Land grab case
-
ఏపీలో మంత్రుల ఆండదండలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
-
ఐఏఎస్ రోహిణి సింధూరి నా భూమిని కబ్జా చేశారు.. ప్రముఖ సింగర్ ఫిర్యాదు
బెంగళూరు : కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదం చిక్కుకున్నారు. బెంగళూరు శివార్లలోని తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ అధికారిణి, ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్యనటుడు మెహమూద్ అలీ కుమారుడు,గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. వివాదాస్పద ఆస్తి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.తన భూమి కబ్జాకు గురైందని కలెక్టర్ రోహిణి సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.pic.twitter.com/GeUF0N9Y4k— Lucky Ali (@luckyali) June 20, 2024లక్కీ అలీకి, రోహిణి సింధూరి ట్రస్ట్‌కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం కొనసాగుతుంది. కొన్నేళ్ల క్రితం తన భూమి కబ్జాకు గురవుతుందని, సదరు ఐఏఎస్ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని లక్కీ అలి ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు. వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికి 'ల్యాండ్ మాఫియా' కుట్ర పన్నిందని కూడా ఆయన పేర్కొన్నారు.డిసెంబర్ 2022లో, అలీ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఒక థ్రెడ్‌లో ట్యాగ్ చేసి, ట్రస్ట్ యాజమాన్యంలోని తన వ్యవసాయ భూమిని రోహిణి సింధూరి, సుధీర్ రెడ్డి,మధు రెడ్డి సహాయంతో ల్యాండ్ మాఫియా అక్రమంగా లాక్కుంటున్నారని తెలిపారు. తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. -
Mallareddy: మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఒంగోలులో భూకబ్జాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది
-
రామోజీ రావు పై భూకబ్జా కేసుకు సీపీఎం డిమాండ్
-
భూ కబ్జా కేసుపై ఎంపీ టీజీ వెంకటేష్ స్పందన
-
బంజారాహిల్స్ భూ కబ్జా కేసు.. ఎంపీ టీజీ వెంకటేష్ క్లారీటి
సాక్షి, హైదరాబాద్: తనకు బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీ జెమ్స్ భూ కబ్జా కేసుపై ఆయన స్పందిస్తూ.. వివాదం బయటకు వచ్చినపుడు తాను లక్షద్వీప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. టీజీ విశ్వప్రసాద్.. భూ కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయన్నారు. చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..? ‘‘ముందుగా టీజీ వెంకటేష్ పేరు ఎఫ్ఐఆర్లో లేదు. రెండవ రోజు ఎఫ్ఐఆర్లో టీజీ వెంకటేష్ పేరు చేర్చారు. బంజారాహిల్స్ ఆస్తి కోసం రెండు వర్గాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. నాకు ఈ కేసుతో సంబంధం లేదని టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. టీజీ అనే పేరు ఉన్నంత మాత్రాన నన్ను ఈ వివాదంలోకి లాగడం సరికాదు. మా వంశీయులు ఎందరో టీజీ పేరుతో కొనసాగుతున్నారు. నేను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పర్యటనలో భాగంగా లక్షద్వీప్ వచ్చాను. ఏపీ జెమ్స్ ప్రతినిధులు సైతం ఈ కేసుతో నాకు సంబంధం లేదని తెలిపారు’’ అని టీజీ వెంకటేష్ వివరణ ఇచ్చారు. -
Land Grab: టీజీ రౌడీయిజం.. రూ.100 కోట్ల ఆస్తిపై కన్ను
సాక్షిప్రతినిధి కర్నూలు: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ. వందకోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయబోయిన వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ–1గా విశ్వప్రసాద్, ఏ–5గా టీజీ వెంకటేష్ ఉన్నారు. సినీఫక్కీలో జరిగిన ఈ కబ్జా వ్యవహారం హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పార్క్ నిర్మించేందుకు రెండు ఎకరాల స్థలం కేటాయించారు. ఆ సంస్థ కొంత మేర నిర్మాణాలు చేపట్టి, ఆపై వదిలేసింది. ఇందులో 2,250గజాలు(అరెకరం) స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ స్థలంపై వీవీఎస్ శర్మ అనే వ్యక్తి కన్నుపడింది. దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఆపై స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు తన బలం సరిపోదని, ఎవరైనా బలమైన వ్యక్తులు అవసరమని వీవీఎస్ శర్మ భావించారు. ఈ క్రమంలో స్థలాన్ని తాను కొనుగోలు చేస్తానని, వివాదం తానే సెటిల్చేసుకుంటానని టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగారు. తక్కువ మొత్తానికి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రౌడీల సాయంతో స్వాధీనం చేసుకునే యత్నం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పంచాయితీకి ప్రయతి్నంచారు. అయితే ఒరిజనల్ డాక్యుమెంట్లు నిర్మాణ సంస్థకు ఉండటం, వారు పంచాయితీకి ఒప్పుకోకపోవడంతో టీజీ విశ్వప్రసాద్ యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఆదోని, మంత్రాలయంతో పాటు హైదరాబాద్‌లోని మరికొంతమంది రౌడీలను తీసుకుని ఆదివారం స్థలం స్వాధీనం చేసుకునేందుకు జేసీబీలతో వెళ్లారు. రెడీమేడ్‌గా ఓ కంటైనర్ ఆఫీసును తీసుకుని వెళ్లి అక్కడ ఉంచారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు జెమ్స్ అండ్ జ్యూవెలరీ గార్డు నవీన్‌కుమార్ యతి్నస్తే అతనిపై దాడికి దిగారు. దీంతో నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరందరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంలో టీజీ వెంకటేష్ ఈ కేసులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ3, ఏ4గా ఉన్న సుభాశ్‌పోలిశెట్టి, మిథున్కుమార్లు ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్నారు. అర్ధరాత్రి మూత్రం వస్తోందని చెప్పి స్టేషన్ నుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదోని, మంత్రాలయానికి చెందిన వారే 50మంది ఈ వ్యవహారంలో 63 మందిపై బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ–1గా టీజీ విశ్వప్రసాద్, ఏ2గా వీవీఎస్ శర్మ, ఏ3గా సుభాశ్‌పోలిశెట్టి, ఏ–4గా అల్లు మిథున్‌కుమార్, ఏ–5గా టీజీ వెంకటేశ్, ఏ–13గా మల్లికార్జున అలియాస్ మల్లప్ప పేర్లు చేర్చారు. వీరిలో ఏ–1 విశ్వప్రసాద్ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి, వ్యవహారానికి సూత్రధారి. ఏ–2 వీవీఎస్ శర్మ అనే వ్యక్తి తప్పుడు రికార్డులు సృష్టించి, స్థలాన్ని విశ్వప్రసాద్‌కు విక్రయించిన వ్యక్తి. తక్కిన వారంతా విశ్వప్రసాద్‌కు వ్యాపార భాగస్వాములు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న వ్యక్తులు. నవీన్ పోలిశెట్టి తూర్పుగోదావరి జనసేన పార్టీ కనీ్వనర్. అలాగే మల్లికార్జున అనే వ్యక్తి ఆదోని వాసి. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆదోని నుంచి 20 మంది, మంత్రాలయం నుంచి 30 మంది రౌడీలను తీసుకెళ్లింది మల్లికార్జున. ఈ 50 మందిని పోలీసులు విచారిస్తే ఈ విషయం చెప్పారు. దీంతో పాటు తామంతా టీజీ వెంకటేష్ మనుషులమని, ఆయన అండతోనే ఇక్కడకు వచ్చినట్లు మల్లికార్జున చెప్పడంతో కేసులో టీజీ వెంకటేష్ పేరును పోలీసులు చేర్చారు. -
భూ కబ్జా కేసులో టీడీపీ నేత, డాక్యుమెంటు రైటర్ అరెస్టు
మదనపల్లె టౌన్: భూ కబ్జా కేసులో టీడీపీ నాయకునితో పాటు డాక్యుమెంటు రైటర్‌ను ఒకటో పట్టణ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. మదనపల్లె వన్‌టౌన్ సీఐ ఈదురు బాషా, ఎస్ఐ లోకేష్ కథనం మేరకు, మదనపల్లె మండలం, బసినికొండలోని ముంబయి–చెన్నై జాతీయ రహదారి పక్కన డ్రైవర్స్ కాలనీకి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 718–3ఏలో 2.43 ఎకరాల డీకేటీ భూమిని కబ్జా చేసి, తప్పుడు రికార్డులు సృష్టించారు. ఈ వ్యవహారంలో జూలై 1వ తేదీన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక బాలాజీనగర్‌లో ఉండే టీడీపీ నాయకుడు మూనే రాజశేఖర్‌తోపాటు ఉదయ్‌కుమార్, వాసుదేవరెడ్డి, సీటీఎంలో ఉండే శివాణి, అప్పటి తహసీల్దార్లు రమాదేవి, సీఎస్ సురేష్‌బాబు(లేట్), సివి శివరామిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు సీఆర్ మంజుల, పాళెం శ్రీనివాసులు, సయ్యద్ అహ్మద్, వీఆర్వో శ్రీనివాసులు, డాక్యుమెంట్ రైటర్ నాగరాజ, సయ్యద్ ముస్తాఫాసిరాజ్, కిరణ్, షేక్ ఫరీదాబేగంను నిందితులుగా పేర్కొంటూ నాన్ బెయిలబుల్, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు రాజశేఖర్, నాగరాజను గురువారం రాత్రి వారి ఇంట్లోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని స్థానిక ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండు విధించినట్లు చెప్పారు. ఈ భూ కబ్జా, తప్పుడు రికార్డులు సృష్టించిన కేసులో మొత్తం 15 మందిలో ఇద్దరిని అరెస్టు చేయగా, ఒకరు (తహసీల్దార్ సురేష్‌బాబు) మృతి చెందారని మిగతా 12 మందిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ ఈదురుబాషా తెలిపారు. -
మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మకై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. (చదవండి : భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!) -
భూవివాదంలో ఏపీ పోలీసు అధికారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : భూవివాదంలో ఏపీ పోలీసు అధికారి నాగ దుర్గా ప్రసాద్‌ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్ భూమిని వేరే మహిళను తన భార్యగా చూపి విక్రయించిన కేసులో అసిస్టెంట్ కమాండెంట్ నాగ దుర్గా ప్రసాద్(డీఎస్పీ)ను అరెస్ట్ చేశారు. తిరుపతిలో దుర్గాప్రసాద్‌ను ఎస్ఐ నర్సింహ అరెస్ట్ చేసి బాచుపల్లికి తరలించారు. మహిళ భర్తపైనా దాడి చేసినట్టు నాగప్రసాద్‌పై ఆరోపణలున్నాయి. -
నయీమ్ భూకబ్జా కేసు మళ్లీ వాయిదా
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భూకబ్జా కేసును భువనగిరి ఆర్డీఓ వచ్చేనెల 19వ తేదీకి వాయిదా వేశారు. భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లిలోని సర్వే నంబర్ 722, 723, 724తో పాటు 733 వరకు ఉన్న భూమిపై నమోదైన భూ కబ్జా కేసు వివాదంపై ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి శనివారం తన కార్యాలయంలో విచారణ చేపట్టారు. పట్టాదారులైన లక్ష్మీనరసింహనగర్ కాలనీ అసోసియేషన్‌కు చెందిన 200 మంది సభ్యులు విచారణకు హాజరై తమకు తమ ప్లాట్లను ఇప్పించాలని ఆర్డీఓను కోరారు. ఈ మేరకు 2003-04 సంవత్సరంలో హక్కుదారుగా ఉన్న లక్ష్మీనరసింహనగర్ కాలనీ వారినే పట్టదారులుగా చేర్చుతూ ఆర్డీఓ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమకు ప్లాట్లు ఇప్పించాలని కాలనీ వాసులు ఆర్డీఓను కోరగా తదుపరి విచారణ జరిగే సమయానికి సంబంధిత ప్లాట్లు, భూములపై తమకు ఉన్న హక్కులను, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే వారికి ప్లాట్లను ఇప్పిస్తామని ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు వాయిదాలు జరిగాయి. మొదటిసారి జూలైలో, రెండోసారి ఆగస్టులో, మూడోసారి సెప్టెంబర్ నెలలో 3న విచారణ, నాలుగోసారి అక్టోబర్ 1న విచారణ జరగగా మళ్లీ నవంబర్ 19కి వాయిదా పడినట్లు చెప్పారు. ఈ విచారణ కార్యక్రమంలో తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి పులికంటి నరేష్, యాకుబ్, కాశీశ్వర్, రాజేందర్, మల్లేష్, శ్యాంసుందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
భూ దురాక్రమణపై విచారణకు సిద్ధమా ?
గన్నవరం : ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రాజధాని భూదురాక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి నారాయణ సామాజిక సేవ చేసేందుకుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. భూములు కొంటే తప్పేంటాని సీఎం చంద్రబాబు బాధ్యత రహితంగా మాట్లాడడం సిగ్గుచేటాన్నారు. విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని నిలదీశారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటగిరి వరప్రసాదరావు, కాసరనేని గోపాలరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లి రాజశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
టీడీపీ నేత వర్ల రామయ్యపై భూ ఆక్రమణ కేసు
విజయవాడ: టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యపై భూ ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తాయి. దళిత సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. భవానీపురం పోలీస్ స్టేషన్లో రామయ్యపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 405, 3, ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ(1984) చట్టం కింద రామయ్యపై పో్లీసులు కేసు నమోదు చేశారు.