Karnataka IAS Transfers Today: Karnataka Govt Transfers Rohini Sindhuri And Shilpa Nag From Mysuru - Sakshi
Sakshi News home page

ఐఏఎస్​ల మధ్య రగడ: ఇద్దరిపై బదిలీ వేటు

Published Mon, Jun 7 2021 10:42 AM | Last Updated on Mon, Jun 7 2021 6:52 PM

Karnataka Govt Transfers Rohini Sindhuri And Shilpa Nag From Mysuru - Sakshi

శిల్పా నాగ్‌, రోహిణి సింధూరి

మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.బగాది గౌతమ్, కార్పొరేషన్‌ కమిషనర్‌గా జి.లక్ష్మీకాంత్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ రోహిణి సింధూరి, కమిషనర్‌ శిల్పా నాగ్‌లు పరస్పర విమర్శల పర్వంతో ఇరుకునపడిన సర్కారు ఇద్దరినీ బదిలీ చేసింది. రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి– పంచాయతీ రాజ్‌లో ఈ గవర్నెన్స్‌ డైరెక్టర్‌గా శిల్పానాగ్‌ను నియమించారు.

గౌతమ్, లక్ష్మీకాంత్‌రెడ్డి ఆదివారమే బాధ్యతలను తీసుకున్నారు. కాగా, రోహిణి సింధూరి బెంగళూరులో సీఎం యడియూరప్పను కలిసి తన బదిలీని రద్దు చేయాలని కోరగా, ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.  తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శిల్పానాగ్, మనసు మార్చుకుని కొత్త పోస్టులో చేరుతున్నట్లు తెలిపారు.

(చదవండి: ఐఏఎస్​ల మధ్య రగడ​: లెక్కలు ఇవిగో..!)

(చదవండి: దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement