Hyderabad Land Grab: MP TG Venkatesh Responds To Land Grab In Banjara Hills - Sakshi
Sakshi News home page

Banjara Hills Land Grab: బంజారాహిల్స్‌ భూ కబ్జా కేసు.. ఎంపీ టీజీ వెంకటేష్‌ క్లారీటి

Published Wed, Apr 20 2022 11:15 AM | Last Updated on Wed, Apr 20 2022 12:27 PM

MP TG Venkatesh Responds To Land Grab In Banjara Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనకు బంజారాహిల్స్‌ ల్యాండ్ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. ఏపీ జెమ్స్‌ భూ కబ్జా కేసుపై ఆయన స్పందిస్తూ.. వివాదం బయటకు వచ్చినపుడు తాను లక్షద్వీప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. టీజీ విశ్వప్రసాద్‌.. భూ కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయన్నారు.

చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..?  

‘‘ముందుగా టీజీ వెంకటేష్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదు. రెండవ రోజు ఎఫ్‌ఐఆర్‌లో టీజీ వెంకటేష్‌ పేరు చేర్చారు. బంజారాహిల్స్‌ ఆస్తి కోసం రెండు వర్గాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. నాకు ఈ కేసుతో సంబంధం లేదని టీజీ విశ్వప్రసాద్‌ స్పష్టం చేశారు. టీజీ అనే పేరు ఉన్నంత మాత్రాన నన్ను ఈ వివాదంలోకి లాగడం సరికాదు. మా వంశీయులు ఎందరో టీజీ పేరుతో కొనసాగుతున్నారు. నేను పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో భాగంగా లక్షద్వీప్‌ వచ్చాను. ఏపీ జెమ్స్‌ ప్రతినిధులు సైతం ఈ కేసుతో నాకు సంబంధం లేదని తెలిపారు’’ అని టీజీ వెంకటేష్‌ వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement