సుఖం కదా అనుకోలేదు. ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట ఇది. అప్పుడు ‘అతడు’ ట్రైనీ. అదే ‘అతడు’ ఇప్పుడు ‘‘ప్రత్యేక అంశాలపై మీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని మీరు మీ రాతల్లో వ్యక్తం చేయకపోవడం వల్ల క్యారీబ్యాగులో ఇంటికి మీరు బియ్యం మోసుకెళ్లగలరు తప్ప, బంజరు భూముల్ని పండించలేరు’’ అని చెబుతున్న సీనియర్ జర్నలిస్టు (ఈ వ్యాసకర్త). అప్పట్లో మెడ్రాస్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రషీదా భగత్ బ్యూరో చీఫ్‌గా ఉండేవారు. ‘‘రషీదా భగత్ రాయొచ్చా సర్, ప్రత్యేకాంశాల మీద ప్రత్యేక అభిప్రాయాలు?’’ అని అతడు అడిగినప్పుడు, ‘‘రాయొచ్చు. కానీ నువ్వు రాయకూడదు. రాస్తే ఏ విలువా ఉండదు’’ అనేవారు డెస్క్ ఇన్చార్జి. సీనియర్ జర్నలిస్టులు జూనియర్ జర్నలిస్టులకు ఏం చెప్పినా, చివరి మాట మీడియా యాజమాన్యాలదే. అవి వద్దన్న అభిప్రాయాలేవీ మర్నాడు పేపర్లలో కనిపించవు. ప్రత్యేకాంశాలపై ప్రత్యేక అభిప్రాయాల మీద పత్రికలు ఎప్పుడూ కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. ఎవరి మనోభావాలకూ దెబ్బ తగలకుండా. ఈ ఏడాది జూలై 30న రాజ్యసభలో తలాక్ బిల్లు అమోదం పొందగానే ఆ మర్నాడు అన్ని పేపర్లూ ఆ వార్తను వేశాయి కానీ, ఎప్పటిలా ‘ప్రత్యేకాంశం’ అయిన తలాక్‌పై ప్రత్యేక అభిప్రాయాలకు మాత్రం దాదాపుగా చోటివ్వలేదు. ప్రత్యేక అభిప్రాయాలంటే తలాక్ రద్దుపై ప్రభుత్వాన్ని వ్యతిరేకించని అభిప్రాయాలు. తర్వాత మెల్లిగా తలాక్ రద్దుపై ప్రభుత్వాన్ని సమర్థించని అభిప్రాయాలు ఒకటీ అరా కనిపించడం మొదలైంది. బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత చాలాకాలం పాటు ఇలాంటి ప్రత్యేకాంశాలపై బలమైన మీడియా హౌస్‌లు కూడా ‘తటస్థతే సుస్థిరత’ అనే మోడ్‌లోకి వెళ్లిపోయాయి. వ్యూ, కౌంటర్ వ్యూ రెండూ ఉండేవి కాదు. ‘వాళ్ల’ మంచొద్దు. ‘వాళ్ల’ చెడొద్దు. ఇదీ ధోరణి! అసలు ఏది మంచి? ఏది చెడు? మంచి రాయబోయి చెడు రాసేస్తే? మంచి అనుకుని రాసింది చెడు అయిపోతే? అందుకే జూనియర్ జర్నలిస్టుల్ని ఈ ప్రత్యేకాంశాల దగ్గరకి రానిచ్చేవాళ్లు కాదు. సీనియర్ జర్నలిస్టులు ఎటూ ఆ దరిదాపులకు వెళ్లరు. ఇప్పుడా పరిస్థితి కొంచెం మారినట్లుంది. తలాక్ రద్దు మీద మీడియాలో ఈ రెండు వారాల్లోనూ ప్రధానంగా రెండు ప్రశ్నలు వచ్చాయి. తలాక్ చెబితే కౌన్సెలింగ్ ఇచ్చి పంపేలా బిల్లు ఉండాలి కానీ, ఏదో నేరం చేసినట్లు భర్తను జైల్లో పెట్టే బిల్లేమిటన్నది ఆ రెండిట్లో ఒక ప్రశ్న. ‘తలాక్‌ను రద్దు చేశారు సరే, హిందువుల్లోని భర్తల్ని çసంస్కరించేందుకు బిల్లు తేరేం?’ అనేది రెండో ప్రశ్న. రెండు ప్రశ్నలూ మంచివే. రెండోది ఇంకా మంచి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వేసే విధానమే మరీ అంత మంచిది కాకుండా ఉంది! ‘తలాక్’ సరే.. ‘మన’ ఇంటి గుట్టో? అని అని ప్రశ్నించడంలో ఏం మంచి ఉంది? ‘వాళ్ల’ సంగతి ఎందుకు? అని ఆనాడు అన్నవాళ్లు, ‘మన’ సంగతేంటి? అని నేడు అంటున్నారు. రెండిటిలోనూ కనిపించే భావం ఒక్కటే. ఈ దేశం ఒకే కుటుంబం కాదని! తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు వేసి ఏళ్లుగా పోరాడుతున్న జకియా సోమన్, అతియా సాబ్రి, గుల్షన్ పర్వీన్, అఫ్రీన్ రెహ్మాన్, ఇష్రత్ జహాన్, సైరా భానులను ఈ ‘ఇంటి’ ఆడపడుచులు కాదు అనుకుని ఉంటే కోర్టులు పిటిషన్లను స్వీకరించేవా? ప్రభుత్వం ఇప్పుడు తలాక్‌పై ఒక నిర్ణయం తీసుకుని ఉండేదా? మనదంతా ఒకే కుటుంబం అని వ్యవస్థలే అనుకుంటున్నప్పుడు కుటుంబంలోని ఏ కొందరో, ఏ కారణం చేతనో కుటుంబంలోని కొందరికి అడగకుండానే మద్దతుగా నిలిచినంత మాత్రాన అదంతా ఒకే కుటుంబం కాకుండా పోతుందా? తలాక్ చట్టం మాత్రమే కాదు, అలాంటి ఏ చట్టం ఉద్దేశమైనా కుటుంబాలకు మేలు చేయడమే అయి ఉంటుంది. చట్టం ఫలిస్తుందా, నిష్ఫలం అవుతుందా అన్నది కాలక్రమంలో తేలే విషయం. ఫలించడం అంటే చట్టానికి ఫిర్యాదుల గౌరవం దక్కటం. నిష్ఫలం అంటే ఫిర్యాదులే వెళ్లని గౌరవం దక్కటం. రెండేళ్ల క్రితం మీరట్‌లో అమ్రీన్ బేగం (పై ఫొటో) అనే మహిళ తన భర్త పెట్టే గృహహింసను భరించలేక పోలీస్ స్టేషన్ బయటే పెద్దగా అరుస్తూ అతడికి తలాక్ చెప్పారు! ‘భర్తకేనా! భార్యకు ఉండకూడదా తలాక్ చెప్పే హక్కు’ అని ప్రశ్నించారు. ఇది ఒక బాధిత మహిళ చట్టాలతో నిమిత్తం లేకుండా తనకు తానుగా దక్కించుకున్న గౌరవం. -
బీజేపీలో కనిపిస్తున్న కొత్త జోష్
-
నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!
పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. సమాచార హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకి ఇక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలవు తున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచకూడదు. బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు, పాలకపక్ష పెద్దలిచ్చే సంకే తాల్ని బట్టే చట్టాలు అమలవుతాయి, అధికార యంత్రాంగం పనిచేస్తుంది. పౌరులాశించిన పరిపాలనా ఫలాలు లభిస్తాయి. సంకేతాలే మాత్రం భిన్నంగా ఉన్నా, ఫలితం సున్నా, ఇక అంతే సంగతులు! యుగాలుగా ఇది నడుస్తున్న చరిత్ర అవటం వల్లే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అమలు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎన్నో సందేహాలు! పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా ఈ చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోందన్న విమర్శ. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకిక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు ఒకటిన్నర దశాబ్దాలవుతున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రస్తుత చట్ట సవరణ ఏ కోణంలో చూసినా, సమాచార వెల్లువను పటిష్ట పరచకపోగా ఈ ప్రక్రియను పలుచన చేయడానికే ఆస్కారముంది. చట్టం అమల్లోకి వచ్చిన కొత్తలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ అమలుకు అనువైన భూమికను సిద్ధం చేశారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాకు చెప్పి అధికారులకు, పౌర సంఘాల కార్యకర్తలకు, జర్నలిస్టులకు ప్రత్యేకంగా చట్టంపై శిక్షణ ఇప్పించారు. పౌరుల్లో అవగా హనకు ప్రత్యేక నిధులతో ప్రచార సామాగ్రి రూపొందించి, సదస్సులు పెట్టించారు. జాప్యం లేకుండా కమిషన్ ఏర్పరచి అమలు ప్రారంభిం చారు. ఒక సందర్భంలో ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టుపై విపక్ష సభ్యులు రభస చేస్తే, ‘... రాజకీయం చేయకండి, నిజంగా సమాచారం తెలుసు కోవడమే మీ ఉద్దేశమైతే, పది రూపాయలు వెచ్చించి ఆర్టీఐ దరఖాస్తు చేసినా మీకు సమాచారం లభిస్తుంద’ని శాసనసభావేదిక నుంచి భరోసా ఇచ్చారు. మొత్తం అధికార వ్యవస్థకే ఆ మాట ఒక బలమైన సంకేతమైంది. అడ్డుకున్నా ఆగని తొలి సవరణ సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఇటీవలే ఆమో దించింది. ఉభయసభల్లోనూ ఈ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి ముద్రపడి, గెజెట్‌లో ప్రచురితమవడంతో చట్ట సవరణ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రధానంగా ఈ చట్ట సవరణ... కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే సమాచార కమిషనర్ల హోదా, పదవీకాలం, వేతనాల మార్పులకు సంబంధించింది. అవన్నీ అధికంగా ఉన్నాయని, ప్రస్తుత సవరణ ద్వారా వాటిని హేతుబద్ధం చేసేందుకేనని బిల్లు ముసా యిదా లక్ష్యాలు–ఉద్దేశాల్లో కేంద్రం వెల్లడించింది. కానీ, అది సహేతు కంగా లేదు. ‘తాడిచెట్టెందుకెక్కావు?’ అంటే ‘దూడ గడ్డికోసం’అని తడు ముకుంటూ చెప్పే జవాబంత అసంబద్ధంగా ఉంది. 2005లో ఏర్పడ్డ నాటినుంచి ఆర్టీఐ చట్టానికి ఇదే తొలి సవరణ. ఇంతకు ముందు మూడు, నాలుగు మార్లు వేర్వేరు విషయాల్లో సవరణకు జరిగిన యత్నాలు ఫలించలేదు. పాలనలో కీలకమైన ‘నోట్‌ఫైల్స్’ను ఈ చట్టపరిధి నుంచి తప్పించే విఫల యత్నమూ జరిగింది. చట్టాన్ని మార్చ డానికి ఆయా సందర్భాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు చేసిన ప్రయ త్నాలను పౌరసమాజం ఎప్పటికప్పుడు ప్రతిఘటించింది. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నిరాహార దీక్షకు దిగి ఇటువంటి ఓ ప్రతి పాదనను లోగడ అడ్డుకున్నారు. ప్రతిసారీ చట్ట సవరణకు చేసిన ప్రతిపాదనలు ఏదో రూపంలో చట్టాన్ని బలహీనపరచి, పారదర్శకతకు భంగం కలిగిస్తాయని పౌర సమాజం కలవరపడింది. సవరణ వద్దని వివిధ స్థాయిల్లో ఉద్యమించింది. అందువల్ల, కేంద్రం చేసిన ఏ సవరణ ప్రయత్నమూ ఇంతకాలం ఫలించలేదు. ఒకసారైతే, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా జనాగ్రహానికి జడిసి, సవరణ బిల్లు ముసాయిదాను పార్లమెంటుకు తెచ్చే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం. ఈ సారి కూడా చట్టాన్ని సవరించకూడదని, తద్వారా సమాచార కమిషన్లు బలహీనపడి, చట్టం అమలు నీరుగారిపోతుందని ప్రజాసంఘాలు వ్యతిరేకించినా చట్ట సవరణ ప్రక్రియ ఆగలేదు. పార్లమెంటులో విపక్షం వ్యతిరేకించినా ప్రభుత్వ పట్టుదల వల్ల ఉభయసభల ఆమోదంతో ఆర్టీఐ చట్ట సవరణ జరిగిపోయింది. సమాన హోదాలతో సమస్యేమిటి? చట్ట ప్రకారం అఖిల భారతస్థాయి కేంద్ర సమాచార కమిషన్‌లోని ముఖ్య సమాచార కమిషనర్ హోదాను కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ హోదాతో సమానంగా నిర్ణయించి, అమలు చేస్తున్నారు. ఆయా ప్రభు త్వాలు రూపొందించే రూల్స్‌లో కాకుండా ఈ అంశాల్ని మౌలికమైన చట్టంలోనే పొందుపరిచారు. ఇది 2005 నుంచి ఇలాగే ఉంది. మిగతా కేంద్ర సమాచార కమిషనర్ల హోదాను ఇతర ఎన్నికల కమిషనర్లతో సమంగా నిర్ణయించి, వేతనాలు, భత్యాలూ అదే లెక్కన చెల్లిస్తున్నారు. ఇంకొక లెక్క ప్రకారం... కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. దాని వల్ల, ఆర్టీఐ కేంద్ర సమా చార ముఖ్య కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాతో సమానమౌతోందని, ఇది సముచితం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ కాగా ఆర్టీఐ కమిషన్ చట్టబద్ధ సంస్థ మాత్రమే అని కేంద్రం అంటోంది. అదే విధంగా రాష్ట్రాల్లోని ఆర్టీఐ ముఖ్య సమాచార కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన మైన, రాష్ట్రాల్లోని ఆర్టీఐ కమిషనర్లకు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో సమానమైన హోదాను, జీత భత్యాలను ఇప్పటి వరకున్న చట్టం కల్పించింది. పైగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లు గాని, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు గానీ, ఏది ముంద యితే అప్పటివరకు కేంద్ర–రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్లు పదవిలో ఉంటారు. చట్టం వచ్చిన కొత్తలో ఆదరాబాదరాగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా రని, ఇది సరికాదంటూ కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని ప్రస్తుత సవరణ తెచ్చింది. ఈ సవరణతో ఇప్పుడు... ఆయా కమిషనర్ల హోదాలు, జీత భత్యాలు, పదవీ కాలం వంటివి నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వా నికి దఖలవుతోంది. ఇకపై రాష్ట్రాల సమాచార కమిషనర్లకు సంబంధిం చిన హోదా, పదవీకాలం, జీత భత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణ యిస్తుంది. కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాలు, వాటి నడక, నిర్వహణ... అంతా కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వచ్చి నట్టే! ఇక్కడే వివాదం తలెత్తుతోంది. ప్రస్తుత సవరణల వల్ల చట్టం అమ లుకు, పారదర్శకతకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, పైగా నష్టం జరుగుతుందనేది చట్ట సవరణ వ్యతిరేకిస్తున్న వారి వాదన. అటు వంటిదేమీ ఉండదని, అనవసర హోదాలు, అస్పష్టతలు తొలగి మరింత పకడ్బందిగా చట్టం అమలుకు ఈ సవరణ పనికొస్తుందనే డొల్ల వాద నను కేంద్ర వర్గాలు వినిపించాయి. రాజ్యాంగ సంస్థ హోదాలను చట్ట బద్ద సంస్థల్లోని వారికి కల్పించకూడదనే నిషిద్ధం కూడా ఎక్కడా లేదు. ఇప్పటికే కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) వంటి రాజ్యాంగ సంస్థలే కాకుండా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ), జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), లోక్‌పాల్ వంటి చట్టబద్ధ సంస్థల ఛైర్మన్లు, సభ్యులకు కూడా రాజ్యాంగ సంస్థల్లోని వారితో సమాన హోదాలు న్నాయి. ఇలా చట్టబద్ద పదవులకు కూడా రాజ్యాంగ హోదాలతో సమాన స్థాయి కల్పించి, ఏ ఇబ్బందీ లేకుండా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఉదా హరణలు కోకొల్లలు. మరి వాటన్నిటినీ ఇప్పుడు మారుస్తారా? ఇక్కడ మాత్రమే ఎందుకీ మార్పు? ఇవి సహజమైన ప్రశ్నలు. నిఘా, నిర్వహణ ఇక నిర్వీర్యమే! దేశంలో ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అంటే, ఈ పద్నాలుగేళ్ల కాలంలో పాలనా వ్యవస్థల్లో పారదర్శకత పెరిగింది. ఆశించిన స్థాయి ఫలితాలు అందకున్నా... ప్రభుత్వంలోని చాలా విభాగాల నుంచి పౌరులు సమాచారం పొందగలుగుతున్నారు. ఇదివరలో సమాచారం లభించడం దుర్లభమైన విభాగాల్లో కూడా నేడు పౌరులు ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టి కోరిన సమాచారం తెచ్చుకోగలుగుతున్నారు. ఇందుకు, చట్టంలో పొందుపరచిన ప్రజాసానుకూల అంశాలే కారణం. చట్టం అమలు నిఘా–నియంత్రణ సంస్థలుగా కమిషన్లు స్వేచ్చగా–స్వతం త్రంగా వ్యవహరించే వెసలుబాటు మరో బలమైన కారణం. ప్రభుత్వాల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కమిషనర్ల హోదాలు, పదవీ కాలం, జీతభత్యాలు ఇన్నాళ్లు చట్టం నిర్దేశించినట్టు హూందాగా, నిలకడగా ఉంటూ వచ్చాయి! దాని వల్ల కమిషనర్లు... ప్రభుత్వాలకు, వారి ప్రలో భాలు–ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా పనిచేయగలిగే వారు. ముఖ్యంగా ఆర్టీఐ కమిషనర్లకు ఎన్నికల కమి షనర్ల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి హోదాలుండటం వల్ల ఉన్నత స్థాయి ఐఏఎస్. ఐపీఎస్ అధికారులు కూడా కమిషన్ల ఆదేశాలు పాటించే వారు. ఇక ఇప్పుడు అన్నీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి రావడం, హోదాలు తగ్గడం వల్ల ఆర్టీఐ కమిషన్ల పనితీరు చప్పబడి పోతుంది. ప్రస్తుత సవరణ పరోక్షంగా కమిషన్ల స్వేచ్ఛను, స్వతంత్రతను దెబ్బతీయడమే అన్న విమర్శ తలెత్తుతోంది. దీనికి పాలక బీజేపీ నుంచి సరైన సమాధానం లేదు. నిజానికి 2005లో ఈ చట్టం తెచ్చినపుడు, కమి షనర్లకు తక్కువ హోదాలతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనల్ని విపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కమిషనర్లకు పెద్ద హోదాలతో, బలమైన కమిషన్లు ఉండాలని వాదించింది. నాటి పార్లమెంట్ స్థాయి సంఘంలో ఉన్న అయిదారుగురు బీజేపీ ఎంపీల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వాదించింది. ఏ వాదనలెలా ఉన్నా, అంతిమ పరిణామాలను కాలమే నిర్ణయిస్తుంది. పౌరుల తెలుసుకునే హక్కు, పాలనలో పారదర్శకత విషయంలో ఆర్టీఐ ఒక విప్లవాత్మక చట్టం. మనకున్న మంచి చట్టాల్లో ఒకటైన ఆర్టీఐ పటిష్టంగా అమలుజరగాలనే ఎవరైనా కోరుకుంటారు. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచ కూడదు. తాజా సవరణ, తద్వారా రాగల పరిణామాలన్నీ ఆర్టీఐ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడాలనే ఎవరమైనా కోరుకుంటాం, కోరుకోవాలి కూడా! వ్యాసకర్త :దిలీప్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు పూర్వ కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది
