
జిల్లా కలెక్టరు రోహిణి సింధూరి
బనశంకరి: హాసన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఏ.మంజు, జిల్లా కలెక్టరు రోహిణి సింధూరి మధ్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని రోహిణి బుధవారం ఆరోపణలు చేశారు. ఇటీవల మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని మంత్రి లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాహుబలి మహామస్తకాభిషేకాలు జరిగిన జనవరి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఆరంభమయ్యాయి.