Upper House
-
మార్చిలో రష్యా ఎన్నికలు
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎన్నికల తేదీ ఖరారైనందున, ఐదో సారీ ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచి్చన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండిపోయారు. చాలా వరకు స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్‌ను ఎదుర్కొనే వారెవరనే విషయం ఇంకా వెల్లడికాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించిన ఇద్దరిలో, మాస్కో ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు బోరిస్ నదేజ్దిన్, జర్నలిస్ట్, లాయర్ అయిన యక్తెరినా దుంట్సోవా ఉన్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధం, ప్రైవేట్ సైన్యాధిపతి యెవ్గెనీ ప్రిగోజిన్ విఫల తిరుగుబాటు వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు ఏవీ లేవని పరిశీలకులు అంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు.. రష్యా దిగువ సభ డూమాలో గానీ కనీసం మూడో వంతు ప్రాంతీయ శాసనసభలలో ప్రాతినిధ్యం లేని పార్టీ ద్వారా 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి కనీసం లక్ష సంతకాలను సేకరించాలి. ఏ పారీ్టకీ సంబంధం లేకుండా పోటీ చేసే వారికి కనీసం 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి 3 లక్షల సంతకాలు అవసరం. ఈ నిబంధనలు పుతిన్‌కు సైతం వర్తిస్తాయి. 2018లో స్వతంత్రుడిగా పోటీ చేసిన పుతిన్ తరఫున ప్రచారకర్తలు సంతకాలు సేకరించారు. 2012 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ ఆయనను నామినేట్ చేసింది. దీంతో, సంతకాల సేకరణ అవసరం లేకుండాపోయింది. -
ఎట్టకేలకు గార్సెట్టి ఎంపిక ఖరారు
వాషింగ్టన్: రెండు సంవత్సరాలకుపైగా ఎటూ తేలని భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అమెరికా పార్లమెంట్ ఎగువసభలో జరిగిన ఓటింగ్‌లో 52–42 ఓటింగ్ ఫలితంతో గార్సెట్టి నామినేషన్ గండాన్ని విజయవంతంగా గట్టెక్కారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి త్వరలో నియామకం కానున్నారు. తొలిసారిగా 2021 జూలైలో గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. లాస్ ఏంజెలిస్ నగర మాజీ మేయర్ అయిన గార్సెట్టిపై పలు లైంగిక వేధింపులు, ఆధిపత్య ధోరణి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లూ అమెరికా నూతన రాయబారి వ్యవహారం సందిగ్ధంగా ఉండటంతో చరిత్రలో తొలిసారిగా 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా భారత్‌లో అమెరికా రాయబారిగా ఎవరూ లేరు. కాగా, బైడెన్‌కు సన్నిహితుడు నూతన రాయబారిగా వస్తుండటంతో భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపడతాయని భారతీయ అమెరికన్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
జపాన్ ఎగువసభలో గంజాయి మొక్కలు!
టోక్యో: జపాన్‌లోని ఎగువసభ భవనం ఆవరణలో గంజాయి మొక్కలు కనిపించటంతో కలకలం చెలరేగింది. గురువారం ఓ సందర్శకుడు నాలుగు గంజాయి మొక్కలను గమనించి, అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎగువసభ భవనం నిర్వహణాధికారి తెలిపారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న జపాన్ గంజాయి వాడారన్న కారణంతో గతంలో పలువురు సుమో రెజ్లర్లను, కళాకారుల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసింది. -
తప్పుగా మాట్లాడితే దండించలేను : ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిలీ : ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కాపాడాలంటే ప్రతి భారతీయుడు తమ మాతృభాషతోపాటు ఏదైనా ఒక భారతీయ భాష నేర్చుకోవాలని సూచించారు. భాష వినియోగంలో ఏవైనా తప్పులు దొర్లినా కూడా మిమ్మల్ని దండించడానికి రాజు సిద్ధంగా లేడు’ అని సభ్యులనుద్దేశించి వెంకయ్య సరదాగా వ్యాఖ్యానించారు. హిందీని ప్రచారం చెయ్యడానికి బదులు.. ప్రతి ఒక్కరు ఆ భాషను తరచుగా ఉపయోగించాలని అన్నారు. రోజూవారి కార్యకలాపాలలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాకూ హిందీ కొత్తే.. ‘ మొదటిసారి ఢిల్లీకి వచ్చినపుడు నాకు హిందీ రాదు. అయినా ఇష్టంతో నేర్చుకున్న. హిందీయేతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు హిందీ భాషని నేర్చుకోండి. హిందీలోనే మాట్లాడండి. భాష నేర్చుకునేటప్పుడు పొరపాటు మాటలు చోటుచేసుకోవడం మామూలే. వాటికి భయపడితే ఏ భాషనూ నేర్చుకోలేం. గ్రామర్ తప్పులకు భయపడకుండా, స్వేచ్ఛగా మాట్లాడండి’ అని మంగళవారం జరిగిన హిందీ ప్రచార సభలో వెంకయ్య అన్నారు. మాతృభాష పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు.. ఇతర భాషలు నేర్చుకోవడం తేలికవుతుందని అన్నారు. ఉత్తర భారతం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు ఏదైనా ఒక దక్షిణ భారత భాషను నేర్చుకోవాలని సూచించారు. తమకు బాగా వచ్చిన ఏదైనా భారతీయ భాషలో రాజ్యసభలో సభ్యులు మాట్లాడేవిధంగా కొన్ని నియమాలు రూపొందిస్తున్నామని వెంకయ్య తెలిపారు. హిందీ భాషకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ‘హిందీ సలహ్కార్ సమితి’ సమావేశం మూడున్నరేళ్ల క్రితం (2014 డిసెంబరు) నిర్వహించారు. ఇకనుంచి ప్రతి ఏడాది రెండుసార్లు ఈ సమావేశం నిర్వహిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. -
పెద్దల సభలో చిరంజీవికి భంగపాటు!
మెగాస్టార్ గా తెలుగు సినీ తెరపై తనదైన శైలిలో డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రస్తుత కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి పెద్దల సభలో చేదు అనుభవం ఎదురైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం దారుణమైన ఓటమి పాలైన తర్వాత మాజీ కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్ పై తన గళాన్ని వినిపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాట్లాడేందుకు రాజ్యసభలో మూడు నిమిషాల పాటు సమయాన్ని చిరంజీవికి డిప్యూటీ చైర్మన్ కురియన్ కేటాయించారు. అయితే తనకు కేటాయించిన సమయాన్ని మించి ఏడు నిమిషాలపాటు ఏకధాటిగా తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ ను చదువుతుండగా కురియన్ ముగించాలని పదే పదే కోరారు. అయితే కురియన్ విజ్క్షప్తిని పట్టించుకోకుండా అదేపనిగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిరంజీవి చదివే తీరును కురియన్ అనుకరించడంతో సభ నవ్వుల్లో మునిగిపోయింది. అంతేకాకుండా ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతున్నారని, సభలో గౌరవ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదని కురియన్ వ్యాఖ్యానించారు. కురియన్ స్పందనతోకొద్దిసేపు చిరంజీవి తికమకపడ్డనట్టు కనిపించారు. అయితే సర్దుకుని ప్రసంగాన్ని ముగించి.. తనకు సమయాన్ని కేటాయించినందుకు సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం తెలిసిందే. అలాగే పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఒక్క సభ్యుడు కూడా విజయం సాధించకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)