సురాపానం నిషేధం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. తొలుత మద్య నియంత్రణ చట్టానికి పదును పెడుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, పశ్చిమ గోదావరి : మందు బాబుల ‘నిషా’ దింపేందుకు సీఎం వైఎస్ జగన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలోనూ మద్య నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించింది. కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మద్యం షాపుల సమయాన్ని సైతం కుదించటంతోపాటు నిబంధనలు పాటించని మద్యం దుకాణదారులపై క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టాన్ని చేసే పనిలో నిమగ్నమైంది. ఇక జిల్లాలో ప్రభుత్వమే స్వయంగా 11 మద్యం దుకాణాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా 11 షాపులను ఏర్పాటు చేసి, ఫలితాలను విశ్లేషించి, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదాయం కాదు.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రధాన ఆదాయ వనరుగా మద్యానికి గత ప్రభుత్వాలు పెద్దపీట వేస్తే .. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు మాత్రం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు దూసుకుపోతోంది. వందల కోట్ల ఆదాయాన్ని కాదని పాదయాత్రలో ఆనాడు ప్రతిపక్ష నేతగా మహిళల బాధలు విన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే హామీని నిలబెట్టుకునేందుకు చకాచకా అడుగులు వేస్తున్నారు. 2018లో మద్యం ద్వారా ఆదాయం రూ.1306కోట్లు ఉంటే, 2017 సంవత్సరంలో రూ.1154.82కోట్లు మేర మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇలా రూ.వందలకోట్లు మేర ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని పూర్తిగా నిషేధించే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారు. దశలవారీగా మద్యం షాపులను నియంత్రిస్తూ, చివరి ఏడాది నాటికి మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళుతున్నారు. కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది కొత్తగా ఆమోదించిన చట్టం మేరకు విక్రయాల నియంత్రణే ప్రధానాంశంగా ఉంది. జిల్లాలో మద్యం షాపులు సమయపాలన పాటించకపోవటం, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన వంటి అనేక అంశాలను కొత్త చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే మద్యం షాపులు ఉండడంతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేయటం సామాజిక భద్రతకు విఘాతంగా మారింది. గతంలో నిబంధనలు మీరితే నిర్వాహకులకు జరిమానాలు విధించటంతోపాటు తాత్కాలికంగా లైసెన్సులు రద్దు చేసేవారు. కొత్త చట్టంలో లైసెన్సులు తీసుకున్న మద్యం నిర్వాహకులు నిబంధనలు మీరితే క్రిమినల్ కేసులు సైతం పెట్టనున్నారు. ప్రభుత్వం దుకాణాల్లో మద్యం విక్రయించటం ద్వారా సమయాన్ని అతితక్కువకు కుదించేలా నిర్ణయిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం 12గంటల సమయంలో 4గంటలు కోత విధిస్తూ, 8గంటలకు తగ్గించేలా చర్యలు చేపడతారని అంటున్నారు. మద్యం దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పేలా లేవు. జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇప్పటి వరకూ జిల్లాలో 476 మద్యం దుకాణాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల మూడు నెలలు రెన్యువల్ చేయగా వీటిలో 123 మద్యం దుకాణాల వరకూ రెన్యువల్ చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మద్యం నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని గుర్తించిన మద్యం వ్యాపారులు ఇతర మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇక నూతన పాలసీలో ఎటువంటి విధివిధానాలు ఖరారు చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వషాపులపై నివేదిక జిల్లాలో ప్రభుత్వమే 11మద్యం దుకాణాలను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏలూరు, భీమవరం సర్కిల్స్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎక్కడ పెట్టాలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఏలూరు పరిధిలో 5షాపులు, భీమవరం పరిధిలో 6షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఏలూరు సర్కిల్లో బాపిరాజుగూడెం, తిమ్మాపురం, బీ.కొండేపాడు, మార్కొండపాడు, శ్రీనివాసపురం, భీమవరం సర్కిల్లో కొణితివాడ, తణుకు అర్బన్, చించినాడ, కొతలపర్రు, జిన్నూరు, ఎల్‌ఎన్‌పురాలలో ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు అధికారులు యత్నిస్తున్నారు. -
ఈబీసీ కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
-
మరాఠా కోటా బిల్లుకు మహా అసెంబ్లీ ఆమోదం
సాక్షి, ముంబై : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించే మరాఠా కోటా బిల్లును గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరాఠాలకు రిజర్వేషన్ బిల్లును ఆమోదం కోసం ఎగువ సభకు పంపారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందిన అనంతరం బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి బీసీ కమిషన్ సిఫార్సులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు పేజీల నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వం సభ ముందుంచింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠాలు కొద్దినెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ధంగర్ వర్గీయులకు రిజర్వేషన్ల కోటాపై సబ్ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
ప్రవాసులకు ప్రాగ్జీ ఓటింగ్!
