సాక్షి, మైసూరు(కర్ణాటక) : జిల్లా ప్రజలు నన్ను తమ ఇంటి బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్లు ఉంది, ప్రజలకు చాలా ధన్యవాదాలు అని అని బదిలీ అయిన కలెక్టర్ రోహిణి సింధూరి అన్నారు. సోమవారం మైసూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మైసూరు గురించి అన్ని విషయాలను కొత్త కలెక్టర్‌కు వివరించానని తెలిపారు. తాను ఇలాంటి సమయంలో బదిలీ అవుతానని అనుకోలేదన్నారు. కలెక్టర్ రోహిణి సింధూరికి, మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ల మధ్య సీఎస్ఆర్ నిధుల విషయంలో రగడ జరిగిన విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేనని, రోహిణి సింధూరి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఐఏఎస్‌ల మధ్య వివాదం.. పెద్ద సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప వీరిద్దరిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా ఇది వరకే బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీని రద్దు చేయాలని రోహిణి సింధూరి, సీఎం యడియురప్పను కోరగా సాధ్యంకాదని చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment