ఆస్తి కోసమే కడతేర్చారు
-
రోకలిబండతో దాడిచేసిన భార్య, గొంతు నులిమిన కూతురు, అల్లుడు
-
బానోత్ భిక్షపతి హత్య కేసును ఛేదించిన పోలీసులు
-
నిందితుల అరెస్టు, రిమాండ్
మామునూరు : మహబూబాబాద్ మండలం ఆమనగల్ శివారు కస్నాతండాకు చెందిన బానోత్ భిక్షపతి (53)ని కూతురు, అల్లుడితో కలిసి భార్య రాముల మ్మ హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను ఆదివారం ఉదయం అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మా మునూరు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి.శ్రీనివాస్,ఎస్సై రాంప్రసాద్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిం చారు. బానోత్ భిక్షపతి, అతడి భార్య రాములమ్మ వ్యవసాయం చేస్తూ జీవించేవారు. వీరి ఏకైక కుమా ర్తె సునిత. బానోత్ భిక్షపతి కస్నా తండాలో తమకు ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి, పదిహేను సంవత్సరాల క్రితమే కుటుంబంతో సహా హన్మకొండ మండలం తిమ్మాపురం శివారులోని మంగళమ్మకుంటకు వచ్చాడు.వరంగల్,గవిచర్ల రహదారిపై రాంగోపాలపురంలో 1.20 గుంటల భూమిని కౌలుకు తీసుకొని గులాబీ తోట పెంచసాగాడు.
భూమిని అల్లుడి పేరిట రాయకపోవడంతో..
ఇటీవలకాలంలో కస్నా తండాలోని రెండు ఎకరాల భూమిని అల్లుడి పేరిట రాయాలంటూ భార్య రాములమ్మ భిక్షపతిపై ఒత్తిడి పెంచింది. అతడు మాత్రం మాట లెక్క చేయలేదు. కూతురి పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈక్రమంలోనే జూలై 18న భిక్షపతిని హతమార్చాలని భార్య, కూతురు, అల్లుడు మూకుమ్మడి పథకాన్ని రచించారు. అదేరోజు రాత్రి 11 గంటలకు భిక్షపతి తలపై భార్య రాములమ్మ రోకలిబండతో గట్టిగా మోదింది. అనంతరం బిడ్డ, అల్లుడు గొంతు నులిమి ఊపిరితీశారు. ఈవిషయాన్ని బిడ్డ కుమారుడు రాంచరణ్(6) గత నెల 28న బంధువులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం మంగళమ్మకుంటలోని ఇంటి వద్ద ఉన్న మృతుడి భార్య రాములమ్మ, అల్లుడు లావుడ్యా హోంజి, బిడ్డ సునితలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకోసం వారు వినియోగించిన సైకిల్, రోకలి బండ, పార, చీరను స్వాధీనం చేసుకున్నారు.