సాక్షి, నెట్వర్క్: సర్వీస్ ఓటర్ల (రక్షణ సిబ్బంది, భద్రతా దళాల) తరహాలోనే ప్రవాస భారతీయులకు ‘ప్రాగ్జీ ఓటింగ్’ (పరోక్ష ఓటింగ్.. అంటే ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లు–2017ను లోక్‌సభ గత వారం ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట సవరణ అమలులోకి వస్తుంది. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్ 20–ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్ ఎల క్టర్స్’గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఎంతో మంది ప్రవాస భారతీయులకు మన దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన మన దేశ పౌరులకు ఈ ‘ప్రాగ్జీ’ ఓటింగ్ విధానం ప్రయోజనం కల్పిస్తుంది. గల్ఫ్ మినహా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇతర విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఒక్క గల్ఫ్ దేశాల్లో మాత్రం విదేశీయులకు పౌరసత్వాన్ని ఆ దేశాలు ఇచ్చే అవకాశం లేదు. గల్ఫ్ ఓటర్లు కీలకం ’ప్రాగ్జీ ఓటింగ్’ సౌకర్యం ద్వారా సుమారు కోటీ 50 లక్షల మంది ఎన్నారైలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నారైలను పట్టించుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు 25 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలరు. ఒక్కో గల్ఫ్ ఎన్నారైకి కుటుంబ సభ్యులందరు కలిపి కనీసం ఐదుగురు ఉంటారు. అంటే గల్ఫ్ ప్రవాసులు వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 60 లక్షల మందితో ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ రూపు దిద్దుకుంటుంది. వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రవాస భారతీయులకు హక్కులు కల్పించేందుకు, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు తమ మెనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రవాస భారతీయుల పేరిట ఉన్న భూములకు పెట్టుబడి సహాయం అందించలేదు. కానీ పరోక్ష పద్ధతిలో ఎన్నారైలకు ఓటు హక్కు లభించడం వల్ల ప్రభుత్వం తన ఆలోచన తీరును మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఎన్నారైలు ఆన్లైన్లో ఓటు నమోదు ఇలా చేసుకోవచ్చు.. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ లింకు http:// www. nvsp. in/ Forms/ Forms/ form6 a? lang= en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్‌పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు, బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ–మెయిల్, ఇండియా మొబైల్ నంబర్‌ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా (పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/పట్టణం, జిల్లా, పిన్‌కోడ్ తెలియజేయాలి. పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు, పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా నంబర్, వీసా కేటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ /టూరిస్ట్ /వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కోసమా, విద్య కోసమా, లేదా ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి. దరఖాస్తుదారు ఈ విధంగా డిక్లరేషన్ (వాంగ్మూలం) ఇవ్వాలి ‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశం పౌరసత్వాన్ని కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఒకవేళ నేను భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి సాధారణ నివాసిగా మారినట్లయితే మీకు వెంటనే తెలియజేయగలను. ఓటరు నమోదు కోసం ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు. ఇది వరకు నాకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే దానిని మీకు వాపస్ చేస్తాను. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 సెక్షన్ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని’. బీఎల్ఓ విచారణ దరఖాస్తు చేసిన తర్వాత బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ) భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఎలాంటి అభ్యంతరాలూ లేకపోతే ఏడు రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించారు ప్రవాస భారతీయులను ఓటర్లుగా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది. మేము మా కోసమే కాదు దేశం కోసం కష్టపడుతున్నాం. మా వల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి వచ్చి చేరుతుంది. ప్రవాస భారతీయులు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పార్లమెంట్ ఆమోదించడం ఎంతో సంతోషం కలిగించింది. – గద్దె శ్రీనివాస్, ఖతార్ (డిచ్పల్లి వాసి) ఓటు హక్కు కల్పించడం సంతోషం విదేశాల్లో ఉన్న ప్రవాసులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆలోచన మంచిది. అయితే ఓటును ఎలా వేయాలన్నదానిపై కూడా స్పష్టత అవసరం. టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ ద్వారానైనా, ఇతర పద్ధతుల ద్వారానైనా ఓటును ప్రతీ ఒక్కరూ వినియోగించుకునే అవకాశం కల్పించాలి. –సిరికొండ నర్సింలు, మస్కట్ (గన్పూర్– ఎం. మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా) 16 ఏళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకో లేదు నేను 16 ఏళ్ల నుంచి గల్ఫ్‌కు వెళుతున్నాను అప్పటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాను. రెండేళ్లకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతున్నా మేము వచ్చిన సమయంలో ఎన్నికలు లేక పోవడంతో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. పరోక్ష పద్ధతిలోనైనా మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం దక్కనుంది. – శ్రీనివాస్ గుప్తా, బహ్రెయిన్ (నిజామాబాద్ జిల్లా) హక్కులు సాధించుకోవడానికి మంచి అవకాశం ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ వల్ల తమ హక్కులను సాధించుకోవడానికి అవకాశం లభించింది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాకు ఓటు హక్కు లభించడంతో మా హక్కులను రాజకీయ పార్టీలు గుర్తించే అవకాశం ఉంది. ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ ఆహ్వానించదగిన పరిణామం. – మహ్మద్ యూసుఫ్ అలీ, అధ్యక్షుడు తెలుగు అసోషియేషన్ ఆఫ్ జిద్దా, సౌదీ అరేబియా (కరీంనగర్ జిల్లా వాసి) ఓటింగ్‌లో పాల్గొనాలనే కల నిజమవుతున్నది స్వదేశంలో లేకున్నా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అరుదైన అవకాశం రావడం సంతృప్తినిస్తుంది. ‘ప్రాగ్జీ ఓటింగ్’ అనే ప్రక్రియ ఒక వైవిధ్యమైన వర్ణమాల లాంటిది. మనం భారతీయులమైనందుకు గర్వించాలి. –అమ్రీనా ఖైసర్, జిద్దా, సౌదీ అరేబియా (హైదరాబాద్) రాజకీయాలను ప్రభావితం చేస్తారు పరాయి దేశంలో ఉన్న వారికి మన దేశంలో ఓటు వేసే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో ఉంటూ మన దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రవాసీయులకు రాజకీయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభిస్తుంది. ప్రవాసీయులు అభ్యర్థుల కంటే.. పార్టీ మేనిఫెస్టోకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. – జువ్వాడి శ్రీనివాస్‌రావు, ఉమల్కోయిల్ (నర్సింగాపూర్, సిరిసిల్ల జిల్లా) ఓటర్లలో చైతన్యం వస్తే మేలు.. తెలంగాణ జిల్లాల్లో చాలా మంది ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరి కాదు.. ఓటర్లలో చైతన్యం వస్తేనే సమాజానికి మేలు జరుగుతుంది. అబుదాబీలో ఉంటున్న ప్రవాసీ శంషీర్ సుప్రీంకోర్టులో చేసిన పోరాట ఫలితంగానే ప్రవాసీయులకు ఓటు హక్కు లభించిందని భావిస్తున్నాను. ఓటు హక్కు కల్పించడం మంచిదే. సంక్షేమ పథకాలు దూరమవుతాయనే భయంతో ఓటర్లుగా నమోదు కావడం లేదు. దీనిపై చైతన్య పరుస్తాం. – సలాఉద్దీన్, షార్జా (జగిత్యాల) ఓటింగ్‌కు అవకాశం వల్ల గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం ప్రవాస భారతీయులకు ఓటింగ్‌కు అవకాశం కల్పించడం వల్ల గల్ఫ్ కార్మికులకే ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. గల్ఫ్ మినహా ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికులకు మాత్రం గల్ఫ్ పౌరసత్వం ఎప్పటికీ లభించదు. బిల్లు ఆమోదం వల్ల గల్ఫ్ కార్మికులకు లాభమే. – ముత్యాల వినయ్‌కుమార్, కువైట్ (హైదరాబాద్ వాసి) ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం.. గల్ఫ్ దేశాల్లో ఉండే వారికి ఇది మంచి అవకాశం. ఎన్నో ఏళ్లుగా వివిధ దేశాల్లో ఉన్న వారు ఓటు హక్కుకు దూరమయ్యారు. ఇప్పుడు తొలిసారిగా అవకాశం రావడం స్వాగతించాల్సిన విషయం. దీనిపై వలస జీవులను చైతన్య పరిచి ఎక్కువ మంది ఓటు వేసే విధంగా చూస్తాం. – వంశీగౌడ్, గల్ఫ్ కార్మికుల ఆహ్వాన వేదిక ఉపాధ్యక్షుడు, దుబాయి (ఆర్మూర్) మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం... భారతీయులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలుసు. కానీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. ప్రవాస భారతీయులు ఎవరైనా ఓటు హక్కు కోసం వస్తే ఫాం 6(ఏ)ని పూరించి హక్కును కల్పిస్తున్నాం. మార్గదర్శకాలు రాగానే వాటిని అమలు చేస్తాం. – వినోద్‌కుమార్, ఆర్డీఓ నిజామాబాద్ -
‘నాలా’ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూ వినియోగ మార్పిడి (నాలా) చట్ట సవరణ బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. శాసనసభ, శాసనమండలి గత నెలలో ఆమోదించి పంపిన నాలా బిల్లుపై గవర్నర్ గురువారం సంతకం చేశారని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. నాలా రుసుము తగ్గింపు, నిబంధనల సవరణపై ఆర్డినెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా పునఃపరిశీలించాలంటూ ఫైల్ వెనక్కి పంపటం తెలిసిందే. అయితే దీన్ని పట్టించుకోకుండా, సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్డినెన్స్ ఫైల్‌ను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అవే అంశాలతో చట్టసభల్లో బిల్లు ఆమోదించింది. రాజకీయ విమర్శలవల్లే గవర్నర్ లేఖ: తెలంగాణలో నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ చట్టసభలు ఆమోదించిన నాలా బిల్లును మాత్రం పక్కనపెట్టటం వివక్షకు నిదర్శనమంటూ బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విష్ణుకుమార్‌రాజుతో సీఎం చంద్రబాబే ఈ విమర్శలు చేయించినట్లు రాజ్‌భవన్‌కు వేగులు చేరవేశారు. తనపై రాజకీయ విమర్శలపై కలత చెందిన నరసింహన్ కొందరు ఉన్నతాధికారులతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీఎంకు లేఖ రాసిన గవర్నర్: ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాలా ఆర్డినెన్స్, బిల్లు విషయాల్లో జరిగిన పరిణామాలను విశదీకరిస్తూ గవర్నర్ నేరుగా సీఎం చంద్రబాబుకే లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిల్లుపై గవర్నర్ గురువారం సంతకం చేశారు.గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో త్వరలో నాలా సవరణ ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో విశాఖపట్నం, విజయవాడలో నాలా రుసుము 5 నుంచి 2 శాతానికి, మిగిలిన చోట్ల 9 నుంచి 3 శాతానికి తగ్గనుంది. ఆరోపణల్లో నిజం లేదు: రాజ్‌భవన్ వర్గాలు: తెలంగాణ ప్రభుత్వం పంపిన నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ చట్టసభలు ఆమోదించిన బిల్లును పక్కన పెట్టారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ‘అసలు తెలంగాణ సర్కారు నుంచి నాలా బిల్లు ఇప్పటివరకూ రాజ్‌భవన్‌కే రాలేదని తెలిపాయి. -
ఐదు బిల్లులకు ఆమోదం
శాసన మండలి నిరవధిక వాయిదా: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ చెల్లింపులు, వేతనాలు, పింఛన్ల సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ప్లాన్ బిల్లును మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఇవికాక మరో రెండు ద్రవ్యవినిమయ బిల్లులను కూడా ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టింది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని కొద్దిగా మెరుగు పరచి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక బిల్లును రూపొందించామన్నారు. పాత చట్టానికి 109 సవరణలు చేసినందున సవరణ బిల్లుగా కాకుండా కొత్త చట్టం రూపంలో సభ ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఏదేని కారణాలతో ఆయా వర్గాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే తదుపరి ఏడాది బడ్జెట్లో అంత మొత్తాన్ని కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగు లేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మన్నారు. ఎపెక్స్ కమిటీ చైర్మన్‌గా ముఖ్య మంత్రి మూడేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించక పోవడంతో అధికారులలోనూ ఉదాసీనత ఏర్పడిం దన్నారు. కొత్త చట్టం ద్వారానైనా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. ఎస్సీఎస్టీ ఉపప్రణాళిక అమలులో లోపాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సమాజంలో వస్తున్న మార్పులకు ఆయా వర్గాలను దూరంగా ఉంచకూడదన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయిం చిన నిధులు ఖర్చు చేయని పక్షంలో వచ్చే ఏడాది బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా బ్యాక్‌లాగ్స్ (బకాయిలను)కలిపి నిధులు కేటాయించా లన్నారు. భూదాన్ సవరణ బిల్లుపై చర్చలో.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ భూదాన్, గ్రామదాన్ చట్టం ద్వారా ఆచార్య వినోభాబావే ఆశయాలకు అనుగుణంగా పేదలకు భూమి పంపిణీ చేసే నిమిత్తం చట్టంలో కొన్ని సవరణలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూదాన్ చట్టం కింద ప్రస్తుతం ఎంత భూమి మిగిలి ఉంది, అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏమి చర్యలు చేపట్టారో ప్రభుత్వం తెలపాలన్నారు. భూదాన్ బోర్డు పరిధిలో ఉన్న భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. చెల్లింపులు, వేతనాలు, పింఛన్లు సవరణ బిల్లుపై చర్చలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ.. ఈ చట్టం పరిధిలో ప్రస్తుతం 120 సంస్థలు ఉన్నాయని, వక్ఫ్‌బోర్డ్‌ను కూడా చట్ట పరిధిలోకి తెచ్చేందుకు సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఆయా బిల్లు లన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. అనంతరం ఆయన శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
పాక్‌లో హిందూ బిల్లుకు ఆమోదం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల వివాహాలకు సంబంధించిన చారిత్రక ‘హిందువుల వివాహ బిల్లు–2017’ను సెనేట్ ఆమోదించింది. సభలో జరిగిన చర్చలో హిందూ వర్గం తొలి సమగ్ర పర్సనల్ చట్టం కాబోతున్న ఈ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించారు. ఇది దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో 2015 సెప్టెంబర్ 26నే గట్టెక్కింది. దేశాధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. బిల్లులో స్త్రీ, పురుషుల వివాహ కనీస వయసును 18 ఏళ్లుగా నిర్ణయించారు. ఇది చట్టరూపం దాల్చితే మహిళ తన వివాహ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. -
‘కంబళ’ బిల్లు ఆమోదం
బెంగళూరు: సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ తెచ్చిన బిల్లును కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసే విషయంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. జల్లికట్టు కోసం ఉద్యమించిన తమిళనాడు ప్రజల బాటలో కన్నడిగులు కూడా కంబళ కోసం ఆందోళన చేయడం తెలిసిందే. కంబళలో జంతుహింస లేదని, ప్రజల కోరిక మేరకు దీన్ని అనుమతిస్తున్నామని మంత్రి మంజు చెప్పారు. ఆర్డినెన్స్ బాట పట్టకుండా ఆటకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
వింటర్ సెషన్ వాష్ ఔట్
-
GST తో మనకేంటి..?
-
సోనియాను కలిసిన వెంకయ్యనాయుడు
-
జీడీపీ వృద్ధికి జీఎస్టీ బ్రహ్మాస్త్రం
బిల్లు ఆమోదం కోసం విపక్షాలు సహకరించాలి అసోచాం ప్రెసిడెంట్ సునిల్ కనోరియా న్యూఢిల్లీ: అధిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధించడానికి వస్తు,సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలు బ్రహ్మాస్త్రం కాగలదని పరిశ్రమ వర్గాల సమాఖ్య అసోచాం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావే శాల్లో జీఎస్టీ సవరణ బిల్లు ఆమోదం పొందే దిశగా తోడ్పడాలని విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ‘మన జీడీపీకి జీఎస్టీ ఒక ‘బ్రహ్మాస్త్రం’లాంటిది. అన్ని పార్టీల నేతలు దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మరింత జాప్యం జరగకుండా తక్షణం ఆమోదించాల్సిన అవసరం ఉంది’ అని అసోచాం నూతన ప్రెసిడెంట్ సునిల్ కనోరియా పేర్కొన్నారు. తద్వారా దేశప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని, అంతర్జాతీయ సవాళ్లను రాజకీయ సంకల్పంతో భారత ఎకానమీ ధైర్యంగా ఎదుర్కొనగలదని ఇన్వెస్టర్లకు స్పష్టమైన సంకేతమిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పారు. డిమాండ్ మందగమనం, పారిస్‌లో దాడుల తర్వాత భౌగోళికరాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి, కీలకమైన కమోడిటీలు గతంలో ఎన్నడూ లేనంతగా పతనం కావడం తదితర అంశాలతో ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. జీఎస్టీని సకాలంలో అమలు చేస్తే జీడీపీ కనీసం 1.5-2 శాతం దాకా వృద్ధి చెందగలదని కనోరియా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అభ్యంతరాలేమైనా ఉంటే ప్రభుత్వం వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఉద్యోగాల కల్పన ప్రధాన సవాలు.. ప్రతి నెలా ఉద్యోగార్థుల సంఖ్య పది లక్షల పైగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వీరికి ఉద్యోగాలు కల్పించడం ప్రధాన సవాలుగా ఉంటోందని కనోరియా పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలంటే మెరుగైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు, తక్కువ వడ్డీలపై రుణాలు లభించడం తదితర అంశాలు కీలకమని తెలిపారు. మొండి బకాయిల సమస్య ఎక్కువగా ఉన్న ఉక్కు, విద్యుత్, రహదారులు తదితర రంగాల కంపెనీలు వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు బ్యాంకులకు తక్షణం మరింత మూలధనం సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా మొండి బకాయిలు పేరుకుపోయిన సంస్థలను కొత్త ప్రమోటర్లకు బదలాయించేలా కొత్త దివాలా చట్టాన్ని సత్వరం అమల్లోకి తేవాలని కనోరియా చెప్పారు. పెట్టుబడులు వస్తాయ్..: వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడుల రాక ఊపందుకుంటోందని కనోరియా చెప్పారు. పెట్టుబడుల రాకపరంగా 2016-17 ఆర్థిక సంవత్సరం కొంత వరకే బాగున్నా, ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాలు మాత్రం చాలా మెరుగ్గా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. మరోపక్క, దేశంలో అసహన పరిస్థితుల వార్తలతో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. భారత్ అత్యంత ప్రజాస్వామిక, సహనశీల దేశమని కనోరియా చెప్పారు. అసహనాన్ని కూడా సహిస్తోండటమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.. మోదీ బాగా మార్కెటింగ్ చేస్తారు.. భారత్‌ను మార్కెటింగ్ చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని కనోరియా తెలిపారు. ప్రధానితో తరచూ సమావేశం కాకపోయినా.. ఆయా సందర్భాలను బట్టి అసోచాం తన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుందని చెప్పారు. అటు వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ గవర్నరు, ఆర్థిక మంత్రిని దేవుళ్లతో పోల్చారు కనోరియా. ఆర్బీఐ గవర్నరు విష్ణువు లాంటివారని, ఆర్థిక మంత్రి లక్ష్మీ దేవిలాంటివారని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటు ద్రవ్యోల్బణం, అటు వడ్డీ రేట్లను కట్టడి చేస్తూ వీరు సమతౌల్యత పాటించాల్సి ఉంటుందని కనోరియా చెప్పారు. -
విపక్షం లేకుండానే
ప్రత్యేక కోర్టుల బిల్లు ఆమోదం ప్రతిపక్షం వాకౌట్ చేసిన వెంటనే బిల్లులకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: విపక్షం లేకుండానే కీలకమైన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు బిల్లు సహా తొమ్మిది బిల్లులను శాసనసభ గురువారం ఆమోదించింది. తూతూమంత్రంగా బిల్లులు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షం వాకౌట్ చేసిన తర్వాత.. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రత్యేకకోర్టుల ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై స్వల్పచర్చ అనంతరం ఆమోదిస్తున్నట్టు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. జూదశాలలు పెట్టండి: విష్ణుకుమార్‌రాజు(బీజేపీ) డిమాండ్ గుర్రపు పెందాలపై ఏపీ నుంచి చాలామంది ఆన్లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని, హైదరాబాద్‌లోని రేస్‌క్లబ్ బెట్టింగ్ మొత్తాన్ని వసూలు చేస్తున్న దృష్ట్యా పన్నుల్లో ఏపీ వాటా చెల్లించడానికి వీలుగా తీసుకొచ్చిన ‘ఏపీ గుర్రపు పందేలు, పందెపు పన్ను వినిమయం-1358 ఫస్లీ’ సవరణ బిల్లును ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై జరిగిన స్వల్పచర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ... ఏపీలో క్యాసినోలు(జూదశాలలు) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్యాసినోలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి యనమల చెప్పారు. బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. థార్మిక, హిందూ సంస్థల, ఎండోమెంట్ సవరణ బిల్లు, నీటి సంఘాల సవరణ బిల్లు, శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను రెండోసవరణ బిల్లు,వ్యవసాయ మార్కెట్ చట్టం సవరణ బిల్లు, కార్మిక చట్టాల సవరణ బిల్లులను సభ ఆమోదించింది. వాకౌట్‌పై చేసిన విమర్శలే.. దేవాదాయ బిల్లుపై చర్చలు విపక్షం వాకౌట్ చేసిన తర్వాత దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు దేవాదాయ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. టీటీడీ పాలకమండలిలో తుడా(తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ) చైర్మన్‌కు స్థానం కల్పించాల్సిన అవసరం లేదంటూ దేవాదాయ చట్టం-1987కు సవరణ చేయడం ఈ బిల్లు లక్ష్యం. మంత్రి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. టీడీపీ సభ్యులు ప్రభాకర్‌చౌదరి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి చర్చలో పాల్గొని.. విపక్షం వాకౌట్ చేయడంపై విమర్శలు చేశారు. దేవాదాయ చట్టసవరణ గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. కానీ చర్చ తర్వాత బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదం లభించినట్లు స్పీకర్ ప్రకటించడం గమనార్హం. -
‘హిజ్రాల హక్కుల రక్షణ’కు ఓకే
డీఎంకే ఎంపీ తెచ్చిన ప్రైవేట్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం న్యూఢిల్లీ: దేశంలోని హిజ్రాల హక్కుల రక్షణ అంశానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లును రాజ్యసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘ది రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ బిల్-2014’ ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో 36 ఏళ్ల తర్వాత ఒక ప్రైవేట్ బిల్లుకు ఆమోదం లభించడం గమనార్హం. 1979లో ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సవరణ బిల్లు’ను రాజ్యసభ ఆమోదించింది. తాజా బిల్లుపై తొలుత కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడారు. హిజ్రాల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ఉత్తమ బిల్లు రూపొందిస్తుందని, ప్రైవేటు బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే శివ తాను తెచ్చిన బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టారు. మంత్రి అరుణ్‌జైట్లీ కలుగజేసుకుని.. హిజ్రాల హక్కుల రక్షణపై అందరూ సానుకూలంగానే ఉన్నందున ఏకగ్రీవంగా ఆమోదిద్దామన్నారు. ప్రభుత్వానికి మంచి అవకాశమని, బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అన్నారు. సభలోనే ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్‌తో పాటు 19 మంది కేంద్ర మంత్రులు, అధికార సభ్యులంతా మద్దతు పలికారు. తర్వాత బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం శివ సభలోని సీనియర్ నేతల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 4.5 లక్షల మంది హిజ్రాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని.. కానీ 20 నుంచి 25 లక్షల మంది వరకు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని తిరుచ్చి పేర్కొన్నారు. వారి హక్కులకు ఎలాంటి గుర్తింపు లేనందున వివక్షకు గురవుతున్నారని, ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే వారి హక్కులకు రక్షణ లభిస్తుందన్నారు. -
విపక్షం విజ్ఞప్తిని తొసిపుచ్చిన అధికార పక్షం
వరంగల్ : వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. అలాగే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు... ప్రభుత్వాన్ని కోరాయి. అయితే విపక్షాల కోరికను అధికార పక్షం ససేమిరా అని... పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లుకు కూడా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.