
మైసూరు(కర్ణాటక): సీఎస్ఆర్ ఫండ్స్ రూ. 12 కోట్ల నిధుల లెక్కలు అడగడం తప్పా? అని కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన వ్యాఖ్యలపై మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పందించారు. ఆ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు. కరోనా కట్టడికి వార్డు స్థాయిలో చేపట్టిన చర్యలు,టాస్క్ ఫోర్స్, సహయవాణి ఏర్పాటు, వివిధ సంస్థల నుంచి కొనుగోలు చేసిన సామాగ్రికి చెల్లించిన బిల్లులు తదితరాలతో 127 పేజీల నివేదికను నగరాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.
ఈత కొలను అవసరామా?
ప్రపంచ ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్‌లోనే స్విమ్మింగ్ పూల్ లేదని, అలాంటప్పుడు కలెక్టర్ రోహిణి సింధూరి బంగ్లాలో ఎందుకని మాజీమంత్రి ఎ.మంజు అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ మొదట తాను ఒక ప్రజా సేవకులిననే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలన్నారు. తానే కరెక్టు, తనకే అన్ని తెలుసు అనే భావన వీడాలన్నారు.
చదవండి: ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా
కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment