సాక్షి, అమరావతి: చంద్రబాబును చూస్తుంటే అల్జీమర్స్ వ్యాధి బాగా ముదిరినట్లుందని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బాబు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే గంజాయి విపరీతంగా సాగు చేశారని ప్రస్తావించారు. అప్పటి మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు విలయతాండం చేస్తుందని, బాబు-కరువు కవల పిల్లలనేది రాష్ట్రంలో అందరికీ తెలుసని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వ్యవసాయం దండగ అని రైతుల జీవితాలను బాబు నాశనం చేశారని విమర్శించారు.
అయితే గంజాయి సాగు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురద జల్లడం సిగ్గుచేటన్నారు. తమ ప్రభుత్వంలో గంజాయి పంటను ఎప్పటికప్పుడు గుర్తించి ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. సెబ్‌ను ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రైతులు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలను విని రైతులు నవ్వుకుంటున్నారని.. ఆయనకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుది: మంత్రి పెద్దిరెడ్డి
► రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు?
►రైతుల పంటలకు భీమా ప్రీమియం చెల్లించకుండా ఎందుకు పారిపోయారో చెప్పాలి?
►డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టి ఎందుకు వెళ్లిపోయారో చెప్పాలి?
►ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వెళ్లిపోయారని మంత్రి రోజా ప్రశ్నించారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అయిదు లక్షల పరిహారం ఎగ్గొట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రోజా దుయ్యబట్టారు. సింగపూర్‌కు చెందిన వారి నుంచి కోట్లు ముడుపులు తీసుకుని రైతుల భూములివ్వడం డెవలప్‌మెంట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు అని, 50 వేల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. హాలిడేకు వచ్చినట్లు ఏపీకి వచ్చి సీఎం జగన్‌కు విమర్శిస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఏపీ నుంచి చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment