విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెద్దబయలు మండలం మొయ్యలగుమ్మి పరిసర ప్రాంతాల్లో సాగు అవుతున్న దాదాపు 50 ఎకరాల్లో గంజాయి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు. ట్రాక్టర్లతో దున్ని ఈ పంటను నాశనం చేశారు. ఈ పంటను సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
సదరు మండలంలో పెద్ద ఎత్తున్న గంజాయి సాగువుతుందని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నాశనం చేసిన పంట విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు.