ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల వివాహాలకు సంబంధించిన చారిత్రక ‘హిందువుల వివాహ బిల్లు–2017’ను సెనేట్ ఆమోదించింది. సభలో జరిగిన చర్చలో హిందూ వర్గం తొలి సమగ్ర పర్సనల్ చట్టం కాబోతున్న ఈ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించారు.
ఇది దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో 2015 సెప్టెంబర్ 26నే గట్టెక్కింది. దేశాధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. బిల్లులో స్త్రీ, పురుషుల వివాహ కనీస వయసును 18 ఏళ్లుగా నిర్ణయించారు. ఇది చట్టరూపం దాల్చితే మహిళ తన వివాహ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు.