ganja farming
-
హోంమంత్రి అనిత ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి సాగు
-
Berlin: గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్ కీలక నిర్ణయం
బెర్లిన్: ప్రతిపక్షపార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్ తాజాగా బిల్లు పాస్ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేయవచ్చు. ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్బాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్మార్కెట్లో కొని గంజాయిని సేవిస్తోంది’అని పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. ఇదీ చదవండి.. కిమ్‌కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా -
గంజాయి నియంత్రణకు విస్తృత తనిఖీలు
మహబూబ్‌నగర్ క్రైం: ‘హైదరాబాద్‌లో గంజాయితో పాటు డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది.. ఇది క్రమంగా పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా దీనికి అడ్డుకట్ట వేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాయి. వీరంతా గంజాయి నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. ఇప్పటికే వారం రోజుల నుంచి నిత్యం తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నారా అనే విషయం ఆరాతీస్తున్నారు. ఇక గంజాయి వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. తండాల్లో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు డబ్బు ఆశ జూపి పత్తి, కంది పంటలలో గుట్టుచప్పుడు కాకుండా అంతర పంటగా గంజాయి సాగు చేయిస్తున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతాలకు సమీపం, ఊరికి దూరంగా ఉన్న పొలాలను అనువైన భూములుగా ఎంచుకుంటున్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో గంజాయి సాగు కొంత తగ్గుముఖం పట్టినా.. మారుమూల గ్రామాల్లో అక్కడక్కడ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జిల్లాలో మూడు గంజాయి కేసులు నమోదు కాగా.. కిలోన్నర ఎండు గంజాయి సీజ్ చేశారు. అలాగే ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు. నిఘా పెట్టాం.. జిల్లాలో గంజాయి కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా మహబూబ్‌నగర్ పట్టణంపై ఎక్కువ నిఘా పెట్టడం జరిగింది. డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో సాగు లేకపోయినా డ్రై గంజాయి విక్రయాలపై కూడా దృష్టిసారించాం. గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – సైదులు, ఈఎస్ మహబూబ్‌నగర్ ఎండు గంజాయి దిగుమతి.. జిల్లాలో గంజాయి సాగు తగ్గినా.. ఎండు గంజాయి దిగుమతి అధికంగానే ఉంటుంది. హైదరాబాద్, ఏపీ, కర్ణాటక నుంచి రవాణా జోరుగా సాగుతోంది. గతంలో గంజాయి దందా చేసిన వారు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. అధికంగా ఎండు గంజాయి తీసుకువచ్చి ప్రత్యేకంగా గ్రాముల్లో ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు అందజేస్తుంటారు. బండమీదిపల్లిని అడ్డాగా చేసుకొని ఈ దందా భారీ స్థాయిలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని అరబ్‌గల్లీ, బీకేరెడ్డికాలనీ, కొత్త చెరువు రోడ్, మోటార్‌లైన్, వీరన్నపేట, షాషాబ్‌గుట్ట కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ట్యాంక్‌బండ్, కొత్త చెరువు రోడ్ సమీపంలో అయితే రాత్రి 10.30 గంటల తర్వాత దాదాపు 50 నుంచి 60 మంది యువత చేరుకొని గంజాయిని తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతోపాటు కొత్త బస్టాండ్ దగ్గర, మార్కెట్ రోడ్లో కూడా గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం. కేవలం 17 నుంచి 28 ఏళ్ల మధ్య వారితోపాటు ఆటోలు నడుపుతున్న కొందరు యువకులు దీనిని అధికంగా తీసుకుంటున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ దందాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. ఇందులో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, నలుగురు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరంతా 24 గంటల పాటు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, పాత గంజాయి విక్రయదారులపై నిఘా పెట్టడం చేస్తుంటారు. ఇక ఎక్సైజ్ శాఖలో డీటీఓ, ఎన్ఫోర్స్మెంట్, మహబూబ్‌నగర్ ఎస్హెచ్ఓ కలిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా టాస్క్‌ఫోర్స్ టీంలో సీఐ, ఇద్దరు ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, సర్కిల్ పరిధిలో ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి పదిమంది వరకు ఉంటారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తారు. గంజాయి అక్రమ రవాణా, సాగు చేసినా వెంటనే చర్యలు చేపడుతున్నారు. బానిసైతే ప్రమాదం.. మత్తు పదార్థాలకు మనిషి ఒక్కసారి అలవాటుపడితే వాటి నుంచి దూరం కావడం అసాధ్యం. ఆ మత్తుకు అలా బానిస కావాల్సిందే. మాములుగా డ్రగ్స్‌ను ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసే సమయంలో రోగులకు నొప్పి తగ్గడానికి అవసరమైన మోతాదులో వైద్యులు ఇస్తుంటారు. ఇలాంటి డ్రగ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతోపాటు నిత్యం తీసుకోవాలని చూస్తారు. ఇలాంటి మత్తుకు అలవాటుపడిన వారికి అందుబాటులో లేకపోతే ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ.. లేదా తనకు తాను గాయపరుచుకోవడం.. లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. -
అల్జీమర్స్ ముదిరినట్టుంది.. కుంభకోణాల కర్ణుడు చంద్రబాబే: మంత్రి రోజా
సాక్షి, అమరావతి: చంద్రబాబును చూస్తుంటే అల్జీమర్స్ వ్యాధి బాగా ముదిరినట్లుందని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బాబు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే గంజాయి విపరీతంగా సాగు చేశారని ప్రస్తావించారు. అప్పటి మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు విలయతాండం చేస్తుందని, బాబు-కరువు కవల పిల్లలనేది రాష్ట్రంలో అందరికీ తెలుసని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వ్యవసాయం దండగ అని రైతుల జీవితాలను బాబు నాశనం చేశారని విమర్శించారు. అయితే గంజాయి సాగు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు బురద జల్లడం సిగ్గుచేటన్నారు. తమ ప్రభుత్వంలో గంజాయి పంటను ఎప్పటికప్పుడు గుర్తించి ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. సెబ్‌ను ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రైతులు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలను విని రైతులు నవ్వుకుంటున్నారని.. ఆయనకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుది: మంత్రి పెద్దిరెడ్డి ► రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? ►రైతుల పంటలకు భీమా ప్రీమియం చెల్లించకుండా ఎందుకు పారిపోయారో చెప్పాలి? ►డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టి ఎందుకు వెళ్లిపోయారో చెప్పాలి? ►ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వెళ్లిపోయారని మంత్రి రోజా ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అయిదు లక్షల పరిహారం ఎగ్గొట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రోజా దుయ్యబట్టారు. సింగపూర్‌కు చెందిన వారి నుంచి కోట్లు ముడుపులు తీసుకుని రైతుల భూములివ్వడం డెవలప్మెంట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు అని, 50 వేల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. హాలిడేకు వచ్చినట్లు ఏపీకి వచ్చి సీఎం జగన్‌కు విమర్శిస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఏపీ నుంచి చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
స్వచ్ఛందంగా గంజాయి చెట్లను నరికివేస్తున్న గిరిజనులు
-
జపాన్ ఎగువసభలో గంజాయి మొక్కలు!
టోక్యో: జపాన్‌లోని ఎగువసభ భవనం ఆవరణలో గంజాయి మొక్కలు కనిపించటంతో కలకలం చెలరేగింది. గురువారం ఓ సందర్శకుడు నాలుగు గంజాయి మొక్కలను గమనించి, అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎగువసభ భవనం నిర్వహణాధికారి తెలిపారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న జపాన్ గంజాయి వాడారన్న కారణంతో గతంలో పలువురు సుమో రెజ్లర్లను, కళాకారుల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసింది. -
రూ. 2 కోట్ల విలువైన గంజాయి పంట ధ్వంసం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెద్దబయలు మండలం మొయ్యలగుమ్మి పరిసర ప్రాంతాల్లో సాగు అవుతున్న దాదాపు 50 ఎకరాల్లో గంజాయి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు. ట్రాక్టర్లతో దున్ని ఈ పంటను నాశనం చేశారు. ఈ పంటను సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మండలంలో పెద్ద ఎత్తున్న గంజాయి సాగువుతుందని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నాశనం చేసిన పంట విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు.