టోక్యో: జపాన్‌లోని ఎగువసభ భవనం ఆవరణలో గంజాయి మొక్కలు కనిపించటంతో కలకలం చెలరేగింది. గురువారం ఓ సందర్శకుడు నాలుగు గంజాయి మొక్కలను గమనించి, అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎగువసభ భవనం నిర్వహణాధికారి తెలిపారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న జపాన్ గంజాయి వాడారన్న కారణంతో గతంలో పలువురు సుమో రెజ్లర్లను, కళాకారుల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment