
మైసూరు(కర్ణాటక): కోవిడ్ బారినుంచి ప్రజలను రక్షించడమే తమ కర్తవ్యమని, ఇతరులు ఎలాంటి ఆరోపణలు చేసినా తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మైసూర్ కలెక్టర్ రోహిణి సింధూరి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మైసూరు, కొడగు ఎంపీ ప్రతాప్సింహ కోవిడ్ కు సంబంధించిన వివరాలు బహిరంగంగా అడగటం వల్లనే తాను లెక్క చెప్పాల్సి వచ్చిందని ప్రతి పైసా కోవిడ్ నియంత్రణకు ఖర్చు చేశామన్నారు. మైసూరు జిల్లాధికారిగా తన దృష్టిమొత్తం మైసూరులో కరోనా నియంత్రణపై తప్ప ఇతర విషయాలు పట్టించుకోనని అన్నారు. ఇప్పటి వరకు రూ.36 కోట్లు ఖర్చుచేశామని , ప్రతి దానికి లెక్కలు ఉన్నాయని తెలిపారు.
మరణాలపై తప్పుడు లెక్కలు : ఎమ్మెల్యే మహేష్
మైసూరు జిల్లా యంత్రాంగం కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చూపిస్తుందని కేఆర్ నగర జేడీఎస్ ఎమ్మెల్యే సా. రా. మహేష్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేలోనే 909 మంది కరోనా మృతి చెందారని, అయితే, జిల్లా అధికారులు మాత్రం కేవలం 238 మాత్రమే మృతి చెందారని తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరిపై విమర్షలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment