రోడ్డు ప్రమాద కేసులో ముగ్గురికి రిమాండ్
Published Tue, Aug 2 2016 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఓర్వకల్లు:
కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై ఈనెల 30వ తేదీన రాత్రి హుశేనాపురం–కాల్వబుగ్గ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాద కేసులో ముగ్గురిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తెలిపారు. జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎన్.కొంతలపాడు గ్రామానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ దేవానందం ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మతి చెందిన విషయం విధితమే. రహదారి విస్తరణ పనులలో కెఎంసీ కంపెనీకి చెందిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు కర్నూలు తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు కేఎంసీ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజశేఖర్, ఇంజనీరింగ్ అధికారులు సూలం సుధాకర్, మనోహర్‌రెడ్డి, డిప్యూటి ప్రాజెక్టు మేనేజర్ సుప్రసాద్‌దాసులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరిలో సుప్రసాద్ దాసు మినహా పైముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి వీరికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement