
విపక్షం విజ్ఞప్తిని తొసిపుచ్చిన అధికార పక్షం
వరంగల్ : వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. అలాగే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు... ప్రభుత్వాన్ని కోరాయి. అయితే విపక్షాల కోరికను అధికార పక్షం ససేమిరా అని... పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లుకు కూడా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.