యశవంతపుర: హాసన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న తనను బదిలీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ న్యాయం పోరాటం చేస్తున్న రోహిణి సింధూరికి హైకోర్టు ఆదేశం తీవ్ర నిరాశ కలిగించింది. శుక్రవారం సింధూరి బదిలీ విషయంపై హైకోర్టు న్యాయమూర్తులు హెచ్‌జీ రమేశ్, బీ.శ్రీనివాస్‌గౌడల ధర్మాసనం ఇటీవల ప్రాథమిక విచారణను పూర్తి చేసి తమ తీర్పును ప్రకటించింది.
కేంద్ర పాలన మండలి ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. అయితే ప్రభుత్వం బదిలీ చేసిన ఉద్యోగ, శిక్షణ శాఖ అధికారిగా బాధ్యతలను స్వీకరించాలని రోహిణి సింధూరికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పట్టు వదలకుండ న్యాయ పోరాటం చేసిన ఆమెకు చివరకు నిరాశ మిగిలింది. హాసన్ జిల్లా కలెక్టర్‌గా కాకుండా ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన పదవిలో కొనసాగాలని ఆదేశిస్తూ కేసు విచారణను మే 30కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment