
రెండో దశ విజృంభిస్తోంది. అయినా ఈ మహమ్మారిపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
కాశీబుగ్గ: కరోనా తీవ్రతను కొందరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. మొదటి దశలో జిల్లా అంతా ఇబ్బంది పడింది. రెండో దశ విజృంభిస్తోంది. అయినా ఈ మహమ్మారిపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడి షాపు యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో మెడికల్ సిబ్బంది ఫోన్ చేసి విషయం చెప్పారు.
అటు నుంచి ఆయన ‘పకోడి రుబ్బు ఉందమ్మా ఇప్పుడే రుబ్బేసున్నాము అది అయ్యాక వస్తానమ్మా’ అని సమాధానం చెప్పారు. బాధితుడి మాటలు విన్న మెడికల్ సిబ్బందికి ఓ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే తేరుకుని ఆయనకు చీవాట్లు పెట్టి బలవంతంగా 108లోకి ఎక్కించారు.
చదవండి:
అయ్యో బిడ్డా: దూసుకొచ్చిన మృత్యువు
అంతకంతకూ కోవిడ్ విజృంభణ, అసలేం జరుగుతోంది?