Rohini Sindhuri
-
ఐఏఎస్ రోహిణి సింధూరి నా భూమిని కబ్జా చేశారు.. ప్రముఖ సింగర్ ఫిర్యాదు
బెంగళూరు : కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదం చిక్కుకున్నారు. బెంగళూరు శివార్లలోని తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ అధికారిణి, ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్యనటుడు మెహమూద్ అలీ కుమారుడు,గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. వివాదాస్పద ఆస్తి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.తన భూమి కబ్జాకు గురైందని కలెక్టర్ రోహిణి సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.pic.twitter.com/GeUF0N9Y4k— Lucky Ali (@luckyali) June 20, 2024లక్కీ అలీకి, రోహిణి సింధూరి ట్రస్ట్‌కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం కొనసాగుతుంది. కొన్నేళ్ల క్రితం తన భూమి కబ్జాకు గురవుతుందని, సదరు ఐఏఎస్ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని లక్కీ అలి ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు. వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికి 'ల్యాండ్ మాఫియా' కుట్ర పన్నిందని కూడా ఆయన పేర్కొన్నారు.డిసెంబర్ 2022లో, అలీ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఒక థ్రెడ్‌లో ట్యాగ్ చేసి, ట్రస్ట్ యాజమాన్యంలోని తన వ్యవసాయ భూమిని రోహిణి సింధూరి, సుధీర్ రెడ్డి,మధు రెడ్డి సహాయంతో ల్యాండ్ మాఫియా అక్రమంగా లాక్కుంటున్నారని తెలిపారు. తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. -
IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్
యశవంతపుర: ఐఏఎస్ రోహిణి సింధూరి దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఐపీఎస్ అధికారి రూపకు కోర్టులో ముందస్తు బెయిల్ దొరికింది. రూప ఫేసుబుక్‌లో ఐఏఎస్ రోహిణి సింధూరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని రూపపై ఐఏఎస్ రోహిణి సింధూరి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రూప బెంగళూరు 24వ ఎసీఎంఎం కోర్టులో మంగళవారం హాజరై బెయిల్ తీసుకున్నారు. -
ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి
బెంగళూరు: కర్ణాటకలో ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి మధ్య సమరం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో వారిని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దిరికీ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తన గురించి తప్పుడు ప్రచారం చేయకుండా, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ రోహిణి సింధూరి బెంగళూరులోని సిటీ సివిల్, సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆమె తన పిటిషన్లో రూపా మౌద్గిల్‌తోపాటు 60 మంది పేర్లను ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. రూపా మౌద్గిల్‌ను, సోషల్ మీడియాను కట్టడి చేసేలా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేయాలని రోహిణి తరపు న్యాయవాది కోరారు. సర్వీసు రూల్స్ ప్రకారం రోహిణి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారని, పోలీసులకు కూడా ఫిర్యాదు సమర్పించారని న్యాయస్థానం గుర్తుచేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
డబుల్ స్ట్రోక్.. ఇద్దరు సివిల్ సర్వెంట్లకు బొమ్మ చూపించిన బొమ్మై సర్కార్
-
కర్ణాటకలో ఐఏఎస్ vs ఐపీఎస్
-
మహిళా ఐపీఎస్, ఐఏఎస్‌ల గొడవ.. సర్కారు సీరియస్.. ఇద్దరికీ నోటిసులు
బనశంకరి: కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ రూపా మౌద్గిల్ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం సోమవారం ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా తీవ్ర ఆరోపణలను గుప్పించారు. సోమవారం రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుధీర్ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆ భూమి రాజవంశీయులదే: సుప్రీంకోర్టు
సాక్షి, బెంగళూరు: చాముండిబెట్ట కొండ ప్రాంతం వద్ద కురుబారహళ్లి, ఆలనహళ్లి, చౌడహళ్లి మూడు సర్వే నంబర్లు కలిగిన భూ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ వివాదాస్పద భూమి రాజవంశీకులదేనని సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. భూ వివాదానికి సంబంధించి గత జిల్లాధికారి రోహిణి సింధూరి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాదాపు 1,563 ఎకరాల భూమిపై రెండు దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతోంది. కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు ఈ భూమి మైసూరు మహారాజు ప్రైవేటు ఆస్తిగా పేర్కొంటూ తాజాగా తీర్పు వెలువరించింది. -
ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు.. మైసూరులో పెద్ద ఎత్తున భూముల కబ్జా..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని రాచనగరి జిల్లా అధికారిగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి మైసూరు ప్రాదేశిక కమిషనర్ ప్రకాశ్‌కు లేఖ రాశారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని జిల్లాధికారి నివాసంలో ఈత కొలను నిర్మాణంపై దర్యాప్తు నేపథ్యంలో రోహిణి ఈ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర.. -
Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో గత 25 ఏళ్ల నుంచి అనేక భూ ఆక్రమణలు జరిగాయి. ఈ క్రమంలో.. భూముల అక్రమాలను వెలికితీసి వాటిపై ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిచే విచారణ చేయించాలని వాటాల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజు కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు మైసూరులో ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్‌గా రోహిణిని పునర్నియమించాలన్నారు. రాష్ట్రంలో అటవీ భూములు, చెరువులు, ఇలా అనేక భూములను పలుకుబడి ఉన్న వారు కబ్జాలు చేసుకున్నారని, మైసూరులోనే ఇదే జరిగిందని, ఈ అక్రమాలన్నీ బయటకు రావాలంటే రోహిణితో దర్యాప్తు చేయించాలని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఆమెను బదిలీ చేయించారని ఆరోపించారు. చదవండి: ఐఏఎస్ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్! -
ఐఏఎస్ రోహిణి సింధూరిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరులోని దట్టగళ్లిలోని తమ కన్వెన్షన్ హాల్ అక్రమంగా నిర్మించారని గత కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన ఆరోపణలపై గురువారం కేఆర్ నగర జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే సా.రా మహేశ్ ఆందోళన చేపట్టారు. ప్రాంతీయ కమిషనర్ ఆఫీసు ఆవరణలో ఒంటరిగా కాసేపు బైఠాయించారు. తన ఆస్తి ఏదైనా గానీ అక్రమమని తేలితే వాటిని గవర్నర్ పేరిట రాసిస్తానని సవాలు విసిరారు. సక్రమమని తేలితే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు. మరోవైపు జిల్లా చుట్టుపక్కల జరిగిన భూకుంభకోణాలపై దర్యాప్తునకు ఐఏఎస్ రోహిణి సింధూరిని నియమించాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ భూకుంభకోణంపై ఆమెకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అయితే, ఇద్దరు ఐఏఎస్‌ల మధ్య రగడ తారా స్థాయికి చేరడంతో సీఎం యడియురప్ప రోహిణి సింధూరిని, కమిషనర్ శిల్పానాగ్లను వేర్వేరు శాఖలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: కలెక్టర్ ఎమోషనల్: ఇంటి బిడ్డగా చూసుకున్నారు -
Rohini Sindhuri Emotional: ఇంటి బిడ్డగా చూసుకున్నారు..
సాక్షి, మైసూరు(కర్ణాటక) : జిల్లా ప్రజలు నన్ను తమ ఇంటి బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్లు ఉంది, ప్రజలకు చాలా ధన్యవాదాలు అని అని బదిలీ అయిన కలెక్టర్ రోహిణి సింధూరి అన్నారు. సోమవారం మైసూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మైసూరు గురించి అన్ని విషయాలను కొత్త కలెక్టర్‌కు వివరించానని తెలిపారు. తాను ఇలాంటి సమయంలో బదిలీ అవుతానని అనుకోలేదన్నారు. కలెక్టర్ రోహిణి సింధూరికి, మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ల మధ్య సీఎస్ఆర్ నిధుల విషయంలో రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేనని, రోహిణి సింధూరి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఐఏఎస్‌ల మధ్య వివాదం.. పెద్ద సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప వీరిద్దరిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఇది వరకే బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీని రద్దు చేయాలని రోహిణి సింధూరి, సీఎం యడియురప్పను కోరగా సాధ్యంకాదని చెప్పినట్లు తెలిసింది. చదవండి: ఐఏఎస్‌ల మధ్య రగడ: ఇద్దరిపై బదిలీ వేట -
ఐఏఎస్‌ల మధ్య రగడ: ఇద్దరిపై బదిలీ వేటు
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.బగాది గౌతమ్, కార్పొరేషన్ కమిషనర్‌గా జి.లక్ష్మీకాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పా నాగ్లు పరస్పర విమర్శల పర్వంతో ఇరుకునపడిన సర్కారు ఇద్దరినీ బదిలీ చేసింది. రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి– పంచాయతీ రాజ్‌లో ఈ గవర్నెన్స్ డైరెక్టర్‌గా శిల్పానాగ్‌ను నియమించారు. గౌతమ్, లక్ష్మీకాంత్‌రెడ్డి ఆదివారమే బాధ్యతలను తీసుకున్నారు. కాగా, రోహిణి సింధూరి బెంగళూరులో సీఎం యడియూరప్పను కలిసి తన బదిలీని రద్దు చేయాలని కోరగా, ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శిల్పానాగ్, మనసు మార్చుకుని కొత్త పోస్టులో చేరుతున్నట్లు తెలిపారు. (చదవండి: ఐఏఎస్‌ల మధ్య రగడ: లెక్కలు ఇవిగో..!) (చదవండి: దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు) -
ఐఏఎస్‌ల మధ్య రగడ: లెక్కలు ఇవిగో..!
మైసూరు(కర్ణాటక): సీఎస్ఆర్ ఫండ్స్ రూ. 12 కోట్ల నిధుల లెక్కలు అడగడం తప్పా? అని కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన వ్యాఖ్యలపై మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పందించారు. ఆ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు. కరోనా కట్టడికి వార్డు స్థాయిలో చేపట్టిన చర్యలు,టాస్క్ ఫోర్స్, సహయవాణి ఏర్పాటు, వివిధ సంస్థల నుంచి కొనుగోలు చేసిన సామాగ్రికి చెల్లించిన బిల్లులు తదితరాలతో 127 పేజీల నివేదికను నగరాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. ఈత కొలను అవసరామా? ప్రపంచ ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్‌లోనే స్విమ్మింగ్ పూల్ లేదని, అలాంటప్పుడు కలెక్టర్ రోహిణి సింధూరి బంగ్లాలో ఎందుకని మాజీమంత్రి ఎ.మంజు అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ మొదట తాను ఒక ప్రజా సేవకులిననే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలన్నారు. తానే కరెక్టు, తనకే అన్ని తెలుసు అనే భావన వీడాలన్నారు. చదవండి: ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే -
ఐఏఎస్‌ల మధ్య రగడ: మంత్రి ‘రాజీ’ చర్చలు
మైసూరు: జిల్లాధికారి రోహిణి సింధూరిపై ఆరోపణలు చేసి తన ఉద్యోగానికి రాజీనామ చేసిన మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ శుక్రవారం సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్‌తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని, ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్‌కు మంత్రి సూచించారు. కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్‌కు మనవి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ తెలిపారు. నీతి, నిజాయతీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. పాలికె కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దని కోరుతూ శుక్రవారం పాలికె కార్యాలయం వద్ద సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోహిణి సింధూరిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా) ఆలోచించే రాజీనామా చేశా: శిల్పానాగ్ తాను బాగా ఆలోచించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూరు మహానగర పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తోందని చెప్పారు. సీఎస్ఆర్ ఫండ్స్‌కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకుని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. నిధుల వివరాలు అడగడం తప్పా? : కలెక్టర్ సీఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన రూ.12 కోట్ల గురించి వివరాలు అడగడం తప్పా అంటూ జిల్లాధికారిణి రోహిణి సింధూరి ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ వారం గ్రామాలకు వైద్యులు అనే కార్యక్రమానికి సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సీఎస్ఆర్ ఫండ్స్‌ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరగా మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ ఇప్పటివరకు బదులు ఇవ్వలేదన్నారు. తనపై అసంతృప్తి ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఒక పద్ధతి, వ్యవస్థ ఉంటుందని, దాన్ని అనుసరించి వ్యవహరించాలని సూచించారు. ఈ విషయాలన్నింటి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తానని ఆమె తెలిపారు. మైసూర్లో శిల్పా నాగ్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్న ఉద్యోగులు -
కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే
మైసూరు(కర్ణాటక): కోవిడ్ బారినుంచి ప్రజలను రక్షించడమే తమ కర్తవ్యమని, ఇతరులు ఎలాంటి ఆరోపణలు చేసినా తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మైసూర్ కలెక్టర్ రోహిణి సింధూరి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మైసూరు, కొడగు ఎంపీ ప్రతాప్సింహ కోవిడ్ కు సంబంధించిన వివరాలు బహిరంగంగా అడగటం వల్లనే తాను లెక్క చెప్పాల్సి వచ్చిందని ప్రతి పైసా కోవిడ్ నియంత్రణకు ఖర్చు చేశామన్నారు. మైసూరు జిల్లాధికారిగా తన దృష్టిమొత్తం మైసూరులో కరోనా నియంత్రణపై తప్ప ఇతర విషయాలు పట్టించుకోనని అన్నారు. ఇప్పటి వరకు రూ.36 కోట్లు ఖర్చుచేశామని , ప్రతి దానికి లెక్కలు ఉన్నాయని తెలిపారు. మరణాలపై తప్పుడు లెక్కలు : ఎమ్మెల్యే మహేష్ మైసూరు జిల్లా యంత్రాంగం కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చూపిస్తుందని కేఆర్ నగర జేడీఎస్ ఎమ్మెల్యే సా. రా. మహేష్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేలోనే 909 మంది కరోనా మృతి చెందారని, అయితే, జిల్లా అధికారులు మాత్రం కేవలం 238 మాత్రమే మృతి చెందారని తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరిపై విమర్షలు గుప్పించారు. -
టైరు మార్చిన కలెక్టర్ రోహిణి, వైరల్
మైసూరు: కలెక్టర్ అంటే సమాజంలో గొప్ప హోదా. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా తక్షణమే అందుబాటులోకి వస్తాయి. ఆ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకొని వార్తల్లో నిలిచారు కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి. తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి సింధూరి తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం కొడగు తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారును డ్రైవ్ చేశారు. మార్గంమధ్యలో టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె స్వయంగా రంగంలోకి దిగి, కారు కింద జాకీ అమర్చి టైర్‌ను ఊడదీసి, మరో టైర్‌ను అమర్చారు. రోడ్డుపై వెళ్లేవారు గమనించి మీరు మైసూరు జిల్లా కలెక్టర్ కదా! అని అడగ్గా అవును తానే రోహిణి సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా శుక్రవారం వైరల్ అయ్యాయి. కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణు గోపాల్, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి తదితరులు బుధవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామని, కోవిడ్ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు అందిస్తున్న ఫలాలు చూసి ప్రధాన ప్రతిపక్షం రాక్షస ఆనందం పొందుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిద్ధం అవుతుంటే కోర్టులు ద్వారా అడ్డుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవారి అనుగ్రహం ఉందని, డిక్లరేషన్ పేరుతో వివాదం చేసి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి మాట్లాడుతూ ‘మైసూర్ మహారాజు కాలం నుండి తిరుమలలో 7 ఎకరాల్లో కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ ఉన్నాయి. 14 శతాబ్దం నుండి కర్ణాటక భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేవారు. ప్రభుత్వం తరపున ప్రతిరోజు శ్రీవారికి నిత్య హారతి అందిస్తారు. 1964లో అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి కర్ణాటక సత్రాలకు భూమిపూజ చేశారు. ఇప్పుడు రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ఛారిటీస్‌కు సంబంధించి 5 కాంప్లెక్స్‌లు నిర్మించనున్నాం. రోజుకు 1800 మంది భక్తులకు వసతి కలిగించేలా నిర్మాణం చేపట్టనున్నాం. రేపు ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప భూమిపూజ చేయనున్నారు’ అని తెలిపారు. ఇక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వరదుడు, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం మోహినీ రూపంలో పల్లకిలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అమృతాన్ని దేవతలు అందరికి దక్కేలా చేసిన అవతారమిది. సాక్షాత్తు పరమశివుడు సైతం సమ్మోహన పరిచిన మోహినీ రూపంలో పల్లకీలో ఎదురుగా అద్దంలో తన ముగ్ద మనోహరమైన సుందర రూపాన్ని చూసి మురిసిపోతూ ఊరేగుతూ పల్లకీలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనమిచ్చారు. -
అనాథ శిశువు అయ్యింది అమెరికా అమ్మాయి
శివాజీనగర(కర్ణాటక): ఏడాది కిందట చెత్తకుప్పలో అనాథ శిశువుగా దొరికిన అన్విత తొలి పుట్టినరోజు వేడుకలు శనివారం హాసన్‌లోని తవరు చారిటబుల్ ట్రస్ట్‌లో ఘనంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన దంపతులు ఈ శిశువును దత్తత తీసుకున్నారు. ఒక ఆడశిశువును హొళె నరసిపురలో కుప్పతొట్టిలో పడేసి వెళ్లిపోవడంతో చీమలు, ఉడుతలు కరవడంతో పసిగుడ్డు రోదిస్తుండగా, స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. తరువాత హాసన్ జిల్లా ఆసుపత్రికి చేర్చగా వైద్యుల చికిత్సలో ప్రాణాలతో బయటపడింది. త్వరలో అమెరికాకు హాసన్‌లో డాక్టర్ పాలాక్షప్ప నేతృత్వంలోని తవరు చారిటబల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన అన్వితా శనివారం తొలి పుట్టిన రోజును జరుపుకుంది. కలెక్టర్ రోహిణి సింధూరి ప్రత్యేకంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈసందర్భంగా అమెరికాకు చెందిన రెండు జంటలు ఇందులో పాల్గొన్నాయి. అన్వితతో పాటు మరొక చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. దీంతో అనాథ శిశువు అమెరికా అమ్మాయి అయ్యిందని పలువురు ఆనందం వ్యక్తంచేశారు. వీసా తదితరాలు కొన్ని రోజుల్లో పూర్తిచేసుకుని అన్వితను అమెరికాకు తీసుకెళ్తామని అమెరికన్ దంపతులు తెలిపారు. -
ఐఏఎస్ రోహిణీ సింధూరికి నిరాశ
యశవంతపుర: హాసన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న తనను బదిలీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ న్యాయం పోరాటం చేస్తున్న రోహిణి సింధూరికి హైకోర్టు ఆదేశం తీవ్ర నిరాశ కలిగించింది. శుక్రవారం సింధూరి బదిలీ విషయంపై హైకోర్టు న్యాయమూర్తులు హెచ్‌జీ రమేశ్, బీ.శ్రీనివాస్‌గౌడల ధర్మాసనం ఇటీవల ప్రాథమిక విచారణను పూర్తి చేసి తమ తీర్పును ప్రకటించింది. కేంద్ర పాలన మండలి ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. అయితే ప్రభుత్వం బదిలీ చేసిన ఉద్యోగ, శిక్షణ శాఖ అధికారిగా బాధ్యతలను స్వీకరించాలని రోహిణి సింధూరికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పట్టు వదలకుండ న్యాయ పోరాటం చేసిన ఆమెకు చివరకు నిరాశ మిగిలింది. హాసన్ జిల్లా కలెక్టర్‌గా కాకుండా ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన పదవిలో కొనసాగాలని ఆదేశిస్తూ కేసు విచారణను మే 30కి వాయిదా వేసింది. -
రోహిణి సింధూరికి ఈసీ క్లీన్చిట్
సాక్షి, బెంగళూరు : హాసన్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరికి రాష్ట్ర ఎన్నికల అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. హాసన్‌కు చెందిన మంత్రి ఏ.మంజు, రోహిణిపై పలు ఆరోపణలు సంధించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మైసూరు ప్రాంతీయ కమిషనర్ విచారణ చేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిక అందించారు. నివేదిక అనంతరం రోహిణి సింధూరికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ తెలిపారు. కాగా హాసన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హాసన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏ.మంజు....ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రోహిణి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మంత్రి తన లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ఈసీ సింధూరికి క్లీన్ చిట్ ఇచ్చింది. -
పోరు సింధూరం
కలెక్టర్‌గా ఆమె నిబద్ధతతో పనులు చేస్తుంటే బదిలీలు చేస్తున్నారు పాలకులు. ప్రజలే ఆమె కోసం పోరాడారు. అదే ఈ పోరు సింధూరం కథ. ఉదయించేటప్పుడు... అస్తమించేటప్పుడు కనిపించే రంగు సింధూరం.సమాజంలో ఉన్న చీకటి...సాయం వేళ సింధూరాన్ని మింగేస్తుంది.కానీ... సింధూరం తన శక్తిని తాను మళ్లీ పూరించుకుని వేకువలో పోరు సింధూరంగా ఉదయిస్తుంది.రోహిణి సింధూరి ఐఎఎస్ ప్రతిభపై...దుర్మార్గపు చీకట్లు ఎన్ని ముసిరినా...పౌర సేవల వెలుగునే చూపుతోందామె.రోహిణి సింధూరి తెలుగమ్మాయి, ఖమ్మం జిల్లాలో పుట్టింది.హైదరాబాద్‌లో పెరిగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంది. కర్ణాటకలో పోస్టింగ్ అందుకుంది. కరవు రైతులకు పరిహారం ఇప్పించింది, కొబ్బరి నీటితో కొర్పొరేట్ వ్యాపారం చేయడమెలాగో రైతులకు నేర్పించింది. గోమఠేశ్వరుని సాక్షిగా మస్తకాభిషేకాన్ని పరిపూర్ణం చేసింది. చట్టానికి చుట్టాలుండరని, సామాన్యుల సేవ కోసమే చట్టమైనా, ప్రజా ప్రతినిధి అయినా అని నమ్ముతోంది. నమ్మింది నమ్మినట్లే్ల ఆచరణలో పెడుతోంది. తుముకూరు, మండ్య, హసన్ జిల్లాల్లో ఆమె నిర్వర్తించిన విధులే ఆమె ఎంత కచ్చితమో చెప్తాయి. ఆమెలోని ఆ కచ్చితమే మంత్రి అధికార దుర్వినియోగానికి తాళం పెట్టించింది. తొలి పరీక్ష! సింధూరికి ఇంజనీరింగ్ పూర్తయ్యేటప్పుడు వచ్చింది సివిల్స్ ఆలోచన. అదే పెద్ద మలుపు ఆమె జీవితంలో. పెళ్లి చేయాలన్న అమ్మానాన్నలను రెండేళ్లు గడువు అడిగింది. సివిల్స్ పరీక్షలకు నెల ముందు యాక్సిడెంట్ రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో బెడ్ మీద నుంచే ప్రిపరేషన్. ఐఎఎస్ కావాలనుకున్నప్పటి నుంచి మొదలైన ఎదురీత, బాధ్యతలు చేపట్టాక కూడా తప్పడం లేదు. ఒక పనిని సమర్థంగా పూర్తి చేస్తుంటే నాయకుల నుంచి అడ్డంకులు. జీవితమంటే అడ్డంకులను అధిగమించడమే అంటోంది... ఉలి దెబ్బలను ఓర్చుకున్న ఈ శిల్పం. ఎన్నికలొచ్చాయి! ప్రస్తుతం కర్నాటకలో అసెంబ్లీకి ఎన్నికల సమయం. మంత్రి ఎ. మంజు అధికార దుర్వినియోగం మీద మీడియా కన్ను పడింది. కర్ణాటక ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ బంగ్లాలోని ఆఫీస్‌లో ఫైళ్లు క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. వీడియో క్లిప్‌లతో సహా టీవీల్లో వార్త వచ్చింది. వెంటనే సింధూరి ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లి ఆఫీస్‌కి తాళం వేసింది. మంత్రి వెనుకటి తేదీలు వేసి (ఎన్నికల కోడ్ అమలు కావడానికి ముందు తేదీలు) వెయ్యి మందికి వ్యవసాయ భూములిస్తూ సంతకాలు చేశారనేది మీడియా, ప్రతిపక్షాల వాదన. అసలైన నిరుపేదలకు భూములివ్వకుండా తమకు ఓట్లు వేసే వాళ్లెవరు, వేయని వాళ్లెవరో చెప్పే పార్టీ నివేదికలు ఆలస్యం కావడంతో మంత్రి ఈ పనికి పాల్పడ్డారనేది మరో ఆరోపణ. ఎలక్షన్ ఆఫీసర్ విచారణలో వెయ్యి మందికి భూములివ్వడం ద్వారా ఐదువేల మంది ఓటర్లను ప్రభావితం చేసినట్లు నిర్ధారణ అయింది. విచారణ తీవ్రమయ్యే కొద్దీ మంత్రి మాట మెల్లగా మృదుత్వాన్ని సంతరించుకుంటోంది. ‘జిల్లా కలెక్టర్ తన కూతురితో సమానమని, ఆమె మీద తనకు ఎటువంటి కోపమూ లేదు’ అంటున్నారిప్పుడు. పని చేయాలంటే తట్టుకుని నిలవాలి ‘మనకెందుకొచ్చిన రిస్క్ అనుకుంటే ఏ పనినీ కచ్చితంగా చేయలేం. కొత్తగా వచ్చిన అధికారి అక్కడి సమస్యలు, పరిస్థితులు, సంస్కృతిని అర్థం చేసుకుని, ఉద్యోగుల్లో ఒక టీమ్‌ను తయారు చేసుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. ఈ టైమ్‌కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక పని చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. నిజాయితీగా పరిపాలన చేయాలంటే ఇన్ని అడ్డంకులు ఉంటాయి’ అంటారు సింధూరి. ఏడాదిలో లక్ష టాయిలెట్లు మండ్య జిల్లాలో ఏడాదిలో లక్ష టాయిలెట్లు కట్టించి జాతీయస్థాయి రికార్డు సృష్టించారామె. టాయిలెట్లు కట్టడానికి ముందు వాటిని వాడేటట్లు గ్రామస్థుల మైండ్‌సెట్‌ను మార్చాల్సి వచ్చింది. చెరకు పొలాల్లో పాము కాట్లు, కుక్క కాట్ల వంటి అనేక ప్రమాదాలు, మహిళల మీద అఘాయిత్యాలు బయటకు వెళ్లినప్పుడే జరిగేవి. పోకిరీ పిల్లలు కాపు కాచి ఆడవాళ్లను ఏడిపించేవారు. ఇలా ఉన్నా సరే టాయిలెట్ వాడటానికి సుముఖంగా లేరు. ప్రతి గ్రామంలో ఏడెనిమిది మందితో (పిల్లలు కూడా) ఒక టీమ్ వేసి, వాళ్లకు విజిల్స్ ఇచ్చారామె. ఆ టీమ్ ఉదయాన్నే ఊరంతా తిరుగుతూ ఎవరైనా ఆరు బయట ఆ పని చేస్తుంటే విజిల్ ఊదేవాళ్లు. బయట ఆ పని చేయడం షేమ్ అనిపించి, టాయిలెట్ అవసరమే అని దారికొచ్చారంతా. ‘ఒక పని చేయడానికి అధికారం ఉండాలి. కానీ అధికారంతోనే అన్ని పనులనూ చేసేయవచ్చు అనుకుంటే పొరపాటే’నంటారామె. ఆ పని అవసరాన్ని జనానికి చెప్పాలి, సమాధానపడే వరకు నచ్చచెప్పాలి. మొండిగా ఉంటే అధికారం అనే ఆయుధం ఉందనే భావన కలిగించాలి తప్ప, అధికారాన్ని ఆయుధంగా వాడటం దేనికీ సమాధానం కాదంటారు సింధూరి.‘సమాజానికి సాధ్యమైనంత ఎక్కువ సేవ చేయగలిగింది ఐఎఎస్ అధికారి మాత్రమే. ఐఎఎస్‌కు ప్రిపేరయ్యేటప్పుడు అదే అనుకు న్నాను, దానినే ఆచరిస్తున్నాను. సమాజానికి, సామాన్యులకు చేతనైనంత ఎక్కువ సేవ చేయడమే నా లక్ష్యం’ అంటారామె. ‘ఎంత సాహసోపేతమైన అధికారికి అయినా కుటుంబం అండగా ఉంటేనే నూటికి నూరుశాతం సర్వీస్ ఇవ్వగలుగుతారు. మా అత్తగారు హసన్‌కే వచ్చి నా పిల్లలను చూసుకుంటుండటంతోనే కలెక్టర్‌గా నా బాధ్యతలకు పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతున్నాను, తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉంటానో నా పిల్లలకు తల్లిగా మారిన అత్తగారికీ అంతలా రుణపడి ఉంటాను’ అంటున్నారు కలెక్టర్ రోహిణి సింధూరి. మా పేర్లూ ఆయన సినిమా పేర్లలాగే! పెయింటింగ్‌కి టైమ్ లేదిప్పుడు. రోజూ యోగా, మెడిటేషన్ చేస్తాను. స్ట్రెస్ అనిపిస్తే విశ్వనాథ్ గారి సినిమా పాటలు వింటాను. ఆయన సినిమాల్లాగానే మా ఇంట్లో పేర్లు కూడా ‘ఎస్’తోనే మొదలవుతాయి. మా వారు సుధీర్ రెడ్డి, బాబు సిద్ధార్థ్, పాప సిరిణ్య. రెండవసారి గర్భంతో ఉన్నప్పుడు ఈ సారి పుట్టేది పాపే అనిపించేది. పుట్టబోయే పాపకు పేరు పెట్టమని విశ్వనాథ్ గారిని అడిగాను. ‘పుట్టనివ్వు పెడతాను’ అన్నారాయన నవ్వుతూ. సిరివెన్నెల మీద ఇష్టంతో పాపకు సిరిణ్య అని పెట్టాను. – రోహిణి సింధూరి, కలెక్టర్, హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం కల్పామృతం కొబ్బరి రైతులు రోడ్డు పక్కన కాయలమ్ముకునేవాళ్లు. కాయలు మిగిలిపోతే మరుసటి రోజుకు నీరు తగ్గిపోతుంది, కాయ ధర పలకదు. రైతుకి వచ్చే రూపాయి కూడా ఎండకు ఎండిపోతుంది. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డులతో మాట్లాడి కల్పామృత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారామె. కొబ్బరినీటిలో నిమ్మరసం, తేనె కలిపిన డ్రింక్ ఒకటి. మొత్తం ఐదు రకాల కొబ్బరినీటి ఉత్పత్తులు రెడీ అయ్యాయి. పాల ఉత్పత్తిదారుల కోసం అముల్ కంపెనీ ఉన్నట్లు... కొబ్బరి రైతుల కోసం కల్పామృత పాజిటివ్ కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు ఆరువందల మంది రైతులు కల్పామృతతో అనుసంధానమయ్యారు. కన్నడ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకం శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరునికి పన్నెండేళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేకం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించింది. సింధూరి హసన్‌కు వచ్చే నాటికి మస్తకాభిషేకానికి ఆరు నెలలే ఉంది. పనులు మొదలుకాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పనులు జరగవు. వేగంగా, సిస్టమాటిక్‌గా ఆదేశాలిస్తోందామె. జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంజుకి కష్టంగా తోచింది. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. శానిటేషన్, ట్రాన్స్పోర్ట్, వైద్య సహాయం, మంచినీరు, ఇతర అరేంజ్మెంట్స్ అన్నీ సక్రమంగా జరగాలని వర్క్ టెండర్లు వేసిన వాళ్లకు కండిషన్ పెట్టారామె. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాని విధంగా ఏర్పాట్లు జరగడానికి ఆమె రూపొందించిన ప్రోగ్రామ్‌కి ముఖ్యమంత్రి నుంచి ఆమోదం వచ్చింది. దాంతో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. మంత్రిగారికి గాయమైంది! మస్తకాభిషేకానికి 40 లక్షల మంది వచ్చారు. ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు. కానీ మంత్రి గారి మనసు వేడుకకు ముందే బాగా గాయపడింది. జిల్లాలో ఇదే కలెక్టర్ కొనసాగితే తనకు కష్టం అని పదే పదే హెచ్చరించసాగిందాయన మనసు. మస్తకాభిషేకం ఇక రోజుల్లోకి వచ్చేసినప్పుడు తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించారు. అప్పుడు వచ్చింది ప్రజాగ్రహం ఒక వెల్లువలాగ. అప్పటికే ఆమె రెండో సర్వే చేయించి కరవు రైతులకు కేంద్రం నుంచి 60 కోట్లు విడుదల చేయించింది. రైతులకు బీమా డబ్బు అందుతోంది. ఈ కలెక్టర్ మారిపోతే తమ గోడు పట్టించుకునే నాథుడెవరూ ఉండరనే ఆందోళన వారిలో. ఇక ప్రభుత్వానికి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. – వాకా మంజులారెడ్డి -
మంత్రి మంజుపై కలెక్టరు రోహిణి ఆగ్రహం
బనశంకరి: హాసన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏ.మంజు, జిల్లా కలెక్టరు రోహిణి సింధూరి మధ్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని రోహిణి బుధవారం ఆరోపణలు చేశారు. ఇటీవల మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మంత్రి లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాహుబలి మహామస్తకాభిషేకాలు జరిగిన జనవరి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఆరంభమయ్యాయి. -
ఆమె కోసం జనం రోడ్లెక్కారు
బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి..ఎదురొడ్డి నిలిచింది. తన బిడ్డకు అండగా నిలబడింది. చివరకు ఆమె కృషి ఫలించింది. కన్నబిడ్డను కలెక్టర్‌ను చేసింది..ఆ కలెక్టర్‌కు అమ్మగా ఎనలేని సంతోషాన్ని మూటగట్టుకుంది కర్నాటక ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి. విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి..కలెక్టర్‌నవుతానంటూ మారాం చేసిన సింధూరి కలను నిజం చేసిన శ్రీలక్ష్మీరెడ్డి..ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాలు, సవాళ్ల గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు శ్రీలక్ష్మీరెడ్డి మాటల్లోనే... హిమాయత్‌నగర్: మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. మావారు దాసరి జయపాల్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. మాది చాలా పెద్ద కుటుంబం. మా పెద్దమ్మాయి రోహిణీ సింధూరిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం. కానీ సింధూరి ఒప్పుకోలేదు. ఇండియాలోనే ఉంటానని ఖరాకండిగా చెప్పేసింది. చేసేదేం లేక ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కూడా మళ్లీ అమెరికా గురించి అడిగితే చిరాకుపడింది. ఇక వదిలేశాం. ఇండియాలోనే ఉండాలనే కోరికతో సివిల్స్ వైపు దృష్టి... నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. 1990 నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాను. నా సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్స్పైర్ అయింది. తాను కూడ ప్రజలకు సేవచేయాలనుకుంది. అందుకు ఐఏఎస్ బెస్ట్ మార్గం అనుకుంది. ‘అమ్మా నేను కలెక్టర్ అవుతా’ అన్నది. ‘కలెక్టర్ అయితే ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సేవ చేయోచ్చు. కాబట్టి నన్ను సివిల్స్‌లో చేర్పించండంటూ’ కోరింది. ఆమె కోరిక మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆర్.సి.రెడ్డి కోచింగ్ సెంటర్లో సివిల్స్‌లో చేర్పించాం. మెయిన్స్ సమయంలో యాక్సిడెంట్ మెయిన్స్ కోసం సింధూ ఢిల్లీ వెళ్లింది. ఆ సమయంలో పొద్దున్నే తను పాలప్యాకెట్ కోసం కిరాణా స్టోర్‌కి వెళ్లింది. పాలు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో కారు ఢీకొంది. ఆ సమయంలో సింధూ తీవ్ర గాయలపాలయ్యింది. మాకు చెబితే మేం కంగారు పడ్తాం అని తన స్నేహితురాలికి ఫోన్ ద్వారా చెప్పింది. ఆమె నాకు ఫోన్ చేసి చెప్పడంతో నేను ఢిల్లీ పయనమై వెళ్లి అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం. బెడ్ మీద పడుకునే చార్ట్‌లపై క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్‌ని రాసుకోవడం, వీల్‌ఛైర్‌లో కూర్చుని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాయడం చేసింది. ఆఖరికి బాత్రూమ్లోని గోడలపై కూడా తను రాతలు రాసి ప్రిపేర్ అయింది. ఆ రోజులు గుర్తొస్తే..కన్నీరు ఆగదు నాకు. అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను అన్నది... సింధూకి దేవుడు అందమైన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం కోసం ఎందరో పోకిరీలు ఎన్నో సందర్భాల్లో సింధూని వేధించారు. తను కాలేజీకి వెళ్తున్న సమయంలో చాలా మంది వెంటపడి ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. ‘అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను. ప్రతి ఒక్కడు నాతో మాట్లాడు, లేదంటే బాగోదు అంటూ బెదిరిస్తున్నారు’ అని చెప్పి ఏడ్చేది. చేసేదేమీ లేక మూడు కాలేజీలు మార్చాం. ఎన్ని కాలేజీలు మార్చినా సింధూపై వేధింపులు మాత్రం ఆగలేదు. ఆ సమయంలో తల్లిగా నేను తనలో ధైర్యాన్ని నింపాను. సమాజంలో ఎలా ఉండాలి, అబ్బాయిల నుంచి వేధింపులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఓ స్నేహితురాలిగా వివరించా. అప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదురించి నిలబడింది. వచ్చేదా..చచ్చేదా అన్నారు బంధువుల నుంచి సింధూకి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. తనకు నచ్చకపోవడం వల్ల మేం తిరస్కరించాం. ఆ సమయంలో ‘ఏంటి మీరు లక్షలు పోసి చదివిస్తున్నారు? అసలు ఆమెకు ఐఏఎస్ వచ్చేదా..చచ్చేదా..? ఏం..మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఏమౌవతదంట? అంటూ ఎంతో మంది సూటిపోటి ప్రశ్నలతో నన్ను వేధించారు. కానీ నేను ఏనాడూ సింధూ వద్ద ప్రస్తావించలేదు. తను కలెక్టర్ అయ్యాక కానీ వారంతా నోరుమసూకున్నారు. నా బిడ్డ నన్ను తల ఎత్తుకునేలా చేసిందని గర్వపడుతున్నాను. అసలు మా వంశంలో కలెక్టర్ అయినవారు ఏవరూ లేరు. ఆమె కోసం జనం రోడ్లెక్కారు రోహిణీ సింధూరి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా డీసీగా పనిచేస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో స్థానికుల నుంచి ఆమెకు పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల రెండు, మూడు ఇష్యూస్‌లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించారు. ట్రాన్స్ఫర్ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆమెకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజానీకం ఆమెను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనం రోడ్లెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడుసార్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చి వెనక్కి తీసుకుంది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్‌ని వేధిస్తే..ప్రజల నుంచి ఎలా ఇబ్బందులు వస్తాయో..ప్రభుత్వమే స్వయంగా గుర్తించింది. -
బదిలీపై భగ్గు
సాక్షి, బెంగళూరు: ఐఏఎస్ అధికారి బదిలీపై ఆగ్రహం రాజుకుంది. హాసన్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి బదిలీతో రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ భాగ్య కల్పిస్తోందని ప్రతిపక్షాలు, జిల్లాలోని ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. నిజాయతీపరురాలైన అధికారిణిగా పేరుపొందిన రోహిణి బదిలీని జిల్లవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు అడ్డంకిగా మారిన ఆమెను సాగనంపాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి మంజుతో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒత్తిడి చేయడంతోనే కలెక్టర్‌పై సిద్ధరామయ్య ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రవణ బెళగోళలో మహామస్తకాభిషేక ఏర్పాట్లను పరిశీలనకు వెళ్లిన సీఎం సిద్దరామయ్య కలెక్టర్ రోహిణి సింధూరిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణాలన్నింటితో రోహిణిని హాసన్ జిల్లా నుంచి బదిలీ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. హాసన్ జిల్లాకు కొత్త కలెక్టర్ ఎం.వీ.వెంకటేశ్‌ను నియమిస్తూ, రోహిణిని కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక, కనీససౌకర్యాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. జిల్లా కలెక్టర్‌గా ఆమె గతేడాది జులైలో బాధ్యతలు చేపట్టారు. రేపు దేవేగౌడ నిరసన కలెక్టర్ రోహిణి సింధూరిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 25న హాసన్‌లో జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ నేతృత్వంలో నిరసనలు చేయనున్నట్లు హాసన్ ఎమ్మెల్యే రేవణ్ణ తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను ఆమె అడ్డుకుంటారనే కారణంగా సీఎం సిద్ధరామయ్య ఆమెను బదిలీ చేశారని ఆరోపించారు. ఇందులో మంత్రి మంజు, జిల్లా కాంగ్రెస్ నేతల ఒత్తిడి ఉందని విమర్శించారు. మరికొందరు ఐఏఎస్‌ల బదిలీ ఐఏఎస్ మహిళా అధికారి ఎం.వీ.జయంతిని కేఏటీ అధ్యక్షురాలిగా,వీ. చైత్రాను కార్మికశాఖ కమీషనర్‌గా, కే.రాజేంద్రను రామనగర జిల్లా కలెక్టర్‌గా,ఎం.వీ.వెంకటేశ్‌ను హాసన్ జిల్లా కలెక్టర్‌గా,బీ.ఆర్.మమతాను ఆహారపౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సర్కారు బదిలీ చేసింది. మహిళ అయితే బదిలీ చేయొద్దా? : ముఖ్యమంత్రి సిద్ధు సాక్షి, బెంగళూరు: హసన్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి బదిలీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించుకున్నారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారి బదిలీని చేయకూడదా? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 121వ జయంతి సందర్భంగా విధానసౌధ ఆవరణలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం బోస్ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలు, సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచే స్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోహిణి బదిలీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మహిళలు అయినంతమాత్రాన బదిలీ చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ బదిలీలో ఎవరి ఒత్తిళ్లు కానీ, రాజకీయాలు కానీ లేవని స్పష్టంచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే రోహిణిని బదిలీ చేశామని, అంతకుమించి ప్రత్యేకత లేదని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. మహదాయి నది నీటి వివాదంపై జరుగనున్న బంద్ వెనుక ప్రభుత్వ హస్తం ఉందని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయని గుర్తుచేశారు. కన్నడ సంఘాల నాయకుడు వాటాల్ నాగరాజ్ ఎప్పటినుంచో మహదాయి అంశంపై పోరాడుతున్నారని, ఆయనకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, నేతాజీ ట్రస్ట్ అధ్యక్షుడు జీఆర్ శివశంకర్, కార్యదర్శి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ సమస్య ఇంకొకరితో చెప్పుకునేది కాదు'
జూబ్లీహిల్స్: 'అత్యవసరమైన' నిత్యావసరాలు తీర్చుకునేందుకు ఇంటిలో 'మరుగు' సదుపాయం లేకుంటే మహిళలు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇది ఇంకొకరితో చెప్పుకునేది కాదు. ఇక పల్లెల్లోనైతే మరీ దుర్భరం. కేంద్ర ప్రభుత్వమే స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుకు నడుం బిగించిందంటే దేశంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవచ్చు. గ్రామాల్లో మహిళలు పడే 'మరుగు' కష్టాలను సాటి మహిళగా గుర్తించారు మన తెలుగు తేజం రోహిణి సింధూరి. ప్రభుత్వ ఉన్నతాధికారిగా కర్తవ్య దీక్షకు పూనుకున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో మూడో స్థానం సాధించారు. ఐఏఎస్ అధికారిగా భ్రూణ హత్యలపై ప్రజలను చైతన్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భర్త సుధీర్‌రెడ్డితో కలిసి ఇటీవల హైదరాబాద్ వచ్చిన సింధూరి 'సాక్షి'తో ముచ్చటించారు. ఆ వివరాలు సింధూరి మాటల్లోనే.. ఇదీ నేపథ్యం.. మా తల్లిదండ్రులు జైపాల్‌రెడ్డి, శ్రీలక్ష్మి. మాది ఖమ్మం జిల్లాలోని రుద్రాక్షపల్లి గ్రామం. నేను, చెల్లి, తమ్ముడు అక్కడే పుట్టాం. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. నాన్నకు న్యాయవాదిగా ప్రాక్టీస్ పెరగడంతో హైదరాబాద్ వచ్చేశాము. నగరంలోనే ఇంటర్, ఇంజినీరింగ్ పూర్తి చేశా. స్నేహితులను చూసి సివిల్స్ రాశా. మెదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను. కర్ణాటక క్యాడర్‌కు ఎంపికై ఐదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నా. ప్రస్తుతం మాండ్య జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నా. మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి.. జిల్లా పరిషత్ సీఈవోగా మాండ్య జిల్లా సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశాను. కావేరి నదీ తీరంలోని ఈ జిల్లాలో దాదాపు 4 లక్షల ఇళ్లున్నాయి. అభివృద్ధి చెందిన జిల్లా అయినప్పటికీ పల్లెల్లో మహిళల భద్రత దారుణంగా ఉంది. బహిర్భూమికి వెళ్లిన ఆరవ తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురికావడం నన్ను కలచివేసింది. దీనికి ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు లేకపోవడమే కారణంగా గుర్తించాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్దసంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 90 వేల మరుగుదొడ్ల నిర్మించాం. భవిష్యత్తులో 1.4 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పనిచేస్తున్నా. దేశంలోనే రికార్డ్... మరుగుదొడ్ల నిర్మాణంలో పశ్చిమ బెంగాల్‌లోని నాడియా, రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా, కర్ణాటకలోని మాండ్య జిల్లాను మూడవ స్థానంలో నిలిపా. నా కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో ఢిల్లీలో 'ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ' పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి నన్ను రిసోర్స్ పర్సన్‌గా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సీఈవోలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం మరిచిపోలేను. మాండ్య జిల్లాలో భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా. ఇందులో భాగంగా లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లపై ఉక్కుపాదం మోపాము. ఇప్పటివరకు దాదాపు 40 క్లినిక్‌లు, డయాగ్నస్టిక్స్ సెంటర్లను మూసివేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా అంటూ ముగించారు.