ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రాజధాని భూదురాక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని వైఎస్సార్
గన్నవరం : ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రాజధాని భూదురాక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి నారాయణ సామాజిక సేవ చేసేందుకుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. భూములు కొంటే తప్పేంటాని సీఎం చంద్రబాబు బాధ్యత రహితంగా మాట్లాడడం సిగ్గుచేటాన్నారు.
విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని నిలదీశారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటగిరి వరప్రసాదరావు, కాసరనేని గోపాలరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లి రాజశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.