Berlin: గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్‌ కీలక నిర్ణయం | Germany Parliament Passes Cannabis Cultivation And Consumption Bill - Sakshi
Sakshi News home page

గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్‌ కీలక నిర్ణయం

Published Sat, Feb 24 2024 11:42 AM | Last Updated on Sat, Feb 24 2024 11:53 AM

Germany Okayed To Cannabis Cultivation And Consumption Bill - Sakshi

బెర్లిన్‌: ప్రతిపక్షపార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్‌ తాజాగా బిల్లు పాస్‌ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేయవచ్చు.

ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్‌ లాటర్బాక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్‌మార్కెట్‌లో కొని గంజాయిని సేవిస్తోంది’అని పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్‌ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. 

ఇదీ చదవండి.. కిమ్‌కు పుతిన్‌ గిఫ్ట్‌.. కారు కంపెనీపై అమెరికా కొరడా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement