ముంబై: మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది.
దీనికి సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది.
మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని సీఎం ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. ‘సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సర్వే జరిపించాం. మరాఠా రిజర్వేషన్ బిల్లు కోసమే నేడు(మంగళవారం) అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్ట ప్రకారం మరాఠా రిజర్వేషన్ కల్పిస్తాం’ అని సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు.
మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబూ అజ్మీ.. రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ముస్లింల కూడా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment