బెంగళూరు : కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదం చిక్కుకున్నారు. బెంగళూరు శివార్లలోని తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ అధికారిణి, ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్యనటుడు మెహమూద్ అలీ కుమారుడు,గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. వివాదాస్పద ఆస్తి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.
తన భూమి కబ్జాకు గురైందని కలెక్టర్ రోహిణి సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
— Lucky Ali (@luckyali) June 20, 2024
లక్కీ అలీకి, రోహిణి సింధూరి ట్రస్ట్‌కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం కొనసాగుతుంది. కొన్నేళ్ల క్రితం తన భూమి కబ్జాకు గురవుతుందని, సదరు ఐఏఎస్ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని లక్కీ అలి ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు. వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికి 'ల్యాండ్ మాఫియా' కుట్ర పన్నిందని కూడా ఆయన పేర్కొన్నారు.
డిసెంబర్ 2022లో, అలీ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఒక థ్రెడ్‌లో ట్యాగ్ చేసి, ట్రస్ట్ యాజమాన్యంలోని తన వ్యవసాయ భూమిని రోహిణి సింధూరి, సుధీర్ రెడ్డి,మధు రెడ్డి సహాయంతో ల్యాండ్ మాఫియా అక్రమంగా లాక్కుంటున్నారని తెలిపారు. తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment