సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు శాసనసభ స్పీకర్ పోచారం ప్రకటించారు. సభలో మూజువాణి ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. దీంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ కూడా జరుగనుంది. కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగనుంది. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టమని అన్నారు. (దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్)
Comments
Please login to add a commentAdd a comment