
సాక్షి, గుంతకల్లు: కోడలిని హతమార్చిన కేసులో మామను రిమాండ్‌కు తరలించారు. వివరాలను గుంతకల్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చిన్న గోవిందు, ఎస్‌ఐ నరేంద్ర వెల్లడించారు. పాత గుంతకల్లులోని చెట్టప్పబావి వీధికి చెందిన జ్యోతి భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఆ సమయంలో అందిన బీమా పరిహారం, ఇతర డబ్బు మొత్తం దాదాపు రూ.10 లక్షల వరకు మామ మల్లికార్జున తన వద్దే ఉంచుకున్నారు.
ఈ విషయంగా భర్త వాటా తనకివ్వాలని మల్లికార్జునను జ్యోతి అడుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె పుట్టింటికి చేరుకున్నారు. ఈ నెల 1న ఆమెను ఇంటికి రప్పించుకుని రోకలితో బాది హతమార్చాడు. పరారీలో ఉన్న మల్లికార్జునను సోమవారం ఉదయం దోసలుడికి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.