Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర.. | Karntaka Ex MLA Comment On IAS Rohin Sindhuri | Sakshi
Sakshi News home page

రోహిణిచే దర్యాప్తు చేయించాలి 

Published Mon, Jun 14 2021 10:57 AM | Last Updated on Mon, Jun 14 2021 10:57 AM

Karntaka Ex MLA Comment On IAS Rohin Sindhuri - Sakshi

సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో గత 25 ఏళ్ల నుంచి అనేక భూ ఆక్రమణలు జరిగాయి. ఈ క్రమంలో..  భూముల అక్రమాలను వెలికితీసి వాటిపై ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిచే విచారణ చేయించాలని వాటాల్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటాల్‌ నాగరాజు కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు మైసూరులో ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్‌గా రోహిణిని పునర్నియమించాలన్నారు.

రాష్ట్రంలో అటవీ భూములు, చెరువులు, ఇలా అనేక భూములను పలుకుబడి ఉన్న వారు కబ్జాలు చేసుకున్నారని, మైసూరులోనే ఇదే జరిగిందని, ఈ అక్రమాలన్నీ బయటకు రావాలంటే రోహిణితో దర్యాప్తు చేయించాలని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఆమెను బదిలీ చేయించారని ఆరోపించారు.  

చదవండి:  ఐఏఎస్‌​ